MUST READ

ఐతే 2.0 మూవీ రివ్యూ

Rating :

వరల్డ్ సీన్మాలు; ఇండియాల మరాఠీ, మలయాళం, తమిళ్ ఓళ్ళు కతర్నాక్ గ డిఫరంట్, క్రియేటివ్ సీన్మాలు దీత్తాంటే, బాంబే లాంటి మెట్రో సిటీలల్ల, తెలుగు సీన్మా అంటే జనాలు కిందా మీదా పడీపడీ నవ్వుతాంటే, నాలుగు బజార్లల్ల ఎవలో బట్టలిగ్గి బరివాత నిల్సుండబెట్టినట్టు ఇజ్జత్ అనిపిచ్చేది. 

 

దీన్-తల్లి తెలుగు సీన్మా ఎప్పుడు మార్తదిరా బై అనుకునేటోన్ని. ఇగ తెలుగు సీన్మా మీద ఆల్మోస్ట్ హోప్ పోగొట్టుకున్న టైంల బాహుబలి, అర్జున్ రెడ్డి, ఘాజీ, గరుడ వేగ రూపంల కొంచెం ఇజ్జత్ కాపాడే సీన్మాలచ్చినై. 

 

ఈ టైంల నేను “ఐతే 2.0” సీన్మా చూశిన. “ఐతే” సీన్మా మీదున్న ఇష్టంతోని, దానికి రీలోడెడ్ వెర్షన్ అని వస్తున్న ఈ సీన్మా ట్రైలర్ మంచిగనే అనిపిచ్చి, “ఐతే” లాంటి క్లాసికల్ కల్ట్ సీన్మాకు రీలోడెడ్ అంటే ఏందో సూద్దామని పోయిన. ఇగ ఆ సీన్మా ముచ్చట మాట్లాడుకుందాం. 

 

కథ:

 

ఇంజనీరింగ్ ఒడగొట్టుకొని మూడేండ్ల అయినా నౌకర్లు రాక, ఇంట్లె ఇంకా పైసలడగలేక, దొరికినకాడికి అప్పులు జేసుకుంట నౌకర్ల దేవులాటల ఉన్న దోస్తుల (ఉపేన్, అర్జున్, కరణ్ & ఇజాజ్; రేఖా & ఈషా) కథ. ఉపాసాలైనా ఉంటారు గానీ, తాము అనుకున్న, తాము కలలు గన్న నౌకరే జెయ్యాలని, ఇంటర్వ్యూల మీదా ఇంటర్వ్యూలకు పోవుడు; వుయ్ విల్ కాల్ యు అని ఎచ్చార్ అనంగనే రూమ్ కచ్చి తిట్టుకునుడు. మల్ల తెల్లారి కోశిష్ ఫిర్ జారీ రక్నా. ఇదే వీళ్ళ పని. ఇట్లా వీళ్ళు కష్టాలు పడుకుంటనే, తమ ఆలోచనలకు, తమ కలలకు రూపం ఇస్తనే ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలు, వాటి ప్రోగ్రామింగ్, కోడింగ్ ఎదో తమ ప్రాక్టీసు కోసం సరదాగా రాసుకోవడం; పెద్ద పెద్ద కంపెనీల సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఘోస్ట్ కోడింగ్ అసైన్మెంట్స్ రాయడం; ఆ పైసలతోని కాలం ఎల్లదీయడం. 

 

ఈ ప్రాసెస్ లో ఒకరోజు వీళ్ళు వరల్డ్ వైడ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ మీద వచ్చిన ఒక ఐడియాను ఎక్సైటెడ్ గా AmBank CEO కి చెప్పి జాబ్ ఆఫర్స్ సంపాదిస్తే, ఉపేన్ జాబ్స్ వద్దూ, మనది కొత్త తరం స్టార్ట్-అప్స్ తరం; మనమే ఐడియా ని పూర్తిగా డెవలప్ చేసి, బిజినెస్-టూ- బిజినెస్ బేసిస్ లో అమ్మేద్దాం అని ఫ్రెండ్స్ అందర్నీ మరియు AmBank CEO కన్విన్స్ చేసి, మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ సంపాదిస్తాడు. ఆర్నెలల్లో ప్రాజెక్ట్ డెలివరీ చెయ్యాలి అది అగ్రిమెంట్. ప్రాజెక్ట్ పేరు – యురేకా!

 

ఒక్కసారి తమ కలలు నిజం చేసుకునే గొప్ప అవకాశం. రాత్రనక పగలనకా ఎంజాయ్ చేసుకుంట, మస్తీ మజాక్ చేసుకుంట ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తారు. ప్రాజెక్ట్ డెలివరీ ముందు రోజు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రాజెక్ట్ డెలివర్ చేయలేక ఉన్న సమయంలో AmBank యురేకాని మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేస్తారు. తాము ప్రాజెక్ట్ డెలివరీ చేయకపోయినా, ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నారంటే AmBank, తమను మోసం చేసిందని గ్రహించి అడగడానికి వెళ్ళిన వీళ్ళను కుక్కను కొట్టినట్టు కొట్టి పంపిస్తారు. వీళ్ళ స్నేహానికి, వీళ్ళ బంధాలకి, వీళ్ళ కలలకి ఈ సమయం ఒక టెస్టింగ్ టైం. దోస్తులు విడిపోతారు. ఎవరికీ వారు ఒంటరిగా కుమిలిపోతున్నారు. మళ్ళీ వీళ్ళని తాము కలలు కన్న యురేకా ప్రాజెక్ట్ లాంచ్ వార్తనే కలుపుతుంది. మ్యాథ్స్ జీనియస్ అర్జున్ ద్వారా తిరిగికలుసుకున్నప్పుడు తమకు జరిగిన మోసం తెలుసుకుంటరు. వీళ్ళ జీవితాలల్ల మళ్ళీ ఓ టర్నింగ్ పాయింట్. తమకు జరిగిన అన్యాయానికి ఏం చేద్దామని ప్రశ్న. ఆ ప్రశ్న తమ స్నేహానికీ, ఆశలకూ, ఆశయాలకూ, తాము నిర్మించుకున్న సిద్ధాంతాలకూ ఓ పెద్ద ప్రశ్న. అందరి నుండీ ఒకే ఒక రిసౌండింగ్ జవాబు. ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజం AmBank కీ, దాని CEOకీ ఒక పాడుబడిన 150 ఏండ్ల గరాజ్ నుండి ప్రపంచం షాక్ తినేలా, నివ్వెరపోయేలా ఇచ్చిన జవాబే “ఐతే 2.0”. సింపుల్ గా ఇది సిన్మా కథ. 

 

ఫస్ట్ హాఫ్: 

 

ఇగ సీన్మా నడుస్తాంటే, మన కండ్ల ముంగట అమీర్ పేట్ ల ఇడ్లీ బండి దగ్గరనో, ఇరానీ చాయ్ కేఫ్ లనో జూశిన పోరగాండ్ల లెక్కనే కనబడతారు. హ్యాపీ డేస్ సీన్మ మీద మోజుతోని ఇంజనీరింగ్ తీస్కుంటే, ఇంజనీరింగ్ బతుకును బస్టాండ్ జేశింది అని ఏడ్తరు. ఇంజనీరింగ్ పోరగాండ్ల ఫ్రస్ట్రేషన్ కనబడ్తది. అందరూ బట్టలు ఒక్కపారే నానబెట్టుకొని, ఆల్మోస్ట్ బరివాత కూసోని పత్తాలు ఆడుకుంట పగటి కలలు కంటాంటరు. వాళ్ళ మాటలు, వాళ్ళ బూతులు, వాళ్ళ కతలు, వాళ్ళ చేష్టలు ఎట్లా అంటే బ్యాచిలర్ రూమ్ లల్ల కిరాయికి ఉండే పోరగాండ్ల లెక్క అనిపిస్తది. ఐతే వీళ్ళు హౌలేగాల్లేం గాదు. వీళ్ళకు ప్రతీ ఒక్క సబ్జెక్ట్ మీద ఓ అభిప్రాయం ఉంటది. టీం వర్క్ స్పిరిట్ ఉంటది, పని సక్సెస్ ఐతే సెలబ్రేట్ చేస్కోవాలే అన్న కోరిక ఉంటది. అప్పుడప్పుడు సన్నీ లియోన్ ను సూత్తే తప్పు లేదన్న ఐడియా ఉంటది. ఫ్రీ జియో కనెక్షన్ ఉన్నది గదాని ఎప్పటికి అదే పని మీద ఉండరు. ఇట్ల ఫస్ట్ హాఫ్ దోస్తానా, నిరుద్యోగ ఇంజనీరింగ్ గ్రాడుయేట్ కష్టాలు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మీద నడుస్తది. 

 

ప్రాజెక్ట్ డెవలప్మెంట్లో కొత్తకొత్త ముచ్చట్లు తెలుస్తాయి. రాబోయే రోజుల్లో యుద్దాలు ఎలా జరగవచ్చో చెప్తుందీ సిన్మా. ఇంట్ల కూర్చొని చల్లటి బీర్ తాగుతూ, శాటిలైట్ ద్వారానో, గూగుల్ స్ట్రీట్ వ్యూ ద్వారానో ప్రపంచం ఏ కొనలో ఉన్న దేశం మీద ఏ మారుమూల కొనలో కూర్చొని యుద్ధం చేయవచ్చని చెబ్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి! మనం ఉన్న ప్రదేశంనుండే మన శత్రువు సిస్టంలోకి చొచ్చుకుపోయి మనకు కావాల్సిన డేటాని దొంగిలించడం, ఆ తర్వాత సిస్టంని పనికి రాకుండా క్రాష్ చేయడం లాంటి భయంకర కొత్త సైబర్ నేరాల గురించి చెప్తుంది. అప్పుడు నిజంగానే ఓ డౌట్ అచ్చింది – మూడో ప్రపంచ యుద్ధం గనక వస్తే మనం అందరం అందులో తెల్వకుండానే మన ల్యాప్టాప్ల వల్ల, స్మార్ట్ టీవీల వల్ల, స్మార్ట్ ఫోన్ల వల్ల భాగమై మనమూ బాంబ్స్ గట్రా వేస్తామేమో; వీడియో గేమ్ లలో లాగ చంపడం, చంపబడటం జరుగుతుందేమో. 

 

ఒక ఐడియా ని ఆలోచనా స్థాయి నుండి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ స్టేజ్ వరకు ఇంత టెక్నికల్ గా, ఎంటర్టైనింగ్ గా చెప్పడం ఏ తెలుగు సీన్మాలో చూడలేదు. ఇది డెఫినెట్ గా ఒక ఫీట్. ఎందుకంటే మన తెలుగు సీన్మాల్లో సబ్జెక్టులో ఏ మాత్రం కాంప్లికేటెడ్ ముచ్చట అయినా వచ్చిందంటే ఒక మ్యూజికల్ మాంటేజెస్ లోనో, సాంగ్ లోనో ఐపోగొడతారు. కానీ ఈ సినిమాలో ప్రాజెక్ట్ ఐడియా స్టేజ్ నుండి ఫైనల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ & డెలివరీ స్థాయి వరకు డిటైల్డ్ గా, ఎంటర్టైనింగ్ గా చూపించారు. కొన్నికొన్ని సార్లు ISB క్లాస్ రూమ్ లో ఉన్నామా? ఏదైనా MBA స్టూడెంట్స్ యొక్క కేస్ స్టడీ మనం చదువుతున్నామా అని డౌట్ వస్తుంది. టీం లీడర్ అనే వాడు ఎలా వుండాలి. టీం ని ఎలా మేనేజ్ చేయాలి. ఎలా మోటివేట్ చేయాలి. వర్క్ ఎట్లా షేర్ చేస్కోవాలే, ఎవరి స్త్రెంత్ ఏంటి, ఎవరికి ఎటువంటి వర్క్ కేటాయించాలి, టీం మెంబర్స్ నుండి వర్క్ ఎలా రాబట్టుకోవాలి, వర్క్ అప్డేట్స్, వర్క్ ప్రోగ్రెస్ రివ్యూ లాంటి విషయాలు మనకు చెప్పదు ఈ సీన్మా కానీ మనకు అర్థం అవుతుంది. అద్దాల భవంతులల్ల అయ్యే ముచ్చట్లన్నీ చూపెట్టిండు డైరెక్టర్ ఈ కొద్ది టైం లనే! 

 

ప్రాజెక్ట్ ఐడియేషన్ నుండి డెలివరీ వరకు ఫస్ట్ హాఫ్. ప్రాజెక్ట్ ముందే ప్రోడక్ట్ మార్కెట్లోకి ఎలా రిలీజ్ చేస్తారు అని AMBankని అడగడానికి వెళ్లడం ఇంటర్వెల్. 

 

సెకండ్ హాఫ్:

 

అసలు లొల్లి, అసలు మజా ఇంటర్-బెల్ తర్వాత ఉంటది సూడుండ్లీ. లొల్లి లొల్లి. 

 

తమను మోసం చేసిన కంపెనీ నుండి తమకు న్యాయంగా రావలసిన డబ్బులు రాబట్టుకొనే మార్గాలు ఈ సినిమాలో చూపించినంత వివరంగా ఏ హాలీవుడ్ సీన్మాల్లో కూడా చూపియ్యలేదేమో. 

 

హైదరాబాద్ పాతబస్తీ గల్లీలల్ల, పాడుబడ్డ గరాజ్ లల్ల కూసోని; ఉక్రెయిన్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ దేశాల మీదుగా; ఆ దేశాల జనాలకే తెల్వకుంట; సర్వర్లు మార్చడం; ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ లాంటి ట్రాన్జాక్షన్స్ ద్వారా; కొట్లానుకోట్ల బ్యాంకు వినియోగదారుల డెబిట్ కార్డ్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ దొంగిలించడం; అమ్మడం; ఎవ్వరికీ డౌట్ రాకుండా స్కిమ్మింగ్ ప్రాసెస్ ద్వారా ఒక్కొక్క అకౌంట్ నుండి పైసలు దొంగిలిస్తూ బిలియన్ డాలర్స్ సంపాదించడం; సృష్టిలో ఎవ్వరికీ ఉండనటువంటి మనిషి మనిషికి ప్రత్యెకమైన వేలిముద్రలు, గొంతు లాంటి యూనిక్ ఫీచర్స్ ని కూడా ఎలా రీ-క్రియేట్ చేయవచ్చు, ఒక మనిషి వేలిముద్రలు, గొంతు అతనికి తెలవకుండా వాటిని రీ-క్రియేట్ చేసి, ఎలా దొంగతనం చేయవచ్చ, లాంటి ఎన్నో ఊహించని కొత్త మార్గాలు చెప్తుందీ సీన్మా. 

 

సీన్మాలో ఇంతటి భయంకరమైన కథ నడుస్తాంటే, అప్పుడప్పుడు నాకు నేనే గిచ్చుకున్న. Is this really Telugu movie that I’m watching? Or am I hallucinating like ది characters in Srinu Vytla, Sukumar, Christopher Nolan Movies!?

 

అసలు ఈ సీన్మా సెకండ్ హాఫ్ చూసి, తెలివికల్ల పోరాగాండ్లైతే ఓ రేంజ్ హ్యాకర్స్ కావచ్చు. తెలివిలేనోల్లయితే ఈ డిజిటల్ ప్రపంచంల మోసగించే కొత్త మార్గాలు పట్ల అవగాహన తెచ్చుకొని జాగ్రత్తగా ఉండచ్చు. 

 

ఈ జోన్రా లా సీన్మాలు ఇంతకూ ముందు వచ్చి ఉండవచ్చు, ఐతే సీన్మా సూశిన తర్వాత నాకేం అనిపిచ్చిందంటే No other Indian movie has gone into such unimaginable depths and detailing while maintaining the entertainment quotient. So I can authoritatively pronounce Aithe 2.0 as the genuine techno-thriller movie of this country. ఇది ఇంకో 20-30 ఏండ్లకు కూడా రానటువంటి కొత్త కథ. సైబర్ క్రైమ్ కథ. 

 

బాహుబలి, అర్జున్ రెడ్డి లే కాదు, ఐతే 2.0 లాంటి సీన్మాలు కూడా సూడాలే; హిట్ చేయించాలె. క్వాలిటీ కంటెంట్ ఉండి, వెనకాల పెద్ద ఫేస్ గానీ, సపోర్ట్ గానీ లేని ఇలాంటి చిన్న సీన్మాలను తప్పకుంట హిట్ చేయించుతనే, మరొకరు కొత్త కథలపైన, కొత్తదనం పైనా ఇన్వెస్ట్ చేయడానికి కొంచమైనా ఇంటరెస్ట్ చూపెడతారు. 

 

హిట్ చేయించుతనే బాంబే లాంటి బైటి సిటీలల్ల బరివాత నిలబడేంతటి బాధ తప్పుతది. 

 

మరి ఇంత చెప్పిన సీన్మాల మైనస్ లు ఏం లెవ్వా అనే డౌట్ రావచ్చు. యెస్, ఈ సీన్మాల మైనస్లు ఉన్నాయ్. కానీ ఆ మైనస్లు అన్నీ; ఈ కాన్సెప్ట్ లో ఉన్న కొత్తదనం ముందట, ఆ స్క్రీన్-ప్లే స్పీడ్ ముంగట, ఈ చిన్న సీన్మాలున్న స్టాండర్డైజ్డ్ గ్రాఫిక్స్ ముంగట తేలిపోతై. సూడుండ్లి మీకే అర్థం ఐతది.  

 

 

My Ratings: 3.25 / 5

Tags : ithe 2.0    |   
Date published: Friday, March 16, 2018, 12:52 PM
vijay
3.25 / 5 stars
Starring:
ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా
జారా షా
అభిషేక్‌
కర్తవ్య శర్మ
నీరజ్‌
మృణాల్‌
మృదాంజలి
Music Director: Arun Chiluveru
Producer: కె.విజయరామారాజు, హేమంత్‌ వల్లపురెడ్డి
Directed by: Raj Madiraj
Disclaimer:
Pallibatani.com publishes news, reviews, facts, gossips and speculations. We however exclude any expressed warranties, as to quality, accuracy, completeness, effectiveness or any of the contents including comments and feedback contained within the website and we decline any responsibility that may arise from the same

CommentsPallibatani Is Powered By pallibatani.com, Group of Individual Reporters With The Aim To Provide News To Regional Telangana & Andhra Pradesh People. Our Team Of Dynamic Journalists Strives To Gather Regional Data And Offers Modicum Quality In Pallibatani.Com Site. more...