“రోషగాడు” థీమ్ సాంగ్ విడుదల

విజయ్ ఆంథోని నటిస్తొన్న తాజా చిత్రం “రోషగాడు”. ఈ వైవిధ్యమైన హీరో తొలిసారి
పవర్ ఫుల్ పొలీసాఫీసర్ పాత్రలో నటిస్తొన్న ఈ చిత్రానికి గణేష దర్శకుడు. విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంథోని నిర్మిస్తొన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ థీమ్ సాంగ్ ను ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విడుదల చెశారు.
“రోషగాడు రా..వీడు మాటంటే పడడురా “
అంటూ భాష్య శ్రీ రాసిన లిరిక్ తో ఆద్యంతం ఆకట్టుకునెలా రోషగాడు థీమ్ సాంగ్ విడుదలైంది. విజయ్ ఆంథోని సరసన నివేథా పేతురాజ్ హీరొయిన్ గా నటిస్తుండగా , ఫైట్ మాస్టర్ దీనా ఓ ప్రముఖ పాత్రలో అలరించనున్నారు. కంటెంట్ కు ప్రాధాన్యత నిస్తూ, పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న “రోషగాడు” అతి త్వరలొనె ప్రేక్షకుల ముందుకు రానుంది‌.
ఈ చిత్రానికి
మాటలు-పాటలు: భాష్య శ్రీ
సంగీతం: విజయ్ ఆంథోని
నిర్మాణం:విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ , నిర్మాత :ఫాతిమా విజయ్ ఆంటోని. కథ-దర్శకత్వం గణేష ,

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange