రొమాంటిక్ థ్రిల్లర్ తాంత్రిక అక్టోబర్ 11న విడుదల

మోహన్, సంజననాయుడు, రాజ్‌కాంత్, గీత్‌షా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తాంత్రిక’. సంగ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సంగకుమార్ స్వామి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెండం శ్రీ్ధర్ దర్శకుడు. ఈనెల 12న విడుదలవుతోంది. సోమవారం హైదరాబాద్‌లో చిత్ర బృందం మీడియా సమావేశంలో మాట్లాడింది.

నిర్మాత సంగకుమార్ మాట్లాడుతూ వినోద్, హర్రర్, గ్రాఫిక్స్ హంగులు సమ్మిళితమైన చిత్రమిది. రొమాన్స్ పాళ్లు ఎక్కువ. యువతను ఈ చిత్రం అలరిస్తుందన్న నమ్మకముంది అన్నారు.

సాయివెంకట్ మాట్లాడుతూ వరుసగా సినిమాల్ని నిర్మిస్తూ తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకత సృష్టించుకుంటున్నారు సంగకుమార్. ఈ సినిమా అతనికి విజయం చేకూర్చాలన్నారు. ఇది రొమాంటిక్ థ్రిల్లర్ అని, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిన చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుందని కథానాయకుడు రాజ్‌కాంత్ చెప్పారు. మంచి కథాబలమున్న సినిమాలతో తెలుగు చిత్రసీమకు పరిచయం కావడం ఆనందంగా ఉందని సంజననాయుడు అన్నారు.

కార్యక్రమంలో సందీప్, చైత్ర తదితరులు పాల్గొన్నారు

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange