ప్రేమాంజలి మూవీ రివ్యూ

ప్రేమ కథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే న్యూ కమర్స్ ప్రేమ కథల్ని ఎంచుకుంటారు. తాజాగా వచ్చిన ప్రేమాంజలి ప్యూర్ లవ్ స్టోరీ. టైటిల్ ద్వారానే ఈ విషయం స్పష్టంగా చెప్పేశారు. టైటిల్ సినిమా ట్రైలర్స్ ఆకట్టుకోవడంతో ప్రేమాంజలిపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతకూ ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

ప్రేమాంజలి యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్. నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టే చిత్రంగా తెరకెక్కించారు దర్శకుడు. సుజయ్, శ్వేతా నెల్ కొత్త వారైనప్పటికీ… చాలా బాగా నటించారు. ఎక్స్ పీరియెన్స్ ఉన్న నటీనటులుగా కనిపించారు. లవ్ ఎపిసోడ్స్ లో ఇద్దరి కెమిస్ట్రీ బాగుంది. ఇద్దరి పెయిర్ బాగుంది. శ్రీమతి సీతా మహాలక్ష్మి సమర్పణలో శ్రీ వినాయక క్రియేషన్స్ పతాకం పై ఆర్ వరుణ్ డోరా దర్శకుడిగా ఆర్ వీ నారాయణ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు వరుణ్ డోరా మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు అని అర్థమైంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడంతో యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.

ప్రేమలో పడి హద్దులు దాటితే ఏమవుతుందో ఈ సినిమాలో చూపించారు. రియల్ లైఫ్ లో జరుగుతున్న సంఘటనల్ని ఆవిష్కరించాడు దర్శకుడు. తల్లి దండ్రుల సన్నివేశాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ ని మెప్పించాడు. క్లైమాక్స్ పార్ట్ డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. రొమాంటిక్ సన్నివేశాలు యువతని ఆకట్టుకుంటాయి. ప్రేమికులకు వాళ్ళ తలిదండ్రుల మధ్య జరిగే సంభాషణలు ఫామిలీ ఆడియెన్స్ ని మెప్పిస్తాయి. కామెడీ బాగా వర్కవుట్ చేశారు. థియేటర్ లో ప్రతిఒక్కరు సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు.

ఈ చిత్రానికి పాటలు హైలైట్ గా నిలిచాయి.. సంగీత దర్శకుడు పి గోవర్ధన్ అందించిన పాటలను చాల చక్కగా చిత్రీకరించారు. ఫోటోగ్రఫీ చాల బాగుంది. డైలాగ్స్ మనసును హత్తుకుంటాయి. మంచి కథ, కథనం, నటీనటుల సహజమైన నటన మాటలు అన్ని కలిపి ఈ ప్రేమాంజలి అందరూ చూడదగ్గ సినిమా.

PB Rating : 2.5/5

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange