తాంత్రిక మూవీ రివ్యూ

తాంత్రిక ఒక్క రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా. గోవా అందాలతో, రొమాంటిక్ సన్నివేశాలతో, అద్భుతమైన గ్రాఫిక్స్ తో నిర్మించబడిన చిత్రం తాంత్రిక. రాజ్‌కాంత్, కార్తీక్, మనీష, సంజన, గీతాషా, ఆర్య ముఖ్య పాత్రల్లో ఎం. శ్రీధర్‌ దర్శకత్వంలో సంగకుమార్‌ నటించి, నిర్మించిన చిత్రం ‘తాంత్రిక’. ఈ చిత్రం అక్టోబర్ 26 న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఎంటర్ టైన్ చేసిందోచూద్దాం.

కథేంటంటే : నూతన వధూవరులు వైభవ్ మరియు లాస్య హనీమూన్ కోసం గోవా వెళ్తారు. రాజ్ కాంత్ మరియు గీత్ మంచి ప్రేమికులు. పెద్దవాళ్ళని ఎదిరించలేక ఎవరికి చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకుందామని గోవా వెళ్తారు. శివ దొంగ. తాను కొట్టేసిన కార్ తో ఎంజాయ్ చేద్దామని గోవా వస్తాడు. శివ కి దారిలో సంజన నాయుడు పరిచయం అవుతుంది. అయితే వీళ్ళందరూ గోవా లో ఒకే రిసార్ట్ లో దిగుతారు. అందరు స్నేహితులు అవుతారు. అందరు గోవా అందాలతో ఎంజాయ్ చేస్తుంటే కొత్తగా పెళ్ళైన లాస్య కి దెయ్యం పడుతుంది. తాను విచిత్రం గా ప్రవర్తిస్తుంది. ఆ దెయ్యం ఎవరు, స్నేహితులందరూ కలిసి ఎలా లాస్య ని కాపాడతారనేది అసలు కథ.

సమీక్ష
ఈ తాంత్రిక సినిమా లో అందరు నూతన నటీనటులే. అందరు వారివారి క్యారెక్టర్ లో జీవించారు. సంజన నాయుడు మరియు గీత్ షా వారి అందాలతో యూత్ ని మాస్ ప్రేక్షకులని అలరిస్తారు. రాజ్ కాంత్ మరియు వైభవ్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులని మెప్పించారు. శివ తన పాత్రలో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేశాడు. చాలా మంది విదేశీ నటి నటులు ఈ చిత్రం లో నటించారు.

ఈ చిత్రంలోని గోవా అందాలు హైలైట్ గా నిలుస్తాయి. అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. అందమైన లొకేషన్స్ కి తగ్గట్టుగా రొమాంటిక్ మ్యూజిక్ మరో హైలైట్. టైటిల్ సాంగ్ చాలా బాగా చిత్రీకరించారు. జాన్ మరియు నాగ వంశి సంగీతం బాగుంది. ఈ సినిమా కి మరో ముఖ్యమైన హైలైట్ గ్రాఫిక్స్. కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. కథ రొటీన్ గా ఉన్నా కథనం, గోవా లొకేషన్స్ మరియు మ్యూజిక్ ఈ చిత్రానికి కొత్త లుక్ ని తీసుకొస్తుంది.

దర్శకుడు మెండెం శ్రీధర్ చాలా అందం గా చక్కగా అర్ధవంతంగా సినిమా తెరకెక్కించాడు. నిర్మాత సంగ కుమార్ రాజీ పడకుండా ఈ చిత్రాన్ని భారీ గా నిర్మించాడు. తాంత్రిక అందమైన రొమాంటిక్ థ్రిల్లర్. మంచి కథ తో గోవా లాంటి అందమైన లొకేషన్స్ తో, అందమైన ముద్దుగుమ్మలతో రొమాంటిక్ సన్నివేశాలతో అబ్బురపరిచే గ్రాఫిక్స్ తో నిర్మించిన సినిమా ఇది. యూత్ ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చే సినిమా. గో అండ్ ఎంజాయ్

Rating : 3

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange