రథం మూవీ రివ్యూ

ఈ మధ్య కాలంలో పాటలతో ట్రైలర్ తో ఆకట్టుకున్న చిత్రం రథం. ముఖ్యంగా యూత్ ని టార్గెట్ చేసిన ఈ సినిమాతో చంద్ర శేఖర్ కానూరి దర్శకుడిగా పరిచయం అయ్యారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా ‘గీత ఆనంద్, చాందిని భాగవానని జంటగా నటించారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల్ని ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.

కథేంటంటే :

కార్తీక్ ( గీతానంద్ ) బాగా చదువుకున్నప్పటికీ.. వ్యవసాయం మీద ఆసక్తితో వ్యవసాయం చేస్తుంటాడు. అలాగే తోటివారు ఆపదలో ఉన్న.. వారికి అన్యాయం జరుగుతున్న అడ్డుగా నిలబడి అందరికీ సాయం చేసే మనస్తత్వం ఉన్నవాడు. ఇలాంటి కార్తీక్ లైఫ్ లోకి అనుకోకుండా జరిగిన ఓ సంఘటన కారణంగా బుజ్జి (చాందిని భాగవానని) వస్తోంది. బుజ్జితో కార్తీక్ ప్రేమలో పడతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఇద్దరూ ఒకర్ని ఒకరు ప్రేమించుకుంటారు. బుజ్జి తండ్రి అబ్బులు, కార్తీక్ లాగే తోటివారి కోసం పోరాడి ఇరవై సంవత్సరాలు జైల్లో గడిపి వస్తాడు. తన మంచితనం వల్ల తన భార్య పడిన కష్టాల్ని తలుచుకొని బాధపడతాడు. ఇప్పుడు మళ్లీ కార్తీక్ వల్ల తన కూతురికి అలాంటి పరిస్థితి రాకూడదని వారి ప్రేమకు అడ్డు చెబుతాడు.

ఆ తరువాత జరిగే కొన్ని పరిణామాల కారణంగా అబ్బులు వారి ప్రేమను అంగీకరించి ఓ షరతు పెడతాడు. అసలు అబ్బులు పెట్టిన ఆ షరతు ఏమిటి ? దానిలో కార్తీక్ నెగ్గుతాడా ? బుజ్జి మరియు అబ్బులు కోరుకున్న విధంగా కార్తీక్ మారతాడా ? ఈ క్రమంలో కార్తీక్ కి ఎదురయ్యే సమస్యలు ఏమిటి ?లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాలసిందే !

సమీక్ష
ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్ హీరో హీరోయిన్స్. ముఖ్యంగా హీరో గీతానంద్ లుక్స్ తో యాక్షన్ తో రొమాంటిక్ సీన్స్ తో డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లోనూ పరిణతి చెందిన నటుడిగా పెర్ ఫార్మ్ చేశాడు. చాలా సన్నివేశాల్లో ఈజీగా నటించేశాడు. ముఖ్యంగా హీరోయిన్ తండ్రితో సాగే సన్నివేశాల్లో, హీరోయిన్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో, క్లైమాక్స్ లో కూడా గీతానంద్ నటన చాలా బాగుంటుంది. హీరోయిన్ బుజ్జి పాత్రలో నటించిన చాందిని గ్లామర్ తో పాటు, ఇన్నోసెంట్ లుక్స్ పెర్ఫార్మన్స్ తో మెప్పించింది. పల్లెటూరి అమ్మాయిగా అందంగా ఉంది. నటనలోనూ మంచి మార్కులు కొట్టేసింది. రొమాంటిక్ సన్నివేశాలు అద్భుతంగా చేసింది. హావభావాలు బాగున్నాయి. క్లైమాక్స్ లో ఆమె పెర్ పార్మెన్స్ హైలైట్ గా ఉంది.

దర్శకుడు మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు. కథ, కథనం హైలైట్ గా ఉంటుంది. దర్శకుడి ఆలోచనకు తగ్గట్టుగా నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా ఉండడంతో చాలా సీన్స్ పండాయి. హీరో, హీరోయిన్ల మధ్యన వచ్చే ఘర్షణ తాలూకు సన్నివేశాలు సరదాగా ఎమోషనల్ గా సాగిపోతాయి. ముఖ్యంగా దర్శకుడు రొమాంటిక్ సీన్స్ ను దర్శకుడు బాగా హ్యాండిల్ చేశాడు. యాక్షన్ పార్ట్ ను బాడా డిజైన్ చేశాడు. సినిమాలో వచ్చే ట్విస్టులు బాగున్నాయి. ముద్దు సీన్స్ కావాల్సినన్ని ఉన్నాయి. మసాలా సీన్స్ తో మత్తెక్కించాడు. పెద్ద హీరోకు పడ్డ సీన్స్ గీతానంద్ కు పడ్డాయి. దీంతో బిల్డప్ షాట్స్ ఎక్కువగా ఉన్నాయి. దర్శకుడు చంద్ర శేఖర్ కానూరి రథం చిత్ర కథను బాగా డీల్ చేశాడు. సంగీత దర్శకుడు సుకుమార్ పమ్మి అందించిన నేపధ్య సంగీతం ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఆయన అందించిన పాటలు కూడా ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ఫైనల్ గా….
ఫుల్ మాస్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దిన రథం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెచ్చే చిత్రంగా తెరకెక్కించారు. యాక్షన్, రొమాన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. పాటలు ఫైట్స్ బాగున్నాయి. హీరో హీరోయిన్స్ పెర్ ఫార్మెన్స్ మెప్పిస్తుంది. ఓవరాల్ గా దర్శకుడు రథం చిత్రంతో మంచి మాస్ మసాలా చిత్రాన్ని అందించాడు.

Rating : 3

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange