MUST READ
English Version

సరసుడు మూవీ రివ్యూ


శింబు కి యూత్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ. అందుకే లవ్ స్టోరీస్ ఎక్కువగా చేస్తుంటాడు. నయనతార, శింబు గతంలో ఒరిజినల్ లవర్స్. అయితే ఆ తర్వాత బ్రేకప్ అయ్యింది. అయినా కలిసి హీరో హీరోయిన్లుగా నటించారు. అదే‘సరసుడు’. ఇక ఈ సినిమాకి శింబు తండ్రి అలనాటి ‘ప్రేమ సాగరం’ దర్శకుడు టి.రాజేందర్ మాటలు, పాటలు రాయడం సొంతంగా నిర్మించడంతో భారీ బజ్ నెలకొంది. 

కథేంటంటే....

శివ(శింబు) చెన్నైలో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతని జీవితంలో లవ్ చేసిన ప్రతి అమ్మాయితో బ్రేకప్ అయిపోతూ ఉంటుంది. దీంతో తండ్రి చూసిన పెళ్లి సంబంధంలో మైలా(నయనతార)ని చూసి మొదటి చూపులోనే లవ్ లో పడిపోతాడు. ఇక వాళ్ళ లవ్ స్టొరీ తో పాటు వారి పెళ్లి కథ కూడా చిన్న చిన్న గొడవల తో శుభం కార్డు పడే వరకు వచ్చేస్తుంది. అప్పుడే ఊహించని సంఘటనతో వాళ్ళిద్దరి మధ్య మరల దూరం పెరుగుతుంది. పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం ఏంటి? అసలు శివ ప్రేమ కథకి ఎవరు విలన్? ఇంతకి ప్రియ(ఆండ్రియా)కి శివతో ఉన్న సంబంధం ఏంటి? మరల శివ, మైలా ఎలా ఒకటయ్యారు అనేది సినిమా కథ

సమీక్ష

ఫీల్ గుడ్ తో నడిచే సింపుల్ అండ్ క్యూట్ లవ్ స్టొరీ. ఆ లవ్ స్టొరీ ఈ జెనరేషన్లో నిశ్చితార్ధం అయిన అమ్మాయి, అబ్బాయి మధ్య ఎలాంటి లవ్ స్టొరీ ట్రావెల్ అవుతుంది అనే విషయాన్ని డైరెక్టర్ ఉన్నది ఉన్నట్లు చూపించాడు . ఇక సినిమాకి కాస్త లైట్ వే లో ఇచ్చిన కామెడీ టచ్ కొంతమేర నవ్విస్తుంది.

నయనతార యధావిధిగా తనకు అలవాటైన పెర్ఫార్మెన్స్ తో మరోసారి ఆకట్టుకుంది. ఇక శింబుని తెలుగు ప్రేక్షకులు మాస్ రోల్ లో కాకుండా క్లాస్ రోల్ లో చూడటం మొదటిసారి. ఆ క్లాస్ పాత్రలో తన పరిధి మేరకు శింబు మెప్పించే ప్రయత్నం చేసాడు. ఇక ఆండ్రియా కూడా పాత్ర పరిధి మేర భాగా చేసింది. ఇక హీరో ఫ్రెండ్ గా చేసిన సత్యం రాజేష్ నవ్వించే ప్రయత్నం చేసాడు. మిగిలిన పాత్రదారులు కూడా ఎవరి పరిధి మేరకు వారు భాగానే ఆకట్టుకున్నారు.

 

కథలోనే కామెడీ పండించే ప్రయత్నం చేశారు. సంతానంలాంటి కమెడియన్ ఉండండతో... బాగా రిలీఫ్ గా నవ్వుకోవచ్చు. తమిళ సినిమా అయినప్పటికీ... డబ్బింగ్ బాగా చేయించారు. టి. రాజేందర్ సొంత బ్యానర్లో ఈ సినిమాని తెరకెక్కించారు. నిర్మాణ విలువలు భాగున్నాయి. దర్శకుడిగా పాండిరాజ్ ఆకట్టుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ కథకి తగ్గ విధంగా బ్యాగ్రౌండ్ స్కోర్ భాగానే అందించాడు. సినిమాటోగ్రఫీ బాగా ప్లస్ అయ్యింది.  ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్ గా కనిపించింది. 

 

శింబు, నయనతార ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్స్. దర్శకుడు పాండిరాజ్ డైరెక్షన్, కామెడీ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తాయి. లవ్, ఎమోషనల్ సీన్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయి. 

PB Rating : 3/5

 

Tags : sarasudu    |   
Date published: Sunday, September 17, 2017, 07:27 AM

CommentsPallibatani Is Powered By Pallibatani.com, Group of Individual Reporters With The Aim To Provide News To Regional Telangana & Andhra Pradesh People. Our Team Of Dynamic Journalists Strives To Gather Regional Data And Offers Modicum Quality In Pallibatani.Com Site. more...