‘ఎవడు తక్కువకాదు’ టీజర్, పాటకు అద్భుత స్పందన!

‘పూర్ణక్క వస్తేనే లింగ వెళతాడు’ – ‘ఎవడు తక్కువ కాదు’ సినిమా టీజర్ లో ఉన్నది ఒక్కటే డైలాగ్. అయితే… ఆ ఒక్కటీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో పతాక సన్నివేశాల్లో అన్వర్ పాత్రలో ప్రేక్షకులు అందర్నీ ఆకట్టుకున్న లగడపాటి విక్రమ్ సహిదేవ్, మరోసారి ‘ఎవడు తక్కువ కాదు’ టీజర్ లో ఇంటెన్స్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు.

‘రేసు గుర్రం’, ‘పటాస్’, ‘రుద్రమదేవి’, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’, ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ సినిమాల్లో బాల నటుడిగా ప్రేక్షకుల ప్రసంశలు అందుకున్న విక్రమ్ సహిదేవ్… ‘ఎవడు తక్కువ కాదు’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రమిది. ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’… ఉపశీర్షిక. రఘు జయ దర్శకుడు. సోమవారం చిత్రంలో తొలి పాట ‘లైఫ్ ఈజ్ ఏ క్యాసినో’ విడుదల చేశారు. ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.

నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ “టీజర్, పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. విక్రమ్ సహిదేవ్ డైలాగ్ డెలివరీ బావుందని ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉంది. ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్… అనేది ప్రధాన పాత్రలో నటిస్తున్న విక్రమ్ సహిదేవ్ క్యారెక్టర్ కు ఫ‌ర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. న్యూ ఏజ్ రివెంజ్ డ్రామా ఇది. బాల నటుడిగా ఆకట్టుకున్న మా విక్రమ్ సహిదేవ్, కథకు తగ్గట్టు వైవిద్యమైన పాత్రలో కనిపిస్తాడు. యాక్ష‌న్‌తో పాటు అందమైన టీనేజ్ ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. ‌‌‌‌‌‌‌ మా సంస్థలో ఇది ఓ మంచి సినిమాగా నిలవటంతో పాటు, విక్రమ్ మంచి పేరు తీసుకొస్తుందని నమ్మకంగా ఉన్నాం. త్వరలో పాటలను, ఈ నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

ప్రియాంక జైన్ కథానాయికగా, రఘు కారుమంచి కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి హరి గౌర సంగీత దర్శకుడు. రఘు జయ దర్శకుడు. లగడపాటి శ్రీధర్ నిర్మాత. లగడపాటి శిరీష సమర్పణ.

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange