MUST READ

ఛలో మూవీ రివ్యూ

Rating :

ఇండస్ట్రీ లో టాలెంట్ కి కొదవ లేదు కానీ సరైన స్క్రిప్ట్ లు ఎంచుకోవడం లోనే ఉంది అసలు మజా. ఆ విషయం నాగ శౌర్య ని చూస్తే అర్ధం అవుతుంది. చక్కగా అందంగా ఉండే ఈ హీరో టాలెంట్ ఉన్నవాడు కూడా. మంచి కథ, కథనం... తన ఎనర్జీని రంగరించి ఛలో చిత్రాన్ని తెరకెక్కించామని ముందు నుంచీ చెబుతున్నారు. వెంకీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇప్పటికే మహతి స్వర సాగర్ అందించిన పాటలు మారు మోగుతున్నాయి. ట్రైలర్ కూడా అదిరిపోవడంతో సినిమాకు భారీ బజ్ వచ్చింది. మరో వైపు హీరోయిన్ రష్మిక కు వీరాభిమానులున్నారు. ఓవరాల్ గా... భారీ అంచనాల మధ్య విడుదలైన ఛలో ఉందో చూసేద్దాం ఛలో....

స్టోరీ

నిత్యం గొడవలు పడుతూ ఉండే కుర్రాడు (నాగ శౌర్య) అనుకోని పరిస్థితుల్లో తిరుప్పురం అనే ఊరు పంపిస్తారు అతని పేరెంట్స్. ఆ ఊర్లో గొడవలు ఎక్కువగా ఉండడం తో ఆ గొడవలు చూసి ఇతను భయపడి గొడవలు పడే మనస్త్వత్వం మానేస్తాడనేది వారి లాజిక్. నిజానికి ఆ ఊర్లో తెలుగు - తమిళ జనాల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ ఊర్లో ఒక కాలేజీ లో జాయిన్ అయ్యి ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ ప్రేమ కాస్తా... ఊర్లో మరింత చిచ్చు రేపుతుంది. అమ్మాయి సైతం అబ్బాయిని ప్రేమిస్తుంది. వీరి ప్రేమకు వారి ఊరి గొడవడు అడ్డుగోడగా నిలుస్తాయి. అలాంటి పరిస్థితుల్లో తిరుప్పురం గ్రామంలోని తమిళ, తెలుగు ప్రజల్ని ఎలా కలిపాడు.. అమ్మాయిని ఎలా కలుపుకున్నాడనేదే అసలు కథ. 

 

విశ్లేషణ

ఈ సినిమాకి ముఖ్యమైన ఆస్తి కామెడీ .. దర్శకుడు వెంకీ కుడుములు తన పెన్ పవరేంటో చూపించాడు. ప్రత్యేకంగా వచ్చే కామెడీగా కాకుండా ప్రతీ సీన్ లో ఫన్ జెనరేట్ అయ్యేలా రాసుకున్నాడు. హీరో హీరోయిన్స్ మధ్య కావచ్చు, ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, లెక్చరర్ స్టూడెంట్ మధ్య కావచ్చు, ఊర్లో ఉండే వాళ్ల మధ్య కావచ్చు.. ఏ ఇద్దరు కలిసినా... మనకు నవ్వు వస్తుంది. డైలాగ్స్ ని హిలేరియస్ గా రాశాడు దర్శకుడు. కథ చిన్నదే కావచ్చు.. ఉద్దేశ్యం చిన్నదే కావచ్చు, తక్కువ పాత్రలే కావచ్చు,.... దర్శకుడి టార్గెట్ మాత్రం ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే. నవ్వించేందుకు ఏ మాత్రం అవకాశం ఉన్నా నవ్వించాడు. ప్రథమార్థం నుంచి సత్య నాన్ స్టాప్ గా నవ్విస్తూనే ఉన్నాడు. సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ కడుపు చెక్కలయ్యేలా నవ్వించాడు. సెకండాఫ్ లో ఎమోషనల్ గానూ దర్శకుడు కంటతడి పెట్టించాడు. దర్శకుడిగా, రచయిగా వెంకీ సూపర్ సక్సెస్ అయ్యాడు. 

ఇక నాగశౌర్య... కథ ఎంచుకోవడం దగ్గరి నుంచి సినిమాను భారీగా ప్రమోట్ చేసే వరకు తీవ్రంగా శ్రమించాడు. మంచి కథ, కథనం ఉన్న సినిమాలో తన పాత్రకు పూర్తి న్యాయం చేసి సినిమాను నిలబెట్టాడు. ముఖ్యంగా లవ్ సీన్స్ ని ఇరగదీశాడు. రష్మికతో మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేశాడు. నాగశౌర్య కెరీర్లో బెస్ట్ మూవీగా నిలుస్తుంది. రష్మికకు చాలా మంచి పేరొస్తుంది. ఈ సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరుగుతుంది. ఓన్ డబ్బింగ్ చెప్పుకొని మెప్పించింది. తనదైన ఎక్స్ ప్రెషన్స్ తో క్యూట్ గా ఉంది. 

మహతి స్వర సాగర్ పాటలు సినిమాకు ప్రాణంగా నిలిచాయి. సినిమాను టాప్ లెవల్ లో ఉంచేలా చేశాయి. సాయి శ్రీరామ్ కెమెరాతో మ్యాజిక్ చేశాడు. బ్యూటిఫుల్ విజువల్స్ కథకు ప్రాణం పోశాయి. ఆర్టిస్టుల పెర్ పార్మెన్స్ ల్ని బాగా పిక్చరైజ్ చేశారు. చంటి షార్ప్ ఎడిటింగ్ కొత్త డైరెక్టర్ కు బాగా హెల్పయింది. నిర్మాణాత్మక విలువలు అద్భుతంగా ఉన్నాయి. 

ఫైనల్ గా...

రెండు ఊర్లకి తద్వారా రెండు రాష్ట్రాలకి సంబంధించిన గొడవను కథా వస్తువు గా ఎంచుకున్న డైరెక్టర్ సీరియస్ - కామెడీ ని బాగా బ్యాలెన్స్ చేసాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా సాగిపోతూ ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఆసక్తిని రేపుతుంది. సెకండ్ హాఫ్ లో కూడా కామెడీ సీన్లు పుష్కలంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , పాటలు , సినిమాటోగ్రఫీ , ఎడిటింగ్ అన్నీ చక్కగా కుదిరాయి. స్క్రీన్ మీద రిచ్ నెస్ స్పష్టంగా కనిపిస్తుంది. సత్య , వెన్నెల కిషోర్ ల కామెడీ సినిమాని నిలబెట్టింది. డైలాగులు ఇంప్రెసివ్ గా ఉన్నాయి. 

ఎంటర్టైన్మెంట్ కథాంశం గా సాగే ఈ సినిమా దాదాపుగా బోర్ అనిపించదు. ఇప్పటివరకు నాగ శౌర్య చేసిన చిత్రాల్లో కమర్షియల్ గా సూపర్ హిట్ అందుకునే చిత్రంగా నిలుస్తుంది. ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేసేయ్యెచ్చు. 

PB Rating : 3.5/5

Tags : chalo    |   
Date published: Friday, February 02, 2018, 06:20 AM
vijay
3.5 / 5 stars
Starring:
nagashourya
rashmika
Music Director: mahathi swara sagar
Producer: usha mulpoori
Directed by: venky kudumula
Disclaimer:
Pallibatani.com publishes news, reviews, facts, gossips and speculations. We however exclude any expressed warranties, as to quality, accuracy, completeness, effectiveness or any of the contents including comments and feedback contained within the website and we decline any responsibility that may arise from the same

CommentsPallibatani Is Powered By pallibatani.com, Group of Individual Reporters With The Aim To Provide News To Regional Telangana & Andhra Pradesh People. Our Team Of Dynamic Journalists Strives To Gather Regional Data And Offers Modicum Quality In Pallibatani.Com Site. more...