టీజర్ దశలోనే జై లవకుశ రికార్డుల మోత

ప్రస్తుతం టాలీవుడ్లో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ హవా మొదలైనట్టే కనిపిస్తోంది. యువ హీరోల్లో మరెవరికీ అందనంత మాస్ ఇమేజ్ను కెరీర్ తొలినాళ్లలోనే తన సొంతం చేసుకున్న తారక్ ఆ తరువాత తన స్థాయికి తగ్గ హిట్ కోసం సుదీర్ఘకాలమే ఎదురు చూడాల్సి వచ్చింది. గత ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో చేసిన జనతా గ్యారేజ్ అతడికా లోటు తీర్చేసింది. వరుస విజయాలతో తిరిగి ఫామ్లోకి వచ్చిన తారక్ నుంచి ఇక రాబోయే సినిమాలన్నీ భారీ ప్రాజెక్టులే..!
తాజాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న యంగ్ టైగర్ చిత్రం జై లవకుశ. సోదరుడు కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. రెండు రోజుల క్రితం రిలీజైన ఈ చిత్రం టీజర్ అటు నెటిజన్లనే కాదు... ఇటు సెలబ్రిటీలను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. జై లవకుశ టీజర్ లో ఎన్టీఆర్ మాస్ లుక్, డైలాగ్ డెలివరీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. టీజర్ ఇప్పటికే కోటి వ్యూస్ దాటిపోవడం విశేషం. టీజర్ కి కోటి వ్యూస్ రావడం దక్షిణాదిన ఇదే తొలిసారి. టీజర్ లో ఎన్టీఆర్ డైలాగ్ చెప్పిన విధానం, హావ భావాలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ టీజర్ తో జై లవ కుశ చిత్రం పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయనే చెప్పాలి. తారక్ ఈ చిత్రంలో తన నట విశ్వరూపం చూపించచడం ఖాయమనే అంటున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర రెండవ టీజర్ ని కూడా త్వరలోనే విడుదల చేస్తారు. ఈ చిత్రం లో ఎన్టీఆర్ కి జోడిగా నివేద థామస్, రాశి ఖన్నా హీరోయిన్లు గా నటిస్తున్న విషయం తెలిసిందే..!
Comments