జ‌న‌సేనాని పై తెలుగు త‌మ్ముళ్ల గుర్రు…బాబు వ‌ద్ద‌కు పంచాయ‌తీ

ఇంత‌లోనే ఎంత మార్పు… ఎన్నిక‌ల‌వ‌గానే ప‌వ‌న్ ను క‌లిసి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన నాయ‌కులే ఇవాళ ఆయ‌న పేరుచెప్ప‌గానే అంతెత్తున లేస్తున్నారు. క‌స్సుబుస్సు లాడేస్తున్నారు. సోమ‌వారం సీమాంధ్ర ఎంపీల‌ను ఉద్దేశిస్తూ ప‌వ‌న్‌చేసిన వ్యాఖ్య‌లు ఆ పార్టీ నాయ‌కుల‌కు కోపం తెప్పించాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన టీడీపీ ఎంపీలు, నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

పవన్ వ్యాఖ్యలను ధీటుగా తిప్పికొట్టేందుకు తమకు అనుమతివ్వాలని పార్టీ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కోరారని తెలుస్తోంది. చంద్రబాబు అనుమతిస్తే విలేకరులతో మాట్లాడుతామని చెప్పారని, ఇందుకు చంద్ర‌బాబు నిరాక‌రించార‌ని, జపాన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు మాత్రం తాను వచ్చాక సమీక్షిస్తానని చెప్పారని తెలుస్తోంది.

ఇక ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక బీజేపీపై ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు ఆ పార్టీ ఎంపీలు ఎవరి వ‌ద్ద పంచాయ‌తీ పెడ‌తారా అన్న‌ది చూడాలి.

Leave a Reply

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange