అత్త‌కు య‌ముడు.. అమ్మాయికి మొగుడా..?

ఏమో ఇప్పుడు శైల‌జారెడ్డి అల్లుడు టీజ‌ర్ చూసిన త‌ర్వాత చాలా మందిలో వ‌స్తోన్న అనుమానం ఇదే. అల్ల‌రి అల్లుడు సినిమా అని ముందు నుంచి వార్త‌లు వినిపిస్తున్నాయి కానీ ఇప్పుడు టీజ‌ర్ చూసిన త‌ర్వాత అల్ల‌రి అల్లుడుతో పాటు చిరంజీవి ఆల్ టైమ్ క్లాసిక్ అత్త‌కు యుముడు అమ్మాయికి మొగుడు ఛాయ‌లు కూడా అందులో క‌నిపిస్తున్నాయి. అత్తా అల్లుళ్ల కాన్సెప్ట్ అన్న‌పుడు క‌చ్చితంగా ఇది వ‌స్తుంది. వ‌ద్ద‌న్నా కూడా అదే స్క్రీన్ పై క‌నిపిస్తుంది కూడా. ఇప్పుడు మారుతి కూడా ఇదే చేసాడు. అయితే దీనికే త‌న స్టైల్ అద్దేసాడు.
ఇగో అంటూ త‌న మార్క్ మేనరిజం ఇచ్చి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. అయితే ప్ర‌తీసారి హీరోకు ఓ డిసీజ్ పెట్టే మారుతి.. ఈ సారి మాత్రం హీరోయిన్ కు పెట్టాడు. అదే ఇగో.. ఇగో ఉన్న అమ్మాయిని ప్రేమించి.. అంత‌కంటే ఇగో ఎక్కువగా ఉన్న ఆమె అమ్మ‌ను అల్లుడుగా వ‌చ్చి నాగ‌చైత‌న్య ఎలా క‌న్విన్స్ చేసాడు.. ఆమె పొగ‌రు ఎలా అణచాడనేది శైల‌జారెడ్డి అల్లుడు క‌థ. ఆగ‌స్ట్ 31న ఈ చిత్రం విడుద‌ల కానుంది. చూస్తుంటే క‌చ్చితంగా చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యే ల‌క్ష‌ణాలు చాలానే ఈ చిత్రంలో క‌నిపిస్తున్నాయి.
పైగా ఈ చిత్ర బిజినెస్ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు చైతూ కెరీర్ లో లేనంత స్థాయిలో జ‌రుగుతుంది. అను ఎమ్మాన్యువ‌ల్ హీరోయిన్. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో ప్రేమ‌మ్ త‌ర్వాత చైతూ.. బాబుబంగారం త‌ర్వాత మారుతి చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్లాప్ లేని మారుతి.. నాగ‌చైత‌న్య‌కు ఎంత పెద్ద విజ‌యం ఇస్తాడ‌నేది ఇప్పుడు అంద‌రిలోనూ క‌నిపిస్తున్న ఆస‌క్తి. ఇది తేల‌డానికి కూడా మ‌రో నెల రోజులు మాత్ర‌మే టైమ్ ఉంది. అప్ప‌టి వ‌ర‌కు వేచి చూస్తుండ‌ట‌మే..!

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange