రాజ‌మౌళి గారు.. అదెలా సాధ్య‌మండి..?

రాజ‌మౌళి సినిమా అంటే ఇప్పుడు ఎలా ఉంది అని అడ‌గడం కంటే దారుణం మ‌రోటి ఉండ‌దు. బ్యాట్ ప‌ట్టిన ప్ర‌తీసారి విరాట్ కోహ్లీ సెంచ‌రీ కొట్టిన‌ట్లు.. సినిమా చేసిన ప్ర‌తీసారి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇస్తుంటాడు రాజ‌మౌళి. ఇప్పుడు కూడా ఇదే చేయాలని చూస్తున్నాడు. ఈయ‌న తెర‌కెక్కించ‌బోయే ట్రిపుల్ ఆర్ పై ఇప్ప‌ట్నుంచే అంచ‌నాలు భారీగా ఉన్నాయి. దానికితోడు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ఫుల్ ఫామ్ లో ఉండ‌టం క‌లిసొచ్చే అంశం. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి రెమ్యున‌రేష‌న్స్ అనే మాటే లేకుండా చేస్తున్నారు. ఇందులో స్టార్ క్యాస్ట్ ప్ల‌స్ ద‌ర్శ‌కుడికి నిర్మాత పారితోషికం ఇవ్వాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అందుకే లాభాల్లో వాటాలు తీసుకోవాల‌ని చెబుతున్నారు దాన‌య్య‌. దీనికి చ‌ర‌ణ్, ఎన్టీఆర్ తో పాటు రాజ‌మౌళి కూడా సై అనేసాడు.
రాజ‌మౌళి ఒక్క‌డే 1000 కోట్లతో స‌మానం. అలాంటి ద‌ర్శ‌కుడికి ఎంతని రెమ్యున‌రేష‌న్ ఇస్తాడు చెప్పండి..? ఇక చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కూడా దాదాపు 200 కోట్ల రేంజ్ కు వెళ్లిపోయారు. దాంతో ఈ ముగ్గురు క‌లిసారంటే దాదాపు బాహుబ‌లిని బీట్ చేస్తారేమో..? ఈయ‌న మ‌ల్టీస్టార‌ర్ ఎలా ఉంటుందో అని కూడా అడ‌క్కుండానే 180 కోట్ల‌కు బేరం పెట్టాడు క‌ర‌ణ్ జోహార్. అది కూడా కేవ‌లం హిందీ రైట్స్ కోస‌మే. అదీ రాజ‌మౌళి ఇమేజ్. ఎందుకంటే అక్క‌డ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌కు అంత మార్కెట్ లేదు. ప్ర‌స్తుతం ఈ మ‌ల్టీస్టార‌ర్ లో హీరోయిన్ల‌తో పాటు మిగిలిన కారెక్ట‌ర్లు ఎవ‌రు ఉంటార‌నే విష‌యంపై చాలా ర‌చ్చ జ‌రుగుతుంది. 300 కోట్ల‌తో ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు డివివి దాన‌య్య‌.
ఇక హీరోయిన్లుగా మాత్రం ఇక్క‌డి వాళ్ల‌నే తీసుకుంటున్నాడు ద‌ర్శ‌క ధీరుడు. ప్ర‌స్తుతానికి ఎన్టీఆర్ కు జోడీగా కీర్తిసురేష్ ను ఎంచుకున్నాడు జ‌క్క‌న్న‌. మ‌హాన‌టిలో ఈమె న‌ట‌న‌కు ఫిదా అయిపోయిన రాజ‌మౌళి.. త‌న చిత్రంలో ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని తెలుస్తుంది. ఇక మ‌రో హీరోయిన్ గా ర‌కుల్ ను ఎంచుకున్న‌ట్లు తెలుస్తుంది. ముందు పూజాహెగ్డేను అనుకున్నా కూడా ఈమె ఉన్న బిజికీ డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌క‌పోతే మొత్తం సినిమాపైనే ఆ ప్ర‌భావం ప‌డుతుంద‌ని ర‌కుల్ వైపు అడుగేస్తున్నాడు రాజ‌మౌళి. ఈ సినిమాను ప్రేక్ష‌కులు అనుకున్న దానికంటే త్వ‌ర‌గానే మొద‌లు పెడ‌తాం అని ఎన్టీఆర్ క్లారిటీ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం క‌నిపిస్తుంది.

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange