MUST READ

జై సింహా చిత్రం రివ్యూ

Rating :

సంక్రాంతి హీరోగా నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఉన్న ప్ర‌త్యేక‌త ఏమిటో అంద‌రికీ తెలిసిందే! గ‌తంలో ఈ సీజ‌న్లో వ‌చ్చిన బాల‌య్య సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాలు సాధించడంతో అభిమానుల‌కు అదో సెంటిమెంట్‌గా మారిపోయింది. ఇక బాల‌య్య సినిమా టైటిల్‌లో సింహా క‌లిసి వ‌స్తే అది ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంద‌నేది అభిమానుల‌కు మ‌రో న‌మ్మకం. బాల‌కృష్ణ‌తో శ్రీరామ‌రాజ్యం, సింహా చిత్రాల్లో న‌టించి స‌క్సెస్‌ఫుల్ జంట‌గా గుర్తింపు పొందిన‌ న‌య‌న‌తార ఇందులో బాల‌య్య కు జోడీగా న‌టించ‌డం మ‌రో విశేషం. ఈ నేప‌థ్యంలో ఈ అనుకూల‌త‌ల‌న్నింటినీ క‌ల‌బోసుకుని `జై సింహా`గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు బాల‌య్య  ఈ సంక్రాంతికి ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చాడు.త‌మిళంతోపాటు తెలుగులోనూ స్టార్ హీరోల‌తో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు తెరకెక్కించిన కేఎస్ ర‌వికుమార్  ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఈ చిత్రంపై మొద‌టినుంచి మంచి అంచ‌నాలే ఉన్నాయి.   మ‌రి  `జై సింహా`చిత్రం మ‌రోసారి బాల‌కృష్ణ‌ను సంక్రాంతి హీరోగా నిల‌బెట్టిందా..? స‌మీక్ష‌లోకి వెళ్లి చూద్దాం..!. 

 

 క‌థాంశం ఏమిటి- 

    నరసింహ(బాలకృష్ణ) గౌరి(నయనతార)కి తెలియకుండా ఆమె కొడుకుని తీసుకుని విశాఖపట్నం నుంచి  త‌మిళ‌నాడులోని కుంభకోణం చేరుకుంటాడు. అక్కడి  వెంక‌టేశ్వ‌ర స్వామి  ఆలయ ధర్మకర్త(మురళీమోహన్‌) ఇంట్లో డ్రైవర్‌గా పనిలో చేరతాడు. అయితే అనుకోని ప‌రిస్థితుల్లో అక్క‌డ స‌మ‌స్య‌లు ఎదురవుతాయి. ఆలయ ధర్మకర్త కుమార్తె ధాన్య(నటాషా దోషి) చేసిన ఓ యాక్సిడెంట్ నేరాన్ని తనపై వేసుకుంటాడు. దీంతో అత‌డికి కొంత‌మంది శ‌త్రువులవుతారు.  అదేస‌మ‌యంలో ఆల‌య ఆర్చ‌కుల‌కు, పోలీసుల‌కు జ‌రిగిన గొడ‌వ‌ల్లో న‌ర‌సింహం చొర‌వ తీసుకుని, అర్చ‌కుల‌కు అండ‌గా నిల‌వ‌డంతో జిల్లా ఎస్పీ సైతం న‌ర‌సింహంపై ప‌గ పెంచుకుంటాడు..న‌ర‌సింహ‌ను ఇబ్బందుల‌పాలు చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తాడు. ఈ నేప‌థ్యంలో.. ఆ చిన్నారిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధ‌మ‌వుతాడు న‌ర‌సింహం. ఇదే సమయంలో గౌరి తన కొడుకుని వెతుక్కుంటూ కుంభకోణం వస్తుంది. అప్పుడు నరసింహ ఎదుర్కొన్న ప‌రిస్థితులేంటి..? అస‌లు... నరసింహకు గౌరికీ ఉన్న రిలేష‌న్ ఏంటి? నరసింహ ఉన్న ఊరిని వ‌దిలి త‌న కొడుకును తీసుకుని కుంభకోణం ఎందుకు రావాల్సి వచ్చింది? ఇలాంటి ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధాన‌మే ఈ చిత్రం..!

     విశ్లేష‌ణ- 

     త‌న ఇమేజ్‌, బాడీలాంగ్వేజ్‌కు త‌గిన క‌థ‌, ప్రేక్ష‌కులు మెచ్చే క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ అన్నీ స‌మ‌పాళ్ల‌లో కుదిరితే బాల‌య్య ఎప్పుడూ బాక్సాఫీసు వ‌ద్ద కింగే..! ఇక స్టార్ హీరోల చిత్రాల‌ను జ‌న‌రంజ‌కంగా తెరకెక్కించ‌డంలో త‌న‌దైన శైలి, ప్ర‌తిభ క‌లిగిన డైరెక్ట‌ర్ కేఎస్ ర‌వికుమార్‌ల కాంబోలో మొద‌టిసారిగా తెరకెక్కిన చిత్ర‌మిది. సాధార‌ణంగా మాస్ ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలో హీరో ఎంట్రీ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌లోనో...సోలో సాంగ్‌తోనో ఉంటుంది. అలాకాకుండా  ఓ చిన్న‌పిల్ల‌వాడితో కథానాయకుడిని పరిచయం చేయ‌డం ద్వారా.. సినిమాలో క‌థ‌ను ఎలివేట్ చేస్తూ ద‌ర్శ‌కుడు చేసిన ప్ర‌య‌త్నం బాగుంది. దీంతో ప్రేక్ష‌కుల‌ను మొద‌టినుంచి సినిమాలో లీన‌మ‌య్యేలా చేయ‌గ‌లిగాడు.  ఇక హీరో బాల‌య్యకున్న మాస్ ఇమేజ్‌కు త‌గిన‌ట్టుగా అభిమానుల‌ను నిరాశ‌ప‌ర‌చకుండా.. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే స‌న్నివేశాల‌ను అల్లుకుంటూ,  మధ్యలో ఆస‌క్తిక‌రంగా కథ న‌డిపించ‌డంలో ద‌ర్శ‌కుడు విజ‌య‌వంతం కాగ‌లిగాడు. కుంభకోణం నేపథ్యంలో సాగిన తొలి అర్ధభాగం ఆక‌ట్టుకునేలా ఉంది. పురోహితుల గొప్పతనం గురించి చెప్పే సన్నివేశంలో బాలకృష్ణ మార్కు డైలాగ్‌లు నటన అభిమానుల చేత విజిల్స్ వేయిస్తాయి. విశ్రాంతికి ముందు వచ్చే యాక్షన్‌ సన్నివేశాలను సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. నయనతార ఎంట్రీతో కథ మరో మలుపు తిరుగుతుంది.

        ద్వితీయార్ధం వ‌చ్చేస‌రికి ఫ్లాష్‌బ్యాక్‌పైనే ఆధారపడి క‌థ న‌డుస్తుంది.  సొంత ఊరికి దూరంగా ఉంటూ బ‌తికే క‌థ‌తో గ‌తంలోనూ బాల‌కృష్ణ సినిమాలు వ‌చ్చాయి. కానీ క‌థ క‌న్విన్సింగ్‌గా చెప్ప‌గ‌ల‌గ‌డంతో ఆ చాయ‌లు క‌న‌ప‌డ‌వు.నయనతారతో బాలకృష్ణ ప్రేమ సన్నివేశాలు, ప్రకాష్‌రాజ్‌తో సెంటిమెంట్‌ సన్నివేశాలు బాగున్నాయి. అయితే కొన్ని స‌న్నివేశాలు నిడివి త‌గ్గించి ఉంటే ఇంకాస్త బాగుండేది. బ్ర‌హ్మానందం కామెడీ విష‌యంలోనే ఇదే వ‌ర్తిస్తుంది. హాస్యం పాళ్లు లోపించిన‌ట్టు స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఫీల‌వుతాడు. ముగ్గురు హీరోయిన్ల‌ను కేవ‌లం గ్లామ‌ర్ కోసం వాడుకోవ‌డం కాకుండా క‌థ‌లో త‌గిన ప్రాధాన్యం ఉండేలా తీర్చిదిద్ద‌డం ప్ర‌శంస‌నీయం.  పతాక సన్నివేశాలను విభిన్నంగా తీర్చిదిద్దారు. 

న‌టీన‌టులు- సాంకేతిక వ‌ర్గం పనితీరు-  

        మాస్ సినిమానే అయినా ఇందులో బాల‌కృష్ణ కొత్త‌గా క‌నిపిస్తాడు. పాత్ర‌కు త‌గిన‌ట్టుగా రెండు విభిన్న‌మైన కోణాల్లో బాల‌య్య త‌న‌దైన శైలి న‌ట‌న‌తో మ‌రోసారి మెప్పించాడు. ఇక యువ‌హీరోల‌తో పోటీప‌డేలా ‘అమ్మకుట్టి’ పాటలో బాలయ్య స్టెప్పులతో అద‌ర‌హో అనిపించాడు. ఫ్యాన్స్‌ను అలరించడానికి తనవంతు కృషి చేశాడు. ఇక  కథానాయికలు ముగ్గురు ఉన్నా, ప్రాధాన్యం మాత్ర‌ నయనతార పాత్ర‌దే...! ఎప్పటిలాగే హుందాగా న‌టించి మెప్పించింది. నటాషా దోషి గ్లామర్‌ ఒలికిస్తే.. హరిప్రియ మంగ పాత్రలో కాస్త అల్లరి పిల్ల‌గా అల‌రించింది.  బ్రహ్మానందానికి పూర్తి నిడివి ఉన్న పాత్ర దక్కినా... ఆక‌ట్టుకునే స‌న్నివేశాలు లేక పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాడు.  హీరో మాస్ ఇమేజ్‌ను, సెంటిమెంట్‌ను స‌మ‌తూకంలో ప్ర‌జెంట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు కేఎస్ ర‌వికుమార్ మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుక‌న్నాడు. బాలకృష్ణను ఒక స్వచ్ఛమైన ప్రేమికుడిగా చూపించడంలో విజయవంతమయ్యాడు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం మెలోడీ ప్ర‌ధానంగా సాగింది. బాగుంది. మెలోడీ ప్రధానంగా సాగుతాయి.  రత్నం డైలాగ్‌లు  సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయ‌ని చెప్పాలి. బాలకృష్ణ మాడ్యులేషన్‌కు తగ్గటుగా డైలాగ్‌లు రాశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలకు పేరుపెట్ట‌లేం..!

చివ‌రిగా---

   ఈ సంక్రాంతికి బాల‌య్య జ‌య‌సింహ‌మే..!

PB Rating : 3/5

Tags : jai simha    |   
Date published: Friday, January 12, 2018, 10:03 PM
vijay
3 / 5 stars
Starring:
balakrishna
nayanatara
Music Director: chiranthan bhat
Producer: c kalyan
Directed by: ks ravikumar
Disclaimer:
Pallibatani.com publishes news, reviews, facts, gossips and speculations. We however exclude any expressed warranties, as to quality, accuracy, completeness, effectiveness or any of the contents including comments and feedback contained within the website and we decline any responsibility that may arise from the same

CommentsPallibatani Is Powered By pallibatani.com, Group of Individual Reporters With The Aim To Provide News To Regional Telangana & Andhra Pradesh People. Our Team Of Dynamic Journalists Strives To Gather Regional Data And Offers Modicum Quality In Pallibatani.Com Site. more...