MUST READ
English Version

డా. చక్రవర్తి మూవీ రివ్యూ

Rating :

ఏ ఫిల్మ్ బై అరవింద్ అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు శేఖర్ సూరి పేరు కూడా మారు మోగింది. అయితే ఇదే ఊపు ఆ తర్వాత మాత్రం కంటిన్యూ చేయలేకపోయాడు. కానీ గ్యాప్ తీసుకొని ఈసారి డా.చక్రవర్తి చిత్రంతో హిట్ కొట్టేందుకు మనముందుకు వచ్చారు. ట్రైలర్స్ లో ఆకట్టుకున్న చక్రవర్తి ప్రేక్షకులు ముందుకు వచ్చేశారు. మరి ఈ సినిమా ఏలా ఉందో చూద్దాం.

కథేంటంటే….

డా.చక్రవర్తి ఫేమస్ డాక్టర్. పెద్ద హాస్పిటల్ నడుపుతుంటాడు. అతని కూతురు సోనియా (సోనియా మన్). రిషిని ప్రేమిస్తుంది. హ్యాపీగా సాగిపోతున్న వాళ్ల ఫ్యామిలీలోకి మాఫియా డాన్ ఎంటర్ అవుతాడు. మాఫియా డాన్ దగ్గర చక్రవర్తి యాభై కోట్లు అప్పు తీసుకుంటాడు. తీర్చకపోవడంతో...చంపేస్తానని బెదిరిస్తాడు డాన్. ఈ వీడియో యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తుంది. ఆ తర్వాత చక్రవర్తి ఫ్యామీలీ ఫాం హౌస్ కు వెళ్లిపోతుంది. అందరూ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. కానీ ఇంతలోనే అనుకోని పరిణామాలు ఎదురౌతాయి. సోనియాను సొంత ఫ్యామిలీనే చంపాల్సి వస్తుంది. అసలు డాక్టర్ యాభై కోట్లు ఎందుకు అప్పు చేయాల్సి వస్తుంది. కుటుంబం మొత్తం ఎందుకు చనిపోవాలనుకుంటుంది. సోనియాను ఫ్యామిలీ ఎందుకు చంపాలనుకుంటుంది. ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష

సినిమా కథే మెయిన్ ఎస్సెట్ ఈ చిత్రానికి, చక్రవర్తి క్యారెక్టర్ మరో ఎస్సెట్. కథలో వచ్చే అనేక మలుపులు ఆడియెన్స్ కి థ్రిల్ కలిగిస్తాయి. దర్శకుడు సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ని బాగా రాసుకున్నారు. మాఫియా డాన్ ఎంటర్ కావడం… ఫామ్ హౌస్ కు వెళ్లడం… అక్కడ చిత్రమైన నిర్ణయం తీసుకోవడం, హీరోయిన్ కు చక్రవర్తికి మధ్య రిలేషన్స్, హీరోకు, హీరోయిన్ కు మధ్య సంబంధం ఇలా పలు ట్విస్టులతో ముందుకు వెళ్తుంది. ఇందులో నటించిన అందరూ చాలా బాాగా చేాశారు. పెర్ ఫార్మెన్సుల పరంగా అందరూ సక్సెస్ అయ్యారు. చక్రవర్తి ఆటిట్యూడ్ విభిన్నంగా ఉండడంతో ఆడియెన్స్ కు కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రథమార్థలో ఓ షేడ్ లో ద్వితియార్థంలో మరో షేడ్ లో కనిపిస్తాడు చక్రవర్తి. గిరీష్ సహదేవ్ చక్రవర్తి పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. క్రైమ్ సీన్స్ లో నూ గిరీష్ మెప్పించాడు. సోనియా మన్ కు మంచి పేరొస్తుంది.

దర్శకుడు శేఖర్ సూరి ఈసారి డిఫరెంట్ క్రైమ్ కథ రాసుకున్నారు. ఊహించని మలుపులు రాసుకోవడం దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఆర్టిస్టుల దగ్గరి నుంచి మంచి నటన రాసుకున్నారు. ఈ తరహా కథ, కథనం ఇంగ్లీష్ సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. కేవలం కమర్షియాలిటీ మాత్రమే కాకుండా సొసైటీలో జరిగిన ఓ రియల్ స్టోరీ ఆధారంగా కథ రాసుకున్నారు. సోషల్ మెసేజ్ ను చాలా సీన్స్ లో ఓపెన్ గానే చెప్పేశాడు. అయితే మాఫియా డాన్ ను మళ్లీ ఎక్కడా ఎంటర్ చేయకపోవడం… చాలా సీన్స్ సాగదీతను తలపించడం మైనస్. అయన దర్శకత్వంలోనే వచ్చిన ఏ ఫిల్మ్ బై అరవింద్ లో కనిపించిన ఇంటెన్సిటీ ఇందులో కనిపించదు. విజయ్ కూరాకుల బ్యాక్ స్కోర్ లౌడ్ నెస్ తగ్గిస్తే బాగుండేది. నరేష్ ఎడిటింగ్ సినిమాకు హెల్ప్ అయ్యింది. షార్ప్ కట్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. నిర్మాణాత్మక విలువలు, డైలాగ్స్ బాగున్నాయి.

ఫైనల్ గా… డా. చక్రవర్తి విభిన్నమైన కథ, కథనంతో తెరకెక్కిన సినిమా. క్రైం థ్రిల్లర్ తరహా జోనర్స్ ని బాగా ఇష్టపడే వారికి మంచి ఛాయిస్ డా.చక్రవర్తి.

PB RATING : 3/5

 

Tags : dr chakravarthy    |   
Date published: Saturday, July 15, 2017, 10:52 PM
vijay
3 / 5 stars
Starring:
sonia mann
rish
girish
Music Director: vijay kurakula
Producer: shekar suri
Directed by: shekkar suri
Disclaimer:
Pallibatani.com publishes news, reviews, facts, gossips and speculations. We however exclude any expressed warranties, as to quality, accuracy, completeness, effectiveness or any of the contents including comments and feedback contained within the website and we decline any responsibility that may arise from the same

CommentsPallibatani Is Powered By Pallibatani.com, Group of Individual Reporters With The Aim To Provide News To Regional Telangana & Andhra Pradesh People. Our Team Of Dynamic Journalists Strives To Gather Regional Data And Offers Modicum Quality In Pallibatani.Com Site. more...