MUST READ
English Version

మంచి కథా బలంతో చేస్తున్న 'సాక్ష్యం' అందరికీ నచ్చే విధంగా వుంటుంది - శ్రీనివాస్‌

'జయ జానకీ నాయక' వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'సాక్ష్యం'. 'డిక్టేటర్‌' ఫేమ్‌ శ్రీవాస్‌ దర్శకత్వంలో అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై దేవాంశ్‌ నామా సమర్పణలో టేస్ట్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ అభిషేక్‌ నామా పవర్‌ అండ్‌ పర్పస్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో నిర్మిస్తున్న చిత్రం 'సాక్ష్యం'. ఈ చిత్రం టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌ని అక్టోబర్‌ 18న హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో ఘనంగా రిలీజ్‌ చేశారు. ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు మోషన్‌ పోస్టర్‌ని లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌, హీరోయిన్‌ పూజా హెగ్డే, దర్శకుడు శ్రీవాస్‌, నిర్మాత అభిషేక్‌ నామా, రచయితలు సాయిమాధవ్‌ బుర్రా, రాజసింహ, సంగీత దర్శకుడు హర్షవర్ధన్‌, నటులు కాశీ విశ్వనాథ్‌, ఆనంద్‌ పాల్గొన్నారు. 

కథ విని చాలా ఇన్‌స్పైర్‌ అయ్యాను!! 

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ మాట్లాడుతూ - ''ఫిబ్రవరిలో శ్రీవాస్‌గారు కథ చెప్పారు. వినగానే చాలా ఎగ్జైట్‌ అయ్యాను. మన డైరెక్టర్స్‌ ఇలా కూడా ఆలోచిస్తారా అన్పించింది. అంతలా ఈ కథ నన్ను చాలా ఇన్‌స్పైర్‌ చేసింది. ఇంత మంచి కథతో నాతో సినిమా చేస్తున్న శ్రీవాస్‌కి నా థాంక్స్‌. ఫస్ట్‌ టైమ్‌ మంచి కథాబలంతో చేస్తున్న సినిమా ఇది. అంతకుముందు చేసిన మూడు సినిమాలు ఒక ఎత్తు. ఈ నాలుగవ సినిమా 'సాక్ష్యం' ఒక ఎత్తు. ఈ సినిమా చూసి ప్రేక్షకులే గొప్ప సాక్ష్యులు అవుతారు. టాప్‌ టెక్నీషియన్స్‌ అందరితో వర్క్‌ చేస్తున్నాను. సాయిమాధవ్‌ బుర్రాకి పెద్ద ఫ్యాన్‌ని. ఈ సినిమాకి అద్భుతమైన డైలాగ్స్‌ రాశారు. అభిషేక్‌గారు మంచి ప్యాషన్‌ వున్న నిర్మాత. టీమ్‌ వర్క్‌తో అందరం ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం'' అన్నారు. 

గొప్ప ఛేంజ్‌ ఓవర్‌ కథ!! 

దర్శకుడు శ్రీవాస్‌ మాట్లాడుతూ - ''చాలా ఎగ్జైటెడ్‌గా వున్నాను. మోషన్‌ పోస్టర్‌లో చూపించిన పిక్చర్‌ చాలా ఇంపాక్ట్‌గా వుంటుంది. ఇండస్ట్రీలో ప్రతి పది సంవత్సరాలకొకసారి ఛేంజ్‌ ఓవర్‌ వస్తుందని నేను అనుకుంటున్నాను. అలా నా పదేళ్ల సినీ కెరీర్‌లో ఇది ఒక గొప్ప ఛేంజ్‌ ఓవర్‌ కథగా నిలుస్తుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. డిక్టేటర్‌ తర్వాత 2,3 నెలలు చాలా కథలు విన్నాను. ఏదీ నచ్చలేదు. నా దగ్గర వున్న ఒక పాయింట్‌ని ఎన్నో యు ట్యూబ్‌ వీడియోస్‌, పొలిటికల్‌ స్పీచ్‌లు, రివ్యూస్‌ చదివి ఇన్‌స్పైర్‌ అయి ఈ కథ రాసాను. నిజ జీవితంలో జరిగే స్టోరి ఇది. ఔటర్‌ సిస్టమ్‌ మీద చాలా సినిమాలు వచ్చాయి. ఫస్ట్‌ టైమ్‌ ఇన్నర్‌ సిస్టమ్‌ వ్యవస్థ మీద సినిమా చేస్తున్నాను. మన లోపల వున్న ఇంజనీరింగ్‌ థాట్‌ ప్రాసెస్‌ ఏవిధంగా వర్క్‌ చేస్తుంటుంది. దాని వల్ల ఎలాంటి ప్రాబ్లెమ్స్‌ ఏర్పడతాయి? పంచభూతాలు, నేచర్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ జరుగుతుంది. ఇలాంటి కథకి ఒక యంగ్‌ అండ్‌ డైనమిక్‌ హీరో కావాలి. ఆ టైమ్‌లో బెల్లంకొండ సురేష్‌గారు నాకు కాల్‌ చేశారు. నీ దగ్గర కథ వుంది అంట కదా వింటాను అన్నారు. సింగిల్‌ సిట్టింగ్‌లో ఈ కథ ఓకే చేశారు ఆయన. హైలీ ఎనర్జిటిక్‌ టెక్నీషియన్స్‌ ఈ సినిమాకి వర్క్‌ చేశారు. అభిషేక్‌ నామా నా మైండ్‌ సెట్‌కి బాగా సింక్‌ అయ్యారు. టెక్నీషియన్స్‌ అందరూ నాకు ఎంతో సపోర్ట్‌ చేస్తున్నారు. ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యాక ఈ సినిమా ఏంటో అందరికీ అర్థమవుతుంది'' అన్నారు. 

భారతీయతకు ప్రతీకగా నిలిచే చిత్రం!! 

మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా మాట్లాడుతూ - ''సాక్ష్యం' చాలా గొప్ప సినిమా అని నా మనసాక్షిగా చెప్తున్నాను. చాలా రోజుల తర్వాత ఒక గొప్ప సినిమాకి పని చేశాను. భారతీయ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్ని ఈ చిత్రంలో వున్నాయి. భారతీయతకి ప్రతీకగా ఈ చిత్రం నిలుస్తుంది. ప్రతి సీన్‌, ప్రతి డైలాగ్‌, ప్రతి క్యారెక్టర్‌కి ఒక ఆర్ధ్రత వుంటుంది. సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ఒక టెన్షన్‌ని గురి చేస్తూ సాగుతుంది. ఇలాంటి గొప్ప సినిమాకి స్క్రీన్‌ప్లే, మాటలు రాసే అవకాశం ఇచ్చిన శ్రీవాస్‌కి, అభిషేక్‌గారికి నా థాంక్స్‌. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని గొప్పగా ఆదరిస్తారని నమ్మకం వుంది. తప్పు చేసే ప్రతి ఒక్కడు మరలా తప్పు చేయకూడదు అని భయపడేటట్లుగా ఈ చిత్రం అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ని నెక్స్‌ట్‌ లెవెల్‌కి తీసుకెళ్లే చిత్రం ఇది. ఈ సినిమాలో ఒక కొత్త శ్రీనివాస్‌ని చూస్తారు. అంత అద్భుతంగా పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. ఈ సినిమాకి వర్క్‌ చేసిన టీమ్‌ అందరికీ చాలా మంచి పేరు వస్తుంది'' అన్నారు. 

మోషన్‌ పోస్టర్‌ చాలా థ్రిల్లింగ్‌గా వుంది 

నటుడు కాశీ విశ్వనాథ్‌ మాట్లాడుతూ - ''శ్రీవాస్‌, నేను ప్రతి సినిమా గురించి డిస్కస్‌ చేసుకుంటాం. ఈ సినిమా కథ, టైటిల్‌ గురించి నాకు చెప్పలేదు. టైటిల్‌ ఏం పెడతారోనని చాలా ఎగ్జైటెట్‌గా వచ్చాను. మోషన్‌ పోస్టర్‌ చూసి చాలా థ్రిల్‌ అయ్యాను. శ్రీనివాస్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ యాప్ట్‌ ఈ సినిమాకి. ఏ సినిమా అయినా మంచి కథ, డెడికేషన్‌, హార్డ్‌వర్క్‌ వుంటే మంచి హిట్‌ సినిమా వస్తుంది. ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్‌కి మంచి బ్రేక్‌ వస్తుంది. అభిషేక్‌ మంచి టేస్ట్‌ వున్న నిర్మాత. ఈ సినిమాతో ఆయన బేనర్‌ నెక్స్‌ట్‌ లెవెల్‌కి వెళ్తుంది. ఈ సినిమా హిట్‌ అయి మా శ్రీనివాస్‌కి మంచి భవిష్యత్‌ వుండాలని కోరుకుంటున్నాను'' అన్నారు. 

రివేంజ్‌కి సరికొత్త నిర్వచనంగా నిలుస్తుంది!! 

రచయిత రాజసింహ మాట్లాడుతూ - ''గత 20 ఏళ్లుగా శ్రీవాస్‌ పరిచయం. అజయ్‌ విన్సెంట్‌గారి వద్ద కెమెరా అసిస్టెంట్‌గా వర్క్‌ చేశాడు. కెమెరామెన్‌ అవుతాడు అనుకున్నా.. కానీ డైరెక్టర్‌ అవుతాడనుకోలేదు. ఫ్రెండ్‌షిప్‌కి ప్రాణం ఇచ్చే వ్యక్తి శ్రీవాస్‌. ఆపదలో వున్న స్నేహితులకి సాయం చేసే గ్రేట్‌ ఫ్రెండ్‌ శ్రీవాస్‌. భారీ బడ్జెట్‌తో అత్యున్నత టెక్నికల్‌ వేల్యూస్‌తో ఈ సినిమా తీస్తున్నారు అభిషేక్‌. ఇలాంటి ఒక భారీ సినిమా తీయడానికి గట్స్‌ వుండాలి. యాక్షన్‌ పార్ట్‌ సాంగ్స్‌, గ్రాఫిక్‌ వర్క్‌కి కోట్లు ఖర్చు పెట్టి ఈ చిత్రాన్ని ఎంతో ధైర్యంగా నిర్మిస్తున్నారు. ఆయన 'జయ జానకి నాయక' సినిమాకి రైటర్‌గా వర్క్‌ చేశాను. మళ్లీ ఈ సినిమాకి వర్క్‌ చేస్తున్నాను. ఆ సినిమాకి, ఈ సినిమాకి శ్రీనివాస్‌లో చాలా మెచ్యూర్టీ వచ్చింది. ప్రేమ, పగ, త్యాగం చుట్టూ జరిగే కథ ఇది. రివేంజ్‌కి సరికొత్త నిర్వచనం చెప్పే చిత్రం. రాబోయే ఎన్నో చిత్రాలకు ప్రతీకగా ఈ సినిమా నిలుస్తుంది. సాయిమాధవ్‌ బుర్రాగారితో వర్క్‌ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. స్క్రిప్ట్‌ ఫెంటాస్టిక్‌గా వచ్చింది. డైరెక్టర్‌ శ్రీవాస్‌ కెరీర్‌కి ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలి'' అన్నారు. 

ఈ చిత్రాన్ని నిర్మించడం నా అదృష్టం!! 

నిర్మాత అభిషేక్‌ నామా మాట్లాడుతూ - ''రెగ్యులర్‌ ఫిలింస్‌ కాకుండా డిఫరెంట్‌ చిత్రాలు నిర్మించాలనుకునే టైమ్‌లో శ్రీవాస్‌ ఈ కథ చెప్పారు. చాలా థ్రిల్లింగ్‌గా అన్పించింది. పక్కా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ అన్పించేలా ఈ చిత్రాన్ని నిర్మించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్‌ శ్రీవాస్‌కి, బెల్లంకొండ శ్రీనివాస్‌కి నా థాంక్స్‌'' అన్నారు. 

సంగీత దర్శకుడు హర్షవర్ధన్‌ మాట్లాడుతూ - ''అర్జున్‌రెడ్డి' తర్వాత చేస్తోన్న రెండో సినిమా ఇది. ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శ్రీవాస్‌, అభిషేక్‌గారికి నా థాంక్స్‌'' అన్నారు. మంచి కథా బలంతో చేస్తున్న 'సాక్ష్యం' అందరికీ నచ్చే విధంగా వుంటుంది 

- హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ 

సంగీత దర్శకుడు హర్షవర్ధన్‌ మాట్లాడుతూ - ''అర్జున్‌రెడ్డి' తర్వాత చేస్తోన్న రెండో సినిమా ఇది. ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శ్రీవాస్‌, అభిషేక్‌గారికి నా థాంక్స్‌'' అన్నారు.

Tags : sakshyam    |   
Date published: Thursday, October 19, 2017, 08:14 AM

CommentsPallibatani Is Powered By Pallibatani.com, Group of Individual Reporters With The Aim To Provide News To Regional Telangana & Andhra Pradesh People. Our Team Of Dynamic Journalists Strives To Gather Regional Data And Offers Modicum Quality In Pallibatani.Com Site. more...