ఏందిరయ్యా ఈ నోటా ట్రైలర్…. రౌడీస్ డిసప్పాయింట్ అయ్యారా….

విజయ్ దేవరకొండ లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్. నో డౌట్ ఎబౌట్ ఇట్. గీత గోవిందంతో స్టార్ హీరోలు సైతం అసూయపడే రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నాడు. అలాంటి విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న తర్వాతి సినిమా నోటా. తమిళ దర్శక నిర్మాతలు రూపొందిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ఎంతో ఆశగా ఎదురుచూసినోళ్లను ట్రైలర్ బాగా డిసప్పాయింట్ చేసింది. విజయ్ నుంచి ఆశించే అంశాలు అస్సలు కనిపించలేదు. సీరియస్ పొలిటికల్ డ్రామాగా నోటా తెరకెక్కించారు. చాలా ఏళ్లుగా మనం తెలుగు సినిమాల్లో చూస్తున్న రాజకీయ మలుపులే కనిపించాయి.. తప్ప కొత్తదనం ఎక్కడా కనిపించలేదు. విజయ్ ని అతిగా ఇష్టపడే రౌడీస్ కూడా చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు.

నోటా నోటి నిండా తమిళ డైలాగులే. పట్టి పట్టి చెప్పే తమిళ డైలాగ్స్ తో నోట్లో కంకర రాళ్లు పోసినట్టుగా అనిపించింది ట్రైలర్. విజయ్ దేవరకొండ తెలుగు హీరో. అలాంటి తెలుగు హీరో సినిమాను ద్వి భాషా చిత్రం పేరుతో నిర్మించి తమిళ నేటివిటీతో గందరగోళం సృష్టించారు. గీత గోవిందం తో వచ్చిన క్రేజ్ ను తమిళ దర్శక నిర్మాతలు చెడగొట్టేలా కనిపించారు. పొలిటికల్ మైండ్ గేమ్, వీడియో గేమ్ తో ఏదో లింక్ చేసి కంగాళీ సృష్టించనట్టుగా కనిపిస్తోంది. హీరోయిన్ మెహ్రీన్ ఇందులో కూరలో కరివేపాకు క్యారెక్టర్ లా కనిపించింది.

నోటా ట్రైలర్ లో ఇప్పటికైతే చాలా సినిమాలు చూపించారు. ఈ మధ్యే వచ్చిన భరత్ అనే నేను సినిమాను విజయ్ దేవరకొండ మీద ట్రైలర్ కట్ చేసినట్టుగా ఉంది. ఇక అసలు సినిమాలో ఎన్ని సినిమాలు చూపిస్తారనేది చూడాల్సిన విషయం.

కొన్నిసార్లు ట్రైలర్స్ పాత చింతకాయ పచ్చడిలా ఉన్నా… సినిమాలు బాగుంటాయి. కేవలం అదే ఆశతో నోటా సినిమా కోసం వెయిట్ చేయక తప్పదు.

Wordpress Social Share Plugin powered by Ultimatelysocial
Secured By miniOrange