MUST READ

బంగారు తెలంగాణ ఆడియో విడుదల


బిపిన్,రమ్య,అక్షర,లయన్ ఏవి స్వామి,బాబూమోహన్,సాయిత్రిశాంక్,ప్రధాన పాత్రలలో షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై కూర అంజిరెడ్డి సమర్పణలో  బిపిన్ స్వీయ దర్శకత్వం లో రూపొందించిన  చిత్రం బంగారుతెలంగాణ.ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం శనివారం సాయంత్రం  ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది.అంతకుముందు ఉదయం సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాసయాదవ్ కార్యాలయంలో బంగారు తెలంగాణ ఆడియో సీడీలను రిలీజ్ చేసారు.బిపిన్ సంగీత సారథ్యం లో రూపొందిన ఈ చిత్రం ఆడియో కలర్స్ మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్లోకి విడుదలైంది.ఈ కారక్రమంలో నటుడు,నిర్మాత,దర్శకుడు,బిపిన్,లయన్ ఏవి.స్వామి,రమ్య,అక్షర, అశోక్ కుమార్,కూర అంజిరెడ్డి,సురేందర్ రెడ్డి, సాయి త్రిశాంక్,దైవజ్ఞ శర్మ,\"షిరిడీసాయి\" నిర్మాత సురేష్,తదితరులు పాల్గొన్నారు.బిగ్ సీడీని కూర అంజి రెడ్డి రిలీజ్ చేసి తొలి సీడీని ఏవి స్వామికి అందించారు.

నటుడు,నిర్మాత,దర్శకుడు బిపిన్ మాట్లాడుతూ-\"తెలంగాణకోసం ఎంతోమంది పోరాటం చేసి ఆత్మ బలిదానాలు చేసుకొన్నారు.ముఖ్యంగా కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ కోసం ప్రాణాలు లెక్క చేయకుండా పోరాటం చేసి తెలంగాణను సాధించారు.ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చి దిద్దారు.కేసీఆర్ గారి కృషి వల్లే బంగారు తెలంగాణ సాధ్యం అయింది.అసలు తెలంగాణ ఎలా వచ్చింది..అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.ఈ చిత్రం లో ఐదు పాటలు వున్నాయి.బండారు దానయ్య హెల్ప్ తో పాటలన్ని నేనే రాసుకున్నాను.బిగ్ సింగెర్స్ పాటలు పాడారు. సినిమా పూర్తి అవడానికి నా మిత్రులు ఎంతోమంది సహకరించారు వారందరికీ నా కృతజ్ఞతలు.తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మా సినిమా రిలీజ్ కి అన్ని విధాలా సహాయ సహా కారాలు అందిస్తామన్నారు.త్వరలోనే ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేస్తాం అన్నారు.

దైవజ్ఞ శర్మ మాట్లాడుతూ - \" అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసారు కేసీఆర్ గారు.తెలంగాణను బంగారు తెలంగాణ ను చేసే దిశ గా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు.అయన కృషి వల్లే తెలంగాణ సాధ్యం అయింది.బిపిన్ చాల కస్టపడి ఈ సినిమా చేసారు.తప్పకుండ ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది.అన్నారు.

కో ప్రొడ్యూసర్ ఏవి స్వామి మాట్లాడుతూ -\" 1969 నుండిఇప్పటి వరకు  ఆరు దశాబ్దాలుగా తెలంగాణ సాధించడానికి ఎంతో మంది ఆత్మ బాలి దానాలు చేసుకొని ప్రాణాలు అర్పించారు.కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో... నేను సచ్చుడో.. అనే నినాదంతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసి తెలంగాణను సాధించారు.ఇవాళ ప్రజలకు బంగారు తెలంగాణ ని అందించారు.అయన కృషి అయన పట్టుదల వల్లే తెలంగాణ సాధ్యం అయింది.దర్శకుడు బిపిన్ తెలంగాణ గురించి నేటి ప్రజలకు యువకులకు తెలిసేలా ఈ చిత్రాన్ని అద్భుతం గా రూపొందించారు.ఈ చిత్రం లో నేను లాయర్ క్యరెక్టర్ లో నటించాను.సినిమా చూసాను చాల బాగా వచ్చింది.ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుంది అన్నారు.

సమర్పకుడు కూర అంజి రెడ్డి మాట్లాడుతూ -\" డిఫరెంట్ కాన్సెప్ట్ తో బిపిన్ బంగారుతెలంగాణ చిత్రాన్ని రూపొందించారు.పాటలు చాల బాగున్నాయి.మిత్రులందరం కలిసి సినిమాని పూర్తి చేసాం.అసలు తెలంగాణ ఎలా వచ్చింది అనే అంశాన్ని  ఈ చిత్రంలో చూపించటం జరిగింది.త్వరలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని కేటీఆర్,కవిత,హరీష్ రావు గారి సమక్షం లో గ్రాండ్ గా జరపబోతున్నాం.అన్నారు.

ప్రముఖ నటుడు అశోక్ఈ కుమార్ మాట్లాడుతూ -\"  సినిమాని బిపిన్ చాల కస్టపడి అన్నీ తానై ఫ్యాషన్ తో చేసాడు తప్పకుండ ఈ చిత్రం అందరికి నచ్చుతుంది అని అన్నారు. బిపిన్,రమ్య,అక్షర,లయన్ ఏవి స్వామి,బాబూమోహన్,సాయిత్రిశాంక్,అశోక్ కుమార్,

రఘనాధరెడ్డి,వికాస్,గుండుహనుమంతరావు,వినోద్,రజిత,క్రాంతి,సౌజన్య,రాగిణి,కృష్ణవేణి,ప్రీతినిగమ్,దివ్య,సురేందర్ రెడ్డి,ఇమ్మానుయేల్,తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్:వి.నాగిరెడ్డి, ఫైట్స్:నందు,కొరియోగ్రఫీ:సాయి రమణ,సినిమాటోగ్రఫీ:మధు ఏ.నాయుడు,జి ఎస్.ఆర్.ఆళ్ల రాంబాబు,సమ్పరణ : కూర అంజి రెడ్డి,కో-ప్రొడ్యూసర్: డాక్టర్.ఏవి.స్వామి,సహా నిర్మాతలు:కిష్టంపల్లి సురేందర్ రెడ్డి,వినోద యాదవ్,బేబీ అనన్య యాదవ్,మాస్టర్ తాను కుమార్ యాదవ్.ఎక్స్జ్ క్యూటివ్ ప్రొడ్యూసర్ :మందల విజయభాస్కర్ రెడ్డి.కథ,మాటలు,పాటలు,సంగీతం,స్క్రీన్ ప్లై,నిర్మాత,దర్శకత్వం:బిపిన్.

Tags : Bangaru telangana    |   
Date published: Monday, March 12, 2018, 06:32 PM

CommentsPallibatani Is Powered By pallibatani.com, Group of Individual Reporters With The Aim To Provide News To Regional Telangana & Andhra Pradesh People. Our Team Of Dynamic Journalists Strives To Gather Regional Data And Offers Modicum Quality In Pallibatani.Com Site. more...