MUST READ

ఆనందం మూవీ రివ్యూ

Rating :

యూత్ ఫుల్ చిత్రాలైతే చాలు అది డబ్బింగ్ సినిమానా స్ట్రైయిట్ సినిమానా రీమేక్ సినిమానా అనే విషయాలు అస్సలు పట్టించుకోరు ప్రేక్షకులు. అలా మంచి బజ్ క్రియేట్ చేసిన చిత్రం ఆనందం. టైటిల్ మాదిరిగానే చిత్ర ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకులు ఆనందంతో ఈ సినిమా చూడాలని డిసైడ్ అవుతారు. 2016లో మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో ఆనందం పేరుతో తెలుగులో డబ్ చేశారు సుఖీభవ అధినేత గురురాజ్. మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఈ చిత్రాన్ని డబ్బింగ్ ద్వారానే రిలీజ్ చేస్తున్నారు. ప్రేమమ్‌ ఫేం నివీన్‌ పౌలీ అతిథి పాత్రలో నటించాడు.  ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ మధ్య జరిగే సరదా సంఘటలతో ఈ సినిమా రూపొందంచారు. మరి ఈ కాలేజ్ స్టోరీ ప్రేక్షకుల్ని ఏ మేరకు ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం. 

 

కథ :

ఇంజీనిరింగ్‌ చదివే విద్యార్థులు మంచి ఫ్రెండ్స్. ఇందులో కొన్ని ప్రేమ జంటలు కూడా ఉన్నాయి. అలాగే కొందరు ప్రేమను పొందేందుకు పరితపిస్తుంటారు. అలాంటి ఈ బ్యాచ్ కాలేజ్‌ తరుపున ఇండస్ట్రియల్‌ విజిట్‌కు వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటారు. ఈ టూర్‌ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని చాలా ప్లాన్స్‌ వేస్తారు. కాలేజ్‌ మేనేజ్‌మెంట్‌ సౌత్‌ ఇండియా వరకు మాత్రమే పర్మిషన్‌ ఇవ్వటంతో ముందు హంపీ వెళ్లి తరువాత గోవాలో న్యూ ఇయర్‌ పార్టీ సెలబ్రేట్‌ చేసుకోవాలని ప్లాన్‌ చేస్తారు. అయితే దియాను అక్షయ్ ఇష్టపడతాడు. అలాగే దియాను మరో విద్యార్థి కూడా ఇష్టపడతాడు. ఇందకూ దియా ఎవరిని ప్రేమించింది. ఎందుకు ప్రేమించింది. వారి ప్రేమ ఎలా ఫలించింది. మిగతా ఫ్రెండ్స్ ప్రేమ కథలు ఏమయ్యాయి. నివిన్ పాల్ క్యారెక్టర్ ఏంటి... టూర్ లో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనేది అసలు కథ. 

 

విశ్లేషణ :

నటీనటులంతా కొత్తవారే.. ఎవరి పాత్రకు తగ్గట్టుగా వారు తమ పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తెలుగులో ఇలాంటి కాలేజ్‌ కథలు చాలానే వచ్చాయి. హ్యాపీడేస్‌ లాంటి సినిమాలు దాదాపుగా ఇలాంటి కాన్పెప్ట్‌ తో తెరకెక్కినవే. అయితే ఇందులో వచ్చే క్యారెక్టరైజేషన్స్, ప్రేమలు, టూర్, మ్యూజిక్, కెమెరా వర్క్ కొత్తగా అనిపిస్తాయి. సహజంగా మన కళ్లముందే కథ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. 

అందుకే తెలుగు ప్రేక్షకులు కొత్తగా ఫీలవ్తుతారు. దర్శకుడు ముఖ్యంగా స్టూడెంట్స్ ని టార్గెట్ చేస్తూ కథ రాసుకున్నాడు. స్టూడెంట్స్ మధ్య వచ్చే సరదా సంఘటనలు, చిలిపి పనులు, మందు కొట్టడం, అమ్మాయిల్ని ఏడిపించడం. లెక్చరర్స్ పై సెటెర్స్ వేయడం. ప్రేమలు, గొడవలు, పార్టీలు సరదాగా చూపించారు. ఆడియెన్స్ ని కథలోకి ఇన్ వాల్వ్ చేశాడు.  చిన్న చిన్న ట్విస్టులు ఆసక్తికరంగా ఉంటాయి.  సెకండాఫ్ లో బలమైన ఎమోషన్స్‌ రక్తి కట్టిస్తాయి.  సంగీతం వినసొంపుగా ఉంటుంది. ఆనంద్‌ సీ చంద్రన్‌ సినిమాటోగ్రఫి బాగుంది. హంపీలోని లోకేషన్స్‌ను, గోవాలో పార్టీ వాతావరణాన్ని చాలా బాగా చూపించారు. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. అరుణ్, థామస్ మాథ్యూ‌, రోషన్‌, విశాఖ్ నాయర్‌‌, అను ఆంటోని, సిద్ధి మహాజన్‌కట్టి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నివిన్ పాల్ క్యారెక్టర్ సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. మంచి పాత్రలో మెప్పించాడు. కథను ముందుకు తీసుకెళ్లే పాత్ర ఇది. 

 

ఫైనల్ గా... మనకు ఎన్ని హ్యాపీడేస్ లు వచ్చినా... కాలేజ్ లవ్ స్టోరీస్ ఫ్రెష్ గానే ఉంటాయి. అందులోనూ కాలేజ్ లో జరిగే లవ్ స్టోరీస్ కావివి. హంపి, గోవాలో జరిగే సీన్స్ కావడంతో ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. యూత్ కి బాగా నచ్చే సినిమా ఆనందం. ప్రతీ సీన్ లోనూ ఆనందం వెతుక్కోవచ్చు. సో... గో అండ్ వాచ్ ఆనందం. 

PB Rating : 3.25/5

Tags : Anandam    |   
Date published: Friday, March 23, 2018, 07:04 PM
vijay
3.25 / 5 stars
Starring:
అరుణ్
థామస్ మాథ్యూ‌
రోషన్‌
విశాఖ్ నాయర్‌‌
అను ఆంటోని
సిద్ధి మహాజన్‌కట్టి
Music Director: సచిన్‌ వారియర్‌
Producer: ఎ.గురురాజ్‌
Directed by: గణేష్‌ రాజ్‌
Disclaimer:
Pallibatani.com publishes news, reviews, facts, gossips and speculations. We however exclude any expressed warranties, as to quality, accuracy, completeness, effectiveness or any of the contents including comments and feedback contained within the website and we decline any responsibility that may arise from the same

CommentsPallibatani Is Powered By pallibatani.com, Group of Individual Reporters With The Aim To Provide News To Regional Telangana & Andhra Pradesh People. Our Team Of Dynamic Journalists Strives To Gather Regional Data And Offers Modicum Quality In Pallibatani.Com Site. more...