సుబ్రహ్మణ్యపురం మూవీ రివ్యూ

ఈ మధ్య కాలంలో సుబ్రహ్మణ్యపురం ట్రైలర్ కు మంచి ఆదరణ లభించింది. పక్కాగా విజయవంతం అయ్యే అవకాశం ఉందనే మంచి టాక్ తెచ్చుకుంది.  అక్కినేని మనవడు సుమంత్.. హీరో. ఈషా రెబ్బ హీరోయిన్  సుధాక‌ర్ ఇంపెక్స్ ఐపియ‌ల్ బ్యాన‌ర్ పై  బీరం సుధాక‌ర్ రెడ్డి నిర్మాణంలో  నూత‌న ద‌ర్శ‌కుడు సంతోష్ జాగ‌ర్లపూడి   రూపొందించిన చిత్రం సుబ్రహ్మణ్య‌పురం.ఈరోజు ప్రేక్షకులను పలకరించింది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

కథ: నాస్తికుడైన ఆర్కియాలజిస్ట్ కార్తీక్(సుమంత్) పలు దేవాలయాల పరిశోధకునిగా పని చేస్తుంటుంటాడు. ఈ క్రమంలో ‘సుబ్రహ్మణ్యపురం’ అనే గ్రామంలో ఊహించని రీతిలో ఆత్మహత్యలు జరుగుతుంటాయి. అసలు అవి ఎందుకు జరుగుతున్నాయి. ఆ గ్రామంలో వున్న గుడి వెనుక ఉన్న రహస్యం ఏమిటి? దాన్ని పది రోజుల్లో ఛేదిస్తానని చెప్పిన కార్తీక్… దాన్ని ఛేదించారా? లేదా అన్నదే మిగతా కథ.

విశ్లేషణ: ఈ చిత్రం రానా వాయిస్ ఓవర్ తో టైటిల్స్ పడటంతోనే చిత్రంపై ఆసక్తిని రేపుతూ మొదలవుతుంది. ఈ చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఎంచుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. గ్రామంలో జరుగుతున్న సంఘటనల వెనుక ఉన్న రహస్యాన్ని చేధించేందుకు రాసుకున్న కథనం బాగుంది. అదే సమయంలో హీరో.. హీరోయిన్ల మధ్య ప్రేమకథను బాగా డీల్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో రాసుకున్న కొన్ని ట్విస్టులు.. సెకెండాఫ్ పై మరింత ఆసక్తిని పెంచేస్తాయి. ప్రతి నిముషం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా వుంటే బాగుండు. కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. సుమంత్, ఈషా రెబ్బ బాగా నటించారు. ఆర్కియాలజిస్ట్ గా సుమంత్ పాత్ర బాగుంది. ఈ చిత్రంలో మిగతా నటులు వారి పాత్ర మేరకు నటించి పర్వాలేదనిపించారు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేశారు. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.

ఇందులో సుమంత్  హేతువాది, దేవుణ్ణి నమ్మడు కానీ, గుళ్ళ గురించి రీసెర్చ్ చేస్తుంటాడు. ఈ పాత్ర లో కొత్తగా కనిపిస్తాడు. ఈషా రెబ్బ పాత్ర హీరో తో గొడవలు పడుతుంది హీరోయిన్ సాంప్రదాయాలను గౌరవించే అమ్మాయి. వీరి మద్య కొన్ని వైరుధ్యాలుంటాయి. కానీ ఈరెండు పాత్రల మద్య ట్రావెల్ బాగుంటుంది. ఇది క్యారెక్టర్ తో నడిచే సినిమా. కథనంతో పాటు నిజాయితిగా అన్ని పాత్రలు నడుచుకుంటాయి. రానా వాయిస్ కథనంకు బలంగా మారింది. నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. సినిమా లో గ్రాఫిక్స్ కి స్కోప్ ఉంది. ఈసినిమా విజువ‌ల్  ఎఫెక్ట్స్ మొత్తం అన్న‌పూర్ణ టీం  చేసింది. త‌ప్ప‌కుండా స‌ర్ ప్రైజ్ అవుతారు. శేఖ‌ర్ చంద్ర ఈ సినిమాకు బ్యాక్ బోన్ అనుకోవ‌చ్చు. శేఖ‌ర్  చాలా అద్బుతంగా మ్యూజిక్ అందించాడు. ఇందులో మూడు పాట‌లు చాలా బాగుంటాయి. అత‌ని వ‌ర్క్ గురించి అంద‌రూ  మాట్లాడుకుంటారు

ఓవరాల్ గా ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్… థ్రిల్లింగ్ సన్నివేశాలు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్స్ ఇస్తాయి. సో ఫ్యామిలీ తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.

రేటింగ్: 3/5

Wordpress Social Share Plugin powered by Ultimatelysocial
Secured By miniOrange