అనాధ పిల్లల కోసం అవెంజర్స్ స్పెషల్ షో వేసిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్

అనాధ పిల్లల కోసం అవెంజర్స్ స్పెషల్ షో వేసిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్

ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ తో సునామీ సృష్టిస్తున్న హాలీవుడ్ చిత్రం అవెంజర్స్. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని తాను మాత్రమే చూసి ఎంజాయ్ చేయకుండా… తనతో పాటు అనాధ పిల్లల కోసం ప్రత్యేక షో వేసి ఔన్నత్యాన్ని చాటుకున్నాడు హీరో సాయి ధరమ్ తేజ్. అవెంజర్స్ సిరీస్ లో ఎండ్ గేమ్ చివరిది. దీంతో ఈ సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. అవెంజర్స్ సిరీస్ కున్న క్రేజ్ దృష్టిలో ఉంచుకొని.. అనాధ పిల్లలతో కలిసి సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, గిరీష్, నవీన్ హైదరాబాద్ లోని సినిమాక్స్ పివిఆర్ స్క్రీన్ లో వీక్షించారు.
Akshar kuteer ashram, Good shephard ashram,
Sudheer foundation, Spoorthi foundation,
Desire society, Navjeevan foundation కు చెందిన పిల్లలు ఈ స్పెషల్ షో చూసి ఎంజాయ్ చేశారు. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నవీన్ పిల్లలందరికీ స్పెషల్ షో వేయడమే కాకుండా… మొక్కలు పంచి పర్యావరణం ఆవశ్యకతను తెలియజేశారు. దీంతో పాటు గిరీష్… స్వీట్స్, బిస్కెట్స్ పంచి పెట్టి ఉదారతను చాటుకున్నారు.

ఈ సందర్భంగా హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ… అవెంజర్స్ సినిమా పెద్దలతో పాటు పిల్లలు అమితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ పిల్లలతో కలిసి ఈ సినిమా చూసే అవకాశం… నాకు చాలా సంతోషాన్నిచ్చింది. పిల్లలంతా సినిమాను ఆద్యంతం ఎంజాయ్ చేశారు. ఈ సినిమాకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ నా సినిమాలు అర్థం చేసుకునే వయసు వీరిది కాదు. అవెంజర్స్ లాంటి సూపర్ హీరోస్ సినిమా ఐతే బాగా ఎంజాయ్ చేయగలరనే… ఈ స్పెషల్ షో ప్లాన్ చేశాం. వారు నాపై చూపిస్తున్న ప్రేమను మాటల్లో చెప్పలేను. షో తో పాటు పర్యావరణం విలువను ఈ వయసులోనే తెలియజేసేందుకు మొక్కల్ని పంచిపెట్టాం.  నాతో పాటు… వైష్ణవ్ తేజ్, గిరీష్, నవీన్ ఈ కార్యక్రమంలో పాల్గొని సపోర్ట్ గా నిలిచారు.  అని అన్నారు.

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange