వివి వినాయ‌క్ కూడా మొండిఘ‌ట‌మే..

ఎవ‌రేం చెప్పినా ఇప్పుడు వినాయ‌క్ వినేలా లేడు. పోకిరిలో మ‌హేశ్ ఒక్క‌సారి క‌మిటైతే నా మాట నేనే విన‌ను అంటున్నాడు. ఇప్పుడు బాల‌య్య‌తో సినిమాకు సిద్ధం అయ్యాడు క‌దా.. ఆయ‌న‌తోనే త‌న త‌ర్వాతి సినిమా అంటున్నాడు. ఆల‌స్యం అవుతుంది క‌దా అంటే ఏం ప‌ర్లేదు వేచి చూస్తా కానీ ఆయ‌న‌తోనే సినిమా చేస్తా అంటున్నాడు. ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ కూడా ఉంది. ఇప్పుడు వినాయ‌క్ తో సినిమాలు చేయ‌డానికి హీరోలు ఎవ‌రూ ఖాళీగా లేరు.
పోనీ సినిమాలు వ‌దిలేసేంత క్రేజ్ కూడా ఇప్పుడు వినాయ‌క్ కు క‌నిపించ‌డం లేదు. వ‌ర‌స ఫ్లాపుల‌తో పాపం ఇప్పుడు ఈయ‌న ఎవ‌రు ఛాన్స్ ఇస్తారా అని చూస్తున్నాడు. ఈ టైమ్ లో బాల‌య్య దేవుడులా క‌నిపించాడు. కానీ అంత‌లోనే ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటూ వెళ్లిపోయాడు. కానీ ఇది పూర్త‌య్యాక మాత్రం వినాయ‌క్ తోనే సినిమా ఉంటుంద‌ని తెలుస్తుంది. కెరీర్ మొద‌లుపెట్టిన త‌ర్వాత ఇంత ఖాళీగా ఎప్పుడూ లేడు వినాయ‌క్. ఈ ద‌ర్శ‌కుడి ఫ్యూచ‌ర్ పై ఇప్పుడు లేనిపోని అనుమానాలు కూడా వ‌స్తున్నాయి.
ఈయ‌న‌కు ఇప్పుడు సినిమాలు అంటే పెద్ద‌గా ఆస‌క్తి లేద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. రాజ‌కీయాల్లో చురుగ్గా ఉండాల‌నుకుంటున్నట్లు గోదారి జిల్లాల క‌బురు. దానికి త‌గ్గ‌ట్లే సొంతూళ్ళో బ‌ల‌గం కూడా సిద్ధం చేసుకుంటున్నాడు వినాయ‌క్. అటు సెట్ చేసుకుంటూనే.. ఇటు సినిమాల్లోనూ ఉన్నాడు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాన‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌రి బాల‌య్య ఇచ్చిన ఆఫ‌ర్ అయినా వినాయ‌క్ వాడుకుంటాడో లేదో..?

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange