MUST READ

అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ నేల టిక్కెట్టు ట్రైలర్‌


మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్లు ఉంటాయి. కుటుంబం మొత్తం సరదాగా కలిసి చూసే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి.

 

ఇక కళ్యాణ్‌కృష్ణ తీసింది రెండు సినిమాలే అయినా తనకంటూ ఒక క్లాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. మంచి కథా కథనంతో సరదాగా సాగిపోతూ ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పండించే సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు రవితేజతో 'నేల టికెట్టు' తీస్తున్నారు.‌

 

మరి ఒక మాస్ హీరో ఒక క్లాస్ దర్శకుడు కలిసి పని చేస్తే ఎలా ఉంటుంది? చాలా ఆసక్తి రేపిన ఈ ప్రశ్నకి నిన్న విడుదల చేసిన సినిమా ట్రైలర్ సమాధానం చెప్పేసింది.

 

"ఫస్ట్ టైం లైఫ్ లో అమ్మ, అక్క, చెల్లి కాకుండా ఒక కొత్త రిలేషన్ కనిపిస్తుంది."

 

"చుట్టూ జనం మధ్యలో మనం.. అది కదరా లైఫ్"

 

"ఎంత మంది కష్టాల్లో ఉన్నారో చూడరా.. కానీ సాయం చేసే వాడు ఒక్కడు లేడు"

 

"ముసలితనం అంటే చేతకానితనం కాదురా.. నిలువెత్తు అనుభవం"

 

లాంటి అద్భుతమైన అర్థవంతమైన కళ్యాణ్‌కృష్ణ మార్కు క్లాస్ డైలాగులు ఒక వైపు..

 

"నువ్వు రావటం కాదు.. నేనే వస్తున్నా.. ఇదే మూడ్ మెయిన్‌టైన్ చెయ్"

 

"నేల టిక్కెట్టు గాళ్ళతో పెట్టుకుంటే.. నేల నాకించేస్తారు"

 

లాంటి ఈలలు వేయించే రవితేజ మార్కు మాస్ డైలాగులు మరో వైపు.. చూస్తుంటేనే అర్థం అయిపోతుంది ఈ సినిమా క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతీ ఒక్కరినీ దృష్టిలో పెట్టుకుని తీసారని.

 

మే 25న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాని ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి  నిర్మించారు. రవితేజ సరసన మాళ్వికా శర్మ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.

 

*************************************************** 

 

*Mass Maharaja's "Nela Ticket" ‌trailer ticks all boxes of a hit film:

 

Mass Maharaja Ravi Teja's films are a full meals combo. His films are perfect mix bag of comedy, action, sarcastic dialogues and good emotions. And it is no surprise that he has such a huge mass following.

 

Having directed only two films, Kalyankrishna Kurasala has earned a class director's image. After directing two hit films with good story, screenplay and family emotions he is now making "Nela Ticket" with Ravi Teja.

 

There was a lot of curiosity  and buzz about how the movie is going to be as a class director and a mass hero are working together for the first time. And the trailer of 'Nela Ticket' released yesterday has answered this question.

With Kalyankrishna mark classy and meaningful dialogues like:

 

"First Time Life I can see a new relation apart from mother and sister."

 

"Being in the midst of the people around us ..  Isn't this what life is?"

 

"Look how many people are in trouble... yet there is no one to help"

 

"Old age is not a handicap. It is a life full of experience"

 

and Ravi Teja mark mass powerful dialogues like:

 

"I don't care if you come.. I'm coming myself.. Maintain the same mood.."

 

"If you provoke the Nela Ticket guys, they will rub your face on the floor"

 

It is clearly evident that the movie is going to entertain class, mass and family audience alike as promised by the makers.

 

Produced by Ram Talluri under SRT Entertainments banner 'Nela Ticket' going to release on May 25th. The film stars debutant Malvika Sharma as heroine along with Jagapathi Babu, Brahmanandam, Jayaprakash, Raghubabu, Ali, Posani Krishna Murali, Subbaraju, Annapurnamma, Priyadarshi, Surekha Vani and Praveen playing crucial roles. Fida fame Shakthikanth Karthick is composing the music, editing by Chota K.Prasad, Art Direction by Brahma Kadali and Mukesh is handling the cinematography.

Tags : Raviteja    |    nela ticket    |   
Date published: Thursday, May 17, 2018, 08:01 PM

CommentsPallibatani Is Powered By pallibatani.com, Group of Individual Reporters With The Aim To Provide News To Regional Telangana & Andhra Pradesh People. Our Team Of Dynamic Journalists Strives To Gather Regional Data And Offers Modicum Quality In Pallibatani.Com Site. more...