టీఆర్ఎస్ నుంచి నటి సమంత పోటీ… కెటీఆర్ భారీ స్కెచ్

 

సినీ నటి సమంత నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. మరో వైపు సోషల్ సర్వీస్ విషయంలోనూ చురుగ్గా పనిచేస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి చేనేత కార్మికుల సంక్షేమం కోసం శ్రమిస్తోంది. తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా కేటీఆర్ కలిసి వర్క్ చేస్తోంది. ఈ చనువు తోనే సమంతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్టు ఫిలింనగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

 

అక్కినేని ఫ్యామిలీకి కెసిఆర్ ఫ్యామిలీకి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. మొదట్లో అన్నపూర్ణ స్టూడియో విషయంలో కెసిఆర్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ… నాగార్జున ఆ సమస్యల్ని సాల్వ్ చేసుకొని ఫ్రెండ్ షిప్ పెంచుకున్నాడు. పలుసార్లు కెసిఆర్ ను, కెటిఆర్ ను పలు కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించి ఆ ఫ్రెండ్ షిప్ ను మరింత బలోపేతం చేశాడు. ఆ తర్వాత సమంత అక్కినేని ఇంట కోడలిగా అడుగు పెట్టింది. దీంతో సహజంగానే కెటిఆర్ తో సన్నిహితంగా ఉంటోంది. ఇదే అదునుగా సమంతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెల్ కమ్ చేసినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి సమంతను పోటీ చేయించాలని చూస్తున్నారట. సమంత క్రిస్టియన్. అక్కడ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ ఎక్కువ. దీన్ని క్యాష్ చేసుకోవాలనేది టీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నారు.

 

అయితే దీనిపై అక్కినేని ఫ్యామిలీ, సమంత ఎలా స్పందిస్తారో చూడాలి. రాజకీయాల్లోకి రానని సమంత చెబుతున్నప్పటికీ… కెటిఆర్ మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట. అన్నీ కుదిరి నిజంగానే సమంత రాజకీయాల్లోకి వస్తే… సంచలనమే అవుతుంది. సమంత రాజకీయాల్లోకి వస్తుందా రాదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.  

Leave a Reply

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange