MUST READ

అడ్వెంచరస్ చిత్రం సంజీవని ఆడియో గ్రాండ్ రిలీజ్


గాల్లో ఎగిరే బ‌ల్లులు, తెలివైన కోతులు, ప‌ది అడుగుల సాలె పురుగులు ఇవన్నీ వెండితెర‌పై క‌నిపించి మ‌న‌ల్ని వాటి న‌ట‌న‌తో , యాక్ష‌న్ తో అబ్బుర‌ప‌రిచాయంటే అది త‌ప్ప‌కుండా హాలీవుడ్ చిత్ర‌మే అయి ఉంటుంది అని చెప్పొచ్చు, కాని ఈ సారి ఒక తెలుగు సినిమాలో వీటన్నిటినీ చూడ‌బోతున్నాం.. ఇవన్నీ తెలుగులో న‌టించాయి. స‌మ్మ‌ర్ లో సినిమాల‌కి వ‌చ్చే ప్రేక్ష‌కుల్లో పిల్ల‌లు, ఫ్యామిలీ ఆడియ‌న్స్ సంఖ్య ఎక్కువుగా వుంటుంది. వీరిని దృష్టిలో పెట్టుకుని జి.నివాస్ ప్రోడ్యూస‌ర్ గా, ర‌వి వీడే ద‌ర్శ‌కుడి గా మ‌నోజ్ చంద్ర‌, అనురాగ్ దేవ్‌, శ్వేత ప్ర‌ధాన పాత్ర‌ల్లో అనేక‌మంది హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ దాదాపు రెండు సంవత్సరాల పాటు పని చేసి, మొట్టమొదటిసారిగా మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాలజీని సమ‌ర్థ‌వంతంగా వాడి,దాదాపు 1000 కి పైగా వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్ తో అత్యంత భారీగా నివాస్ క్రియేషన్స్ బ్యాన‌ర్ లో నిర్మించిన చిత్రం సంజీవని. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ సంస్థ శ్రీ ల‌క్ష్మిపిక్చ‌ర్స్ ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన 

 

రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ... సినిమా తీసే వాళ్లకే సినిమా వాళ్ల కష్టాలు తెలుస్తాయంటారు. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఈ యంగ్ టీం ఎంతగా కష్టపడ్డారో అర్థమౌతోంది. ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవంతుందని నమ్ముతున్నాను. 

 

కె.ఎం..రాధాకృష్ణన్ మాట్లాడుతూ... ఈ సినిమా ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది. గ్రాఫిక్స్ చూస్తుంటే ఎంతగా కష్టపడ్డారో అర్థమౌతోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. కెమెరా వర్క్ నెక్ట్స్ లెవల్ లో ఉంది. దర్శకుడి కొత్త ఆలోచనతో వస్తున్న ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. 

 

లక్ష్మీ పిక్చర్స్ అధినేత బాపిరాజు మాట్లాడుతూ... ఈ సినిమా అత్యద్భుతంగా వచ్చింది. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గదు. నేను ఎన్నో సినిమాలకు కో డైరెక్టర్ గా పనిచేశాను. ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూటర్ గా రిలీజ్ చేశాను. ఈ సినిమా నేను చూసి కొన్నాను. నాకు ఈ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్ ఇచ్చినందుకు చిత్ర యూనిట్ కు చాలా థాంక్స్. ఈ సినిమా సూపర్ హిట్ కావడం ఖాయం. ఇది నా అనుభవంతో చెబుతున్నాను. అని అన్నారు. 

 

మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ మాట్లాడుతూ... నేను సంగీతం అందించిన చిత్ర ఆడియో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, నాకు ఇష్టమైన సంగీత దర్శకుడు కె.ఎం.రాధాకృష్ణన్ చేతుల మీదుగా లాంచ్ అవుతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. చాలా సంతృప్తిగా ఉంది. ఈ సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. అని అన్నారు. 

 

ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు ర‌వి వీడే మాట్లాడుతూ.. ప్ర‌పంచంలో రామాయణం బేస్ చేసుకుని ఎన్ని క‌థ‌లు వ‌చ్చినా కూడా సుంద‌ర‌కాండ ప‌ర్వం అనేది మ‌న సినీ ప‌రిశ్ర‌మ‌కి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్క సుంద‌ర‌కాండ లోనే తెలివైన కోతులు,గాల్లో ఎగిరే రకరకాల జంతువులు, అబ్బుర‌ప‌రిచే యుద్ధాలు వుంటాయి. 6 సంవత్సరాల పిల్ల‌ల నుండి60 సంవత్సరాల పెద్ద‌వాళ్ళ వ‌ర‌కూ ఆనందంతో ఉప్పొంగిపోయే స‌న్నివేశాలుంటాయి. అలాంటివి ఇప్ప‌టి వ‌ర‌కూ హాలీవుడ్ తెర‌పై మాత్ర‌మే క‌నిపించాయి. మొట్టమొదటిసారిగా భార‌త‌దేశంలో హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ తో క‌లిసి రెండు సంవ‌త్స‌రాలు, తెలుగులో మెష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాలజీని వాడి, దాదాపు1000 కి పైగా VFX షాట్స్ తో, ఇండియాలోనే కాకుండా కెన‌డా, ఆఫ్రికా, నేపాల్ దేశాల్లో అత్యద్భుతమైన లొకేషన్స్ లో అత్యంత క‌ష్ట‌త‌ర‌మైనా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా హాలీవుడ్ పిక్చ‌ర్ అనే రేంజి లో భారీ గ్రాఫిక్స్ తో నిర్మించిన చిత్రం మా సంజీవని. విజయేంద్ర ప్రసాద్ లాంటి వాళ్లు మా ఆడియోను రిలీజ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది.  ఈసినిమా మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. కెమెరా వర్క్ మెస్మరైజ్ చేస్తుంది. మా సినిమా కి వ‌చ్చిన ప్రేక్ష‌కుడు మ‌రో లోకంలో విహ‌రిస్తాడ‌నేది మేము గ్యారంటిగా చెప్ప‌గ‌ల‌ను.  ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని విడుద‌ల‌కి సిద్దంగా వుంది.  భారీ గ్రాఫిక్స్ చిత్రం గా చిన్న పిల్లల్ని,ఫ్యామిలీ ఆడియన్స్ ని అల‌రించే చిత్రం గా మా సంజీవని మొదటి స్థానంలో వుండ‌బోతుందని నమ్ముతున్నాం. మ‌నోజ్ చంద్ర‌, అనురాగ్ దేవ్‌, శ్వేత లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో చాలా బాగా నటించారు. మా చిత్రాన్ని ప్ర‌ముఖ సంస్థ శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్ వారు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ స‌మ్మ‌ర్ లో వ‌చ్చే ప్రేక్ష‌కుల‌కి అబ్బుర‌ప‌రిచే విన్యాసాల‌తో.. ఆశ్చర్యపోయే వింత‌ల‌తో.. అత్యంత ఉత్సుక‌త‌తో.. ఊహించ‌ని ఉత్సాహంతో మనసారా ఆస్వాదించే చిత్రంగా సంజీవని నిల‌బ‌డుతుంద‌ని మా న‌మ్మ‌కం.. మా నిర్మాత నివాస్ నన్ను నమ్మి ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమా షూటింగ్ అంతా సజావుగా సాగేందుకు ఎంతో కృషి చేశారు. ఆయనకు స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను. అనిఅన్నారు

 

 

Starring: Manoj Chandra, Anurag Dev, Swetha Varma, Amogh Deshapathi, Mohan, Nitin.

 

VFX: RockstoriesVFX, Canada; Vector Visual Magic, Hyderabad

 

Mountaineering Stunts: Shekhar Babu

 

VFX Supervision: Devi

 

VFX Producer: Akhil Gummadi

 

Sound Design: Saketh Komanduri

 

Camera & Editing: Venkat 

 

Music: Sravan KK 

 

Producer: G.Nivas

 

Written & Directed By Ravi Vide

Tags : Sanjeevani Grand Audio Launch    |   
Date published: Saturday, May 19, 2018, 02:41 PM

CommentsPallibatani Is Powered By pallibatani.com, Group of Individual Reporters With The Aim To Provide News To Regional Telangana & Andhra Pradesh People. Our Team Of Dynamic Journalists Strives To Gather Regional Data And Offers Modicum Quality In Pallibatani.Com Site. more...