సమీరం మూవీ రివ్యూ…

ప్రేమ కథలు అందరూ తీస్తారు… కానీ అందులో ఎవ్వరూహించని ట్విస్టులు, ఎమోషన్స్ ని కలగలిపి కొందరే తీస్తారు. అలాంటి చిత్రమే సమీరం అని నిర్మాతలు ముందు నుంచీ చెబుతున్నారు. ప్రేమ కథలో విభిన్నమైన కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం సమీరం. యశ్వంత్, అమృత ఆచార్య హీరో హీరోయిన్స్ గా నటించారు. గెటప్ శ్రీను కీలక పాత్రలో నటించాడు. రవి గుండబోయిన దర్శకుడు. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు ఎలా మలిచాడు… ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకునే ఛాన్స్ ఉందో చూద్దాం.

కథేంటంటే… సమీరా (అమృతా ఆచార్య)కు తల్లితండ్రులు లేరు. ఒంటరిగా మంచి ఉద్యోగం చేస్తూ లైఫ్ గడిపేస్తుంది. కానీ తనకు ఓ జబ్బు ఉందని తెలుసుకొని… హైదరాబాద్ వదిలి తన చివరి లైఫ్ ని థాయ్ లాండ్ లో గడపాలని వెళ్తుంది. అక్కడ రామ్ (యశ్వంత్)… థాయ్ లాండ్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. తన ఫ్రెండ్ (గెటప్ శ్రీను) హోటల్ నడుపుతుంటాడు. తన హోటల్ లో దిగిన సమీరాకు గైడ్ గా… క్యాబ్ డ్రైవర్ గా రామ్ వెళ్తాడు ఇద్దరూ మొదట్లో తిట్టుకున్నా కొట్టుకున్నా… ఆ తర్వాత కలిసిపోతారు. రామ్ కి అప్పటికే లవర్ ఉంటుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఇద్దరూ శారీరకంగా కలుస్తారు. ఆ తర్వాత తన వ్యాధికి సంబంధించిన ఓ ట్విస్ట్ తెలుస్తుంది. రామ్ సమీరను పెళ్లి మాత్రం చేసుకోనంటాడు. చివరికి ఇద్దరి లైఫ్ ఏమయ్యింది. సమీర జబ్బు ఏంటి తన జీవితాన్ని ఎలా టర్న్ చేసింది. రామ్ ఎందుకు సమీరను పెళ్లి చేసుకోనంటాడు. రామ్ చివరికి ఎవరిని పెళ్లి చేసుకన్నాడనేది అసలు కథ.

సమీక్ష
హీరో యశ్వంత్ కొత్తవాడైనా చాలా బాగా నటించాడు. సరదాగా సాగిపోయే పాత్ర ఇది. మరో వైపు ఎమోషన్స్ తో కూడుకున్నది. హీరోయిన్ తో మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేశాడు. హీరోయిన్ అమృతకు మంచి పేరొచ్చే సినిమా. తెలుగమ్మాయిలా నటించింది. అమృతకు నటించే స్కోప్ ఎక్కువ. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. రొమాంటిక్ సీన్స్ లోనూ బాగా చేసింది. సమీర పాత్రకు సరిగ్గా సరిపోయింది. గెటప్ శ్రీనుకు మంచి పాత్ర దక్కింది. మిగిలిన పాత్ర ధారులు సైతం బాగా చేశారు.

టెక్నికల్ గా… యాజమాన్య మంచి పాటలిచ్చాడు. లవ్ సాంగ్స్ యూత్ ఫుల్ గా ఉన్నాయి. రీ రికార్డింగ్ సైతం చాలా బాగా ఇచ్చాడు. చాలా సన్నివేశాలు హైలైట్ అయ్యాయి. మధుసూదన్  కెమెరా వర్క్ బాగుంది. థాయ్ అందాల్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగుంది. డైలాగ్స్ బాగా రాసుకున్నారు. ఎమోషనల్ డైలాగ్స్ బాగా రాశారు. నిర్మాణాత్మత విలువలు చాలా బాగున్నాయి. సినిమా టెక్నికల్ గా క్వాలిటీ గా ఉంది.

ప్రేమ కథల్లో విభిన్నమైన ప్రేమ కథ ఇది. ముఖ్యంగా హీరోయిన్ పాత్రను బాగా డిజైన్ చేశారు. ఏదైనా సమస్యలు వస్తే ఎలా ఉండాలి… ఎలా బయటికి రావాలి అనే విషయాల్ని దర్శకుడు బాగా చెప్పాడు. హీరోయిన్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ… హీరో పాత్రని స్ట్రాంగ్ గా మలిచారు. భావోద్వేగాలతో కూడిన పాత్ర ఇది. స్క్రీన్ ప్లే పరంగానూ దర్శకుడికి మంచి విజన్ ఉందని అర్థమైంది. హీరోయిన్ కు సంబంధించిన ట్విస్టుల్ని కరెక్ట్ టైంలో రివీల్ చేశాడు. హీరో లవర్ క్యారెక్టర్ కు కూడా మంచి పేరొస్తుంది. నేటి ట్రెండ్ లో కమిట్ మెంట్స్ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఆ విషయాన్ని కూడా టచ్ చేశాడు. రొమాంటిక్ సీన్స ని బాగా చేశారు. వల్గారిటీ లేకుండా నీటిగా తీశారు. జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి… సమస్యలు వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకునే విషయంలో తీసుకోవాల్సిన విషయాల్ని చక్కగా చెప్పాడు. ప్రేమ విషయంలో తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకూడదని హెచ్చరించాడు. ఓ వైపు మెసేజ్ ఇస్తూనే ఎంటర్ టైన్ చేశాడు.

ఓవరాల్ గా… ప్రేమ కథా చిత్రాల్లో విభిన్నమైన సినిమా సమీరం. రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇది. నేటి ట్రెండ్ కి తగ్గ చిత్రమిది. గెటప్ శ్రీను కామెడీ, ఇంటర్వెల్ ట్విస్ట్… క్లైమాక్స్ లో హీరోయిన్ ట్విస్ట్ ప్రేక్షకుల్ని థ్రిల్ కు గురి చేస్తాయి. సో.. గో అండ్ ఎంజాయ్…

PB Rating : 3/5

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange