ప్రేమెంత పనిచేసే నారాయణ మూవీ రివ్యూ….

ద‌ర్శ‌కుడు జొన్న‌ల‌గ‌డ్డ శ్రీనివాస‌రావు త‌న‌యుడు హ‌రికృష్ణ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ఆయన తెరకెక్కించిన చిత్రం `ప్రేమెంత ప‌నిచేసే నారాయ‌ణ‌`. అక్షిత క‌థానాయిక‌. ఝాన్సీ ప్ర‌ధాన పాత్ర పోషించింది. జెఎస్ ఆర్ మూవీస్ ప‌తాకంపై సావిత్రి జొన్న‌ల‌గ‌డ్డ నిర్మించారు. యాజ‌మాన్య సంగీతం అందించారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథేంటంటే….

హరి (హరి కృష్ణ జొన్నలగడ్డ) ఓ అనాధ. శిరీష (అక్షిత) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆ ఏరియా మేయర్ (ఝాన్సీ) కొడుకు శిరీషను చూసి ఇష్టపడతాడు. తనతో ఒక్క రాత్రి అయిన గడపాలని అడుగుతాడు. దీంతో అసలు వార్ మొదలవుతుంది. తాను ప్రేమించిన అమ్మాయిని వేరే అబ్బాయి మోహించడం హరికి నచ్చదు. కానీ మేయర్ కొడుకు. మరి హరి మేయర్ ను ఆమె కొడుకును ఎలా ఎదుర్కొన్నాడు. తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడనేది అసలు కథ.

సమీక్ష
ప్రేమంతా పని చేసే నారాయణ ఊర మాస్ యాక్షన్ అంశాలతో కూడిన చిత్రం. భారీ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. పెద్ద సినిమాను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఫ్యామిలీ వాల్యూస్ ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. మంచి పాటలు ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. పాటలకు తగ్గట్టుగా హీరో హీరోయిన్ డ్యాన్సులు ఇరగదీశారు. చాలా బాగా కష్టపడ్డారనిపించింది. హీరో హరికృష్ణకు మంచి భవిష్యత్ ఉంది. మంచి కమర్షియల్ హీరోగా ఎదిగేందుకు కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. డైలాగ్స్ చాలా బాగా చెప్పాడు. మాస్ డైలాగ్స్ బాగా చెప్పాడు. ఫైట్స్, డ్యాన్సులు ఇరగదీశాడనే చెప్పాలి. నటనలో ఈజ్ ఉంది. హీరోయిన్ తో మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేసాడు.

దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస రావు తనయుడి కోసం మంచి ప్యాకేజ్ సినిమా అందించాడు. అన్ని ఎలిమెంట్స్ ని టచ్ చేసుకుంటూ వెళ్లాడు. ఫక్తు కమర్షియల్ ఫార్మాట్ సినిమాను రిచ్ గా నిర్మించారు. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చుకునే విధంగా కమర్షియల్ అంశాల్ని ఇందులో పొందుపరిచారు. ప్రతీ పాట ఊపు మీదున్నట్టుగా ఉంటుంది. ప్రతీ సీన్ ను క్లైమాక్స్ సీన్ లా అనిపిస్తుంది. ఆయనకున్న అనుభవం ఈ సినిమాకు బాగా ఉపయోగపడింది. నిర్మాణాత్మక విలువలు చాలా బాగున్నాయి. ఝాన్సి క్యారెక్టర్ ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఆమె కెరీర్ రో మరో మంచి పాత్ర ఇది.

వ‌న‌మాలి, గోస‌ల రాంబాబు మంచి సాహిత్యం అందించారు. వంశీ ప్రకాష్ ఛాయాగ్ర‌హ‌ణం చాలా బాగుంది. హీరోను బాగా ఎస్టాబ్లిష్ చేసారు. బిల్డప్ షాట్స్ బాగుంది. జానకి రామ్ ఎడిటింగ్ బాగుంది. భూప‌తి రాజా, మ‌రుధూరి రాజా, రాజేంద్ర కుమార్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉంది. సుబ్బారాయుడు బొంపెం మాటలు ఈ సినిమా కథను బాగా ఎలివేట్ చేశాయి. కొన్ని చోట్ల క్లాప్స్ కూడా కొట్టించాయి. ప్రేమ్ ర‌క్షిత్, విద్యాసాగ‌ర్, శ్రీద‌న్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. రామ్ సుంక‌ర‌ యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. నిర్మాణాత్మక విలువలు చాలా బాగున్నాయి. మంచి క్వాలిటీ తోసినిమా నిర్మించారు.
హ‌రిలో మంచి ఫైర్,పెర్పామెన్స్ ఉంది. అంత‌కు మంచి ఎనెర్జీ లెవ‌ల్స్ ఉన్నాయి. మంచి క‌థ‌తో హీరోగా ప‌రిచయం అయ్యాడు. హీరో- ఝాన్సీ పాత్ర‌ల మ‌ధ్య స‌వాల్ తో క‌థ న‌డుస్తుంది. అక్క‌డ ఎదురైన ఓ స‌వాల్ అమ్మాయి ప్రేమ‌కు ఎలా దారితీసింద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. రెండు పాత్ర‌లు సినిమాలో బాగా పండుతాయి. ఈ సినిమా కోసం తండ్రీ కొడుకులిద్ద‌రూ బాగా కష్టపడ్డారు.

ఫైనల్ గా…
రెగ్యుల‌ర్ ల‌వ్ స్టోరీల‌కు భిన్నంగా ఉంటుంది. ఇదో పెయిన్ పుల్ స్టోరీ. ప్రేమ‌కు కొత్త అర్ధం చెప్పే సినిమా. ప్రేమ అంటే అమ్మాయి అబ్బాయి ఉంటే స‌రిపోతుంద‌నుకుంటారు. కానీ స్నేహితుడు లేక‌పోతే ప్రేమ లేద‌ని చెప్పే సినిమా ఇది. స్నేహితుడి విలువ‌ను చాటి చెప్పే క‌థ‌. క్లైమాక్స్ ఆద్యంత ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. చాలా రియ‌ల్ స్టిక్ గా ఉండే సినిమా ఇది. చాలా స‌న్నివేశాలు ఎమోష‌న్ తో న‌డుస్తాయి. సో గో అండ్ వాచ్…

PB Rating : 3.25/5

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange