విజ‌య్ పై కావాల‌నే క‌క్ష్య క‌డుతున్నారా..?

ఏమో ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. త‌మిళ్ లో ర‌జినీ త‌ర్వాత అంత‌టి ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవ‌రైనా ఉన్నారంటే అది ఒక్క విజ‌యే. విజ‌యాల్లో కానీ.. వ‌సూళ్ల‌లో కానీ ఇది ప్రూవ్ అయింది కూడా. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ స్టార్ హీరోను కావాలనే ప్ర‌తీ సినిమాకు టార్చ‌ర్ చేస్తున్నార‌నేది ఈజీగా చూసే ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మైపోతుంది. విజ‌య్ సినిమా విడుద‌ల‌వుతుందంటే చాలు.. ఏదో ఓ కాంట్ర‌వ‌ర్సీ కావాల‌నే తీసుకొచ్చి విజ‌య్ నెత్తిమీద ప‌డేస్తున్నారు. అమ్మ ఉన్న‌పుడైనా.. లేన‌ప్పుడైనా విజ‌య్ సినిమాల‌కు ఈ తిప్ప‌లు త‌ప్ప‌డం లేఊదు. వివాదం వెతుక్కుంటూ ఈ హీరోను ప‌ల‌క‌రించాల్సిందే. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. విజ‌య్ న‌టిస్తున్న స‌ర్కార్ మ‌రో ప‌ది రోజుల్లో విడుద‌ల కానుంది ఈ టైమ్ లో సినిమా నిలిపేయాలంటూ కోర్ట్ లో కేస్ ఫైల్ అయింది.
అప్పుడెప్పుడో విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ నుంచే ర‌చ్చ మొద‌లైంది. అందులో స్మోకింగ్ ను విజ‌య్ ఎంక‌రేజ్ చేసాడంటూ మాజీ ఆరోగ్య శాఖా మంత్రి అన్బుమ‌ని రామ‌దాస్ కాంట్ర‌వ‌ర్సీకి తెర‌లేపారు. దాన్ని కావాల‌నే పెద్ద‌ది చేసారు. విజ‌య్ లాంటి స్టార్ హీరో ఇలా పొగ తాగ‌డాన్ని ఎంక‌రేజ్ చేయ‌డం సిగ్గుచేటు అంటూ పెద్ద పెద్ద ప‌దాల్ని కూడా వాడారు. గ‌తంలో ఈయ‌న త‌న సినిమాల్లో సిగ‌రెట్ తాగ‌డాన్ని అస్స‌లు చూపించ‌న‌ని చెప్పాడ‌ని.. కానీ ఇప్పుడు చెప్పిన మాట‌ను కూడా మ‌రిచిపోయాడ‌ని ఎద్దేవా చేసారు. ఆ ఫోటో క్లిప్పింగ్స్ పెట్టి ట్వీట్ చేసాడు. అయితే దీనిపై విజ‌య్ ఫ్యాన్స్ కూడా తీవ్రంగానే కౌంట‌ర్ ఇస్తున్నారు. ఓ సినిమా చేసిన‌పుడు అందులో మంచిని తీసుకుంటే అంద‌రికి మంచిద‌ని.. కావాల‌నే ఒక్క విష‌యాన్ని హైలైట్ చేయ‌డం వ‌ల్ల వ‌చ్చే లాభ‌మేంటో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదంటున్నారు.
త‌మ హీరోను లేనిపోని వివాదాల్లోకి లాగ‌డానికి కాక‌పోతే ఎందుకు స‌ర్కార్ సినిమా ను ఎందుకు కార్న‌ర్ చేస్తున్నార‌ని వాళ్ళు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక ఇప్పుడు వ‌రుణ్ రాజేంద్ర‌న్ అనే రైట‌ర్ కూడా ఈ క‌థ త‌న‌ద‌ని.. మురుగ‌దాస్ కాపీ కొట్టాడ‌ని కేస్ వేసాడు. దీనిపై మురుగ‌దాస్ మాట్లాడుతూ కేవ‌లం ఇది పబ్లిసిటీ కోసం ఆడుతున్న డ్రామా అని తేల్చేసాడు. అస‌లు విడుద‌ల విడుద‌ల కాకుండా.. అదెలా ఉంటుందో తెలుసుకోకుండా ఎలా ఇది త‌న క‌థ అని చెబుతారంటూ ప్ర‌శ్నిస్తున్నాడు ఆయ‌న‌. ఆయన చేస్తున్న కాపీ ఆరోపణలను తాను కోర్టులో ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లుగా మురుగదాస్ ప్రకటించాడు. సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఇదంతా చూస్తుంటే ప్ర‌తీసారి కూడా విజ‌య్ సినిమా వ‌స్తుందంటే కావాల‌నే కొంద‌రు కాంట్ర‌వ‌ర్సీల‌కు తెర తీస్తున్న‌ట్లు అనిపిస్తుంది.

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange