MUST READ
English Version

మహాకవి కాళోజి నారాయణరావు అవార్డు ప్రదానోత్సవం


మహకవి, ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా గత 5 సంవత్సరాల నుండి భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు టెలివిజన్  రచయితల సంఘం సంయుక్తంగా ఈ  పురస్కారం అందిస్తున్నారు గతంలో గూడ అంజయ్య, సుద్దాల అశోక్ తేజ, జె కె భారవిలు ఈ పురస్కారం అందుకున్నారు. అయితే  2016 కు సినీ రచయిత చంద్ర బోస్‌కు , 2017 కు  ప్రజా గాయకుడు, సంగీత దర్శకుడు  వందేమాతరం శ్రీనివాస్‌లకు సెప్టెంబర్ 18న హైదరాబాద్ లోని  ఫిలిం ఛాంబర్ హాల్ లో కాళోజి పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి నాగ బాల సురేష్ కుమార్ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథి గా తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె వి రమణ చారి, అతిధులుగా  నిర్మాత సాయి వెంకట్, నిర్మాత ఆమ్రేష్ కుమార్ పాల్గొన్నారు.

 తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె వి రమణ చారి మాట్లాడుతూ : " సురేష్ కుమార్ మీ అందరి తరపున టి వి పరిశ్రమలో వున్న వారి స‌మ‌స్య‌ల గురించి అడిగాడు. టివి పరిశ్రమలోని కష్టాలను నేను గ్రహించగలను. ముఖ్యంగా ప్రభుత్వం ఇస్తున్న హెల్త్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్స్ ఇప్పించ‌డం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  తరపున నా వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. డిసెంబర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలచిన ప్రపంచ తెలుగు మహా సభలకు తెలంగాణ భాష రచయితలకు, అలాగే ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారంద‌రికీ ఇదే నా ఆహ్వానం ఎంతో ఘనంగా నిర్వహిచే ఈ కార్యక్రమం విజయవంతం చేయాలనీ టివి సినీ ప్రరిశ్రమ వ్యక్తులను కోరుతున్నాను. ఇక కాళోజి లాంటి మహా కవి గురించి ఏమని చెప్పను ఆయన పుట్టిన రోజు సెప్టెంబర్ 9న తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే ఆయన ఘనత ఎంతటిదో  మీ ఊహించవచ్చు. అలాంటి మహోన్నత వ్యక్తి పేరుమీద నాగబాల సురేష్ కుమార్, టి వి రచయితల సంఘం ఈ పురస్కారం ఏర్పాటు చేయడం, ఒకఋ గీత కర్త ఇంకొకరు స్వర కర్త మన తెలంగాణ బిడ్డ చంద్ర బోస్ కు, వందేమాతరం శ్రీనివాస్ లకు ఇవ్వడం సముచితమని నా సమ్మతం తెలిపాను. డబల్ మీనింగులతో పాటలు రాసి  కేవలం డబ్బు సంపాదన కోసమే కాకుండా, చంద్ర బోస్ లాంటి  సర్వేజనా సుఖినోభవంతు అనే రచయితలు రావాలి. వందేమాతరం శ్రీనివాస్ చాలా కస్టపడి పైకి వచ్చాడు ఒక్కో మీరు ఎక్కుతూ తన స్థానాన్ని గాయకుడిగా స్వర కర్తగా పదిల పరుచుకున్నాడు. " అన్నారు 

 

నాగబాల సురేష్ కుమార్ మాట్లాడుతూ :  "మహా కవి, ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా గత 5 సంవత్సరాల నుండి భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు టెలివిజన్  రచయితల సంఘం సంయుక్తంగా ఈ  పురస్కారం అందిస్తున్నారు గతంలో గూడ అంజయ్య, సుద్దాల అశోక్ తేజ, జె కె భారవి లకు ఈ పురస్కారం అందుకున్నారు. అయితే  2016 కు సినీ రచయిత చంద్ర బోస్ కు , 2017 కు  ప్రజా గాయకుడు, సంగీత దర్శకుడు  వందేమాతరం శ్రీనివాస్ లకు ఇవ్వడానికి పెద్దలు కె వి రమణ చారీ గారి ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. టి వి పరిశ్రమలో చాలామంది కార్మికులకు డబ్బింగ్ సీరియల్స్ రియాలిటీ షో లు వలన  సరైన ఉపాధి లేకుండా పోతుంది వారికి ఉండడానికి ఇల్లు, హెల్త్ కార్డులు ప్రభుత్వం తరుపున సహాయం అందిస్తే బాగుంటుందని సభ ముఖంగా కె వి రమణ చారీ అడుగుతున్నాను " అన్నారు  

 

సన్మాన గ్రహీత చంద్ర బోస్ మాట్లాడుతూ : పితృ  సమనుకు కె వి రమణ చారి గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నేను గర్వపడుతున్నాను. కాళోజి గారు రచనలు నేను చదివాను కొన్ని సభలలో విన్నాను. తెలంగాణ భాష కోసం అయన చేసిన కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికి గురుతు పెట్టుకుంటారు. ఇప్పటి వరకు నేను మంచి భాష తోనే పాటలు రాస్తూ వస్తున్నాను ఇక ముందు కూడా రాస్తాను. ఈ పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన కె వి రమణ చారి గారికి, నాగ బాల సురేష్ కుమార్ గారికి టి వి రచయిత సంఘం సభ్యులకు నా ధన్య వాదాలు."   చెపుతూ 'నింగి నేల' చిత్రం లోని 'ఆరాటం ముందు ఆటంకం ఎంత?...' అనే పాటను పాడి వినిపించారు. 

 

సన్మాన గ్రహీత వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ : ప్రజా నాట్య మండలి లో ఎంతో మంది కళాకారులు వున్న నన్ను వెన్ను తట్టి ఇంతటి గుర్తింపు తెచ్చిన 'అన్న' నల్లూరి వెంకటేశ్వర రావు కు ఈ అవార్డు ను అంకితమిస్తున్నాను. ఈ రోజు ఈ అవార్డు అందుకుంటున్నాను అంటే ఆయన చలువే. ఈ పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన కె వి రమణ చారి గారికి, నాగ బాల సురేష్ కుమార్ గారికి టి వి రచయిత సంఘం సభ్యులకు నా ధన్య వాదాలు." అన్నారు 

 

ఇంకా ఈ సభలో నిర్మాత సాయి వెంకట్, నిర్మాత ఆమ్రేష్ కుమార్, రచయిత రాజు, తది తరులు మాట్లాడారు.

 

Tags : kaloji narayana    |    chandrabose    |   
Date published: Tuesday, September 19, 2017, 10:31 AM

CommentsPallibatani Is Powered By Pallibatani.com, Group of Individual Reporters With The Aim To Provide News To Regional Telangana & Andhra Pradesh People. Our Team Of Dynamic Journalists Strives To Gather Regional Data And Offers Modicum Quality In Pallibatani.Com Site. more...