MUST READ
English Version

హరనాథ్ పొలిచర్ల టిక్ టాక్ మూవీ ప్రివ్యూ....


అతను పేరు గాంచిన న్యూరో డాక్టర్. అమెరికాలో ఎంతో మందికి వైద్యం అందించి మంచి పేరు సంపాదించిన తెలుగు వాడు. అలాంటి వ్యక్తికి సినిమాలంటే ఆసక్తి. అలా... సినిమా రంగంలోకి ప్రవేశించి ఇప్పటికి దాదాపు 14 చిత్రాలు నిర్మించారు. అంతే కాదు జాతీయ అవార్డులు సైతం అందుకున్నారు. ఆయనే హరినాథ్ పొలిచర్ల. తాజాగా ఆయన రూపొందించిన టిక్ టాక్ అనే చిత్రం ఈనెల 19న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. హరినాథ్ నిర్మాతగా, దర్శకుడిగా, హీరోగా పలు బాధ్యతలు చేపట్టిన చిత్రమిది.

ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ తో అంచనాలు భారీగా పెరిగాయి. ఆయన గతంలో రూపొందించిన చిత్రాలతో పోల్చితే మాస్ అప్పీల్ ఎక్కువగా ఉన్న చిత్రమిది. ఇద్దరు అందమైన భామలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. రమ్యశ్రీ ఐటమ్ సాంగ్ బోనస్ ఎంటర్ టైన్ మెంట్. ఇందులో హరినాథ్ మెకానిక్ గా నటించారు. ఆత్మల నేపథ్యంలో సాగే హార్రర్ కామెడీ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ ఇది. హార్రర్ లో కామెడీ బాగా పండిందని కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయని... పాటలు అద్భుతంగా రావడం మరో ప్లస్ పాయింటని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతోంది. అందుకే ఈ చిత్రాన్ని భారీ ప్రమోషన్ నడుమ ఈనెల 19న రిలీజ్ చేస్తున్నారు. హరినాథ్ కెరీర్లో ఈ చిత్రం సమ్ థింగ్ స్పెషల్ గా నిలిచే అవకాశమున్నట్టు ట్రైలర్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ సినిమాకు మెయిన్ డ్రైవింగ్ ఎలిమెంట్ ను సస్పెన్స్ గా ఉంచారు. ఆది ఏంటనేది మాత్రం సినిమా చూడాల్సిందే అంటున్నారు హరినాథ్.

పి.హెచ్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన హార్ర‌ర్‌, ఫ‌న్‌, ల‌వ్ కాన్సెప్ట్ మూవీ సినిమా `టిక్ టాక్‌`. చైతన్య సంగీతం అందించాడు. ఇండియన్ ఐడల్ విన్నర్ రేవంత్, గీతామాధురి పాడిన మాస్ పాట ప్రధాన హైలెట్. శివ-హరిణి పాడిన మరో రెండు పాటలూ అలరించటం ఖాయం. పూర్తి గ్రాఫిక్స్ తో చిత్రీకరించిన “ఏదో ఏదేదో” విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది. ఈ చిత్రానికి ఆ పాట ప్రధాన ఆకర్షణ. ఇందులో మిగతా సినిమాల మాదిరిగా బూతు, చిన్నపిల్లలను భయపెట్టే హర్రర్ ఏమాత్రం ఉండదు.

తారాగణం: పోలిచర్ల హరనాథ్, నిషిగంద, మౌనిక, రాహుల్, సందీప్ ఆనంద్, సాయికృష్ణ, అల్లూ రమేష్, రమణి తదితరులు.
సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫి: పి. వంశీ కృష్ణ, సంగీతం: S & B Music Mill, ఎడిటర్: వెంకటరమణ, ఆర్ట్: E.గోవింద్, కాస్ట్యూమ్స్: జనక ముని, మేకప్: ఈశ్వర్, స్టంట్స్: Y. రవి, కొరియోగ్రఫర్: గోవింద్ CH, లిరిక్స్: కరుణాకర్, చారి,
మూలకథ: లిఖిత్ శ్రీనివాస్,
కథ, స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – డైరెక్షన్ – నిర్మాత: పోలిచర్ల హరనాథ్.

Tags : haranath policherla    |    tik tak    |   
Date published: Thursday, May 18, 2017, 10:24 AM

CommentsPallibatani Is Powered By Pallibatani.com, Group of Individual Reporters With The Aim To Provide News To Regional Telangana & Andhra Pradesh People. Our Team Of Dynamic Journalists Strives To Gather Regional Data And Offers Modicum Quality In Pallibatani.Com Site. more...