సీత మూవీ రివ్యూ…

sita

నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత తేజ డైరెక్షన్ లో వచ్చిన సినిమా సీత. కాజల్ అగర్వాల్ ని హీరోలాగా చూపించాడు తేజ. బెల్లంకొండ శ్రీనివాస్ హీరో. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. ఈ చిత్రం ట్రైలర్ తర్వాత పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. కానీ తేజ ఏదో మాయ చేసే ఛాన్సుందని మాత్రం అనుకున్నారు. దీంతో ఈ సినిమాపై కాస్త అంచనాలున్నాయి. మరి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే….

రఘురాం (బెల్లంకొండ)ని చిన్నప్పుడే వాళ్ల మావయ్య భూటాన్ లోని బౌద్ద ఆశ్రమంలో ఉంచుతాడు. సీత వచ్చే వరకు ఇక్కడే ఉండాలని… సీతను చూసుకోవాలని చెబుతాడు. ఆ తర్వాత మావయ్య ఆస్తిని రఘురాం పేరుమీద రాసి చనిపోతాడు. మరో వైపు సీత (కాజల్) ఏది అనుకుంటే అది చేసే మనస్తత్వం ఉన్నది. స్లమ్ ఏరియాలో ఓ ల్యాండ్ కొంటుంది. అక్కడి జనాల్ని ఖాలీ చేయించడానికి బస్వరాజు (సోనూ సూద్)ను కలుస్తుంది. దానికి బదులుగా నెల రోజులు తనతో సంసారం చేయాలని కోరుతాడు. దీనికి సీత ఒప్పుకుంటుంది.. అయితే పని అయిపోయిన తర్వాత బస్వరాజును పట్టించుకోదు. దీంతో బస్వ సీతను కష్టాల్లోకి నెట్టేస్తాడు. తనకు డబ్బు అవసరమౌతుంది. అప్పుడు తన ఆస్తి బావ రఘురాం దగ్గర ఉందని భూటాన్ కి వెళ్తుంది. అక్కడి నుంచి రఘురాం ను తీసుకొస్తుంది. వింత మనస్తత్వం రఘురాంది. అతని వల్ల కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటుంది.

సీత ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంది. సీత ఆస్తి దక్కించుకుందా. రఘురాం సీతను పెళ్లి చేసుకున్నాడా. బస్వరాజు తన కోరిక తీర్చుకున్నాడా. ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష
హీరో రఘురాం పాత్రలో బెల్లంకొండ అస్సలు సెట్ కాని పాత్ర ఇది. అమాయకుడి క్యారెక్టర్లో నటించాడు బెల్లంకొండ. తనకు నిజానికి పెద్దగా ఇంపార్టెన్స్ కనిపించదు. అంతా కాజల్ అగర్వాల్ దే హవా. ఆఖరికి ఓ చోట ఫైట్ కూడా చేయించాడు. ఈ సినిమాలో ఛాలెంజెస్ చేసేది… ఛాలెంజెస్ స్వీకరించేది కాజల్ మాత్రమే. దీంతో సినిమా లేడీ ఓరియెంటెడ్ గా మారిపోయింది. అప్పుడప్పుడు మాత్రమే బెల్లంకొండ అవసరం పడింది. కంటైనర్లు పక్కకు జరపడానికి, డోర్లు పగలగొట్టడానికి బాగా పనికొచ్చాడు. హీరో క్యారెక్టరైజేషన్ ను క్రియేట్ చేయడంలో డైరెక్టర్ తేజ పూర్తిగా విఫలమయ్యాడు. హీరో క్యారెక్టర్ కు తగ్గ సీన్స్ కుడా పడలేదు. పాత కాలం నాటి సీన్స్ తో బోర్ కొట్టించారు. హీరో పల్స్ రేట్ పెరిగి టాబ్లెట్స్ కు కాల్ చేసే సీన్ న భుతో న భవిష్యత్. ఇక కార్ పైకి ఎక్కి కూర్చునే సీన్ చూస్తే నవ్వుకోకుండా ఉండరు… వెటకారంగా. ఈ తరహా సన్నివేశాలు చాలానే వచ్చాయి ఇందులో. మధ్య మధ్యలో బిత్తిరి సత్తి అండ్ బ్యాచ్ చేసే ఊర కామెడీకి తేజను తిట్టకుండా ఉండరు. బాగా లేకపోతే తేజనే తిట్టమన్నాడు కాబట్టి.

కాజల్ బాగానే కష్టపడ్డప్పటికీ… కథ, కథనం సరిగ్గా కుదరలేదు. ఆమె ఎంత అరిచి గీ పెట్టినా…. చెవులు పగిలిపోయాయి తప్ప… ఆడియెన్స్ లో క్యూరియాసిటీ మాత్రం పెరగలేదు. ఇక మన్నారా చోప్రాను ఎందుకు పెట్టుకున్నారో అర్థం కాలేదు. అర్థం పర్థం లేని నత్తి డైలాగ్స్ తో నరకం చూపించింది. కేవలం సోనూ సూద్, తనికెళ్ల భరణి క్యారెక్టర్ మాత్రమే కాస్త రిఫ్రెషింగ్. భరణి పంచులు మాత్రం బాగున్నాయి. సోనూ సూద్ చాలా రోజుల తర్వాత తన పెర్ పార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అభినవ్ గోమటం పర్వాలేదనిపించాడు. తేజ చాలా చోట్ల బాగా మేనేజ్ చేశాడనిపిచింది. కీలకమైన కోర్ట్ సీన్ లో హీరో డైలాగ్స్ చెప్పలేకపోయాడా అనిపించింది. సెక్షన్స్ స్టార్ట్ చేయగానే మ్యూజిక్ వేయించి సీన్ నిక్లోజ్ చేశాడు. ఇలాంటి తెలివితేటలు ఇంకా చాలా చోట్ల చూపించాడు. తేజ కథ, మీద కథనం మీద పట్టుకోల్పోయాడు. ఆయన నరేషన్ స్టైల్ లో దమ్ము లేకుండా పోయింది. చాలా వీక్ సీన్స్ స్క్రీన్ ప్లే తో సినిమా తీశాడు. ఎక్కడా నెక్ట్స్ సీన్ ఏమవుద్దో అనే క్యూరియాసిటీ క్రియేట్ చేయలేకపోయాడు. బిత్తిరి సత్తి లాంటి వాళ్లతో ఇరికించిన కామెడీతో నరకం కనిపిస్తుంది.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ రిటైర్మెంట్ అయినా ప్రకటించాలి లేదంటే… కొత్త మ్యూజిక్ అయినా ఇవ్వాలి. ప్రతీ సారీ క్షమించేయలేం కదా. కెమెరా వర్క్ సోసోగా ఉంది. లక్ష్మీ భూపాల్ డైలాగ్స్ అక్కడక్కడ బాగానే పేలాయి… కథ సరిగ్గా లేనప్పుడు డైలాగ్ రైటర్ మాత్రం ఏం రాయగలడు. నిర్మాణాత్మక విలువలు ఓకే. బట్ విలువలు లేని సినిమాకు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టడం మాత్రమే కాదు… కంటెంట్ కూడా చూసుకోవాల్సింది.

ఓవరాల్ గా….
డైరెక్టర్ గా తేజ హీరోగా బెల్లంకొండ ఫెయిల్ అయ్యారు. బెల్లంకొండ ఈ తరహా కథను ఎందుకు ఎంచుకున్నాడో అర్థం కాదు. అతని బలం మాస్ పాటలు, మాస్ ఫైట్స్, మాస్ డైలాగ్స్ అది ఒదిలేసి ఏదో చేద్దాం అనుకున్నాడు. చేంజ్ ఓవర్ మంచిదే. ఇంత చేంజ్ జనాలు భరించలేరు కదా. అలాంటప్పుడు కాస్త జాగ్రత్తగా అడుగు వేయాల్సింది. ఇక తేజ కథను సృష్టించడంలో… సృష్టించిన కథను నడిపించడంలో పూర్తిగా విఫలయత్నం చేశాడు. సో ఈ సినిమాను లైట్ తీసుకోవడం బెటర్.

PB Rating : 2/5

Wordpress Social Share Plugin powered by Ultimatelysocial
Secured By miniOrange