ప్రేమకు రెయిన్ చెక్ మూవీ రివ్యూ

తెలుగు సినీ జగత్తులో ప్రేమ కథలకు కొదవ లేదు. ఎన్నో ప్రేమ కథల్ని ఎన్నో రకాలుగా ప్రెజెంట్ చేసి సక్సెస్ అయ్యారు. తొలి చిత్ర దర్శక నిర్మాతలు సైతం ప్రేమ కథల్ని వైవిధ్యంగా చూపించి సక్సెస్ సాధించారు. అలాగే ప్రేమకు రెయిన్ చెక్ చిత్ర దర్శక నిర్మాతలు సైతం కేవలం ప్రేమ కథనే కాకుండా అనేక విషయాల్ని టచ్ చేస్తూ డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కించారు. రిలీజ్ చేసిన ట్రైలర్స్, సాంగ్స్ తో మంచి బజ్ సంపాదించుకొన్ని ఈ చిత్ర ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అభిలాష్ వాడాడ , ప్రియా వడ్లమాని , మోనికా తావణం ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో ఈ ట్రెండీ లవ్ స్టోరీ రూపొందించారు. సీనియర్ నిర్మాత శరత్ మరార్ ఈ సినిమాకు సపోర్ట్ గా నిలిచారు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం.

కథేంటంటే….

విక్కీ (అభిలాష్ ) మరియు రమ్య (ప్రియ) ఒక అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏజెన్సీలో పనిచేస్తుంటారు. విక్కీ అభిరుచులు పట్టుదల రమ్యకు బాగా నచ్చుతాయి. అతనంటే ఇష్టం పెరుగుతుంది. ఇష్టం ప్రేమగా మారుతుంది. తన ప్రేమను విక్కీకి చెప్పాలనుకుంటుంది. కానీ ఇంతలోనే విక్కీ జీవితంలోకి తాన్యా (మోనికా) ప్రేయసిగా వస్తుంది. ఇంతకూ ప్రియ తన ప్రేమను సాధించుకుందా. తాన్య ఎవరు. విక్కీ తాన్య మధ్య ఉన్న రిలేషన్ ఎంతవరకు నడిచింది. ఎవరి ప్రేమ ఎవరికి దక్కింది. విక్కీ ఎవరిని ఇష్టపడ్డాడనేది అసలు కథ.

సమీక్ష
అభిలాష్, ప్రియ, మోనికా కొత్త వారైనప్పటికీ ఎలాంటి భయం లేకుండా నటించారు. కెమెరా ముందు చాలా బాగా పెర్ ఫార్మ్ చేశారు. ఈ సినిమా ఈ ముగ్గురికి మంచి పేరు తీసుకొస్తుంది. తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు వీరిలోని టాలెంట్ ను గుర్తించి సరైన క్యారెక్టర్స్ ఇచ్చారు. ముగ్గురు కూడా లవ్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించారు. ఎడ్వెంచర్ స్పోర్ట్ లోనూ తమ టాలెంట్ చూపించారు. క్లైమాక్స్ పార్ట్ వీరికి మంచి పేరు తీసుకొస్తుంది. వీరితో పాటు నటించిన మిగిలిన క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ గా నటీనటులందరూ దర్శకుడి ఆలోచనను సరిగ్గా తీసుకొని పెర్ ఫార్మ్ చేయగలిగారు.

టెక్నికల్ గా ఈ సినిమాకు పాటలు చాలా బాగా ప్లస్ అయ్యాయి. దీపక్ కిరణ్ పాటలు ట్రెండీగా ఉన్నాయి. రీ రికార్డింగ్ లోనూ తన ప్రతిభ చూపించాడు. కెమెరా వర్క్ హైలైట్ గా నిలిచింది. శరత్ కి మంచి ఫ్యూచర్ ఉంది. సినిమా చాలా క్వాలిటీగా రావడానికి మెయిన్ కారకుడయ్యాడు. ప్రతీ ఫ్రేమ్ రిచ్ గా బ్యూటిఫుల్ గా ఉంది. అడ్వెంచరస్ సాంగ్ ని అద్భుతంగా చిత్రీకరించాడు. పెద్ద సినిమా ఫీలింగ్ తీసుకురాగలిగాడు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. చిన్న సినిమాల్లో ఈ మధ్య కాలంలో ఇంత క్వాలిటీ సినిమా రాలేదనే చెప్పాలి. నిర్మాణాత్మక విలువలు చాలా బాగున్నాయి.

అయితే…. స్టోరీ కాస్త నెమ్మదిగా వెళ్తుంది. ఇంకా కొన్ని స్ట్రాంగ్ సన్నివేశాలు పడుంటే బాగుండేదనిపించింది. అయితే దర్శకుడి ఫస్ట్ సినిమా అయినప్పటికీ చాలా హాగా డీల్ చేయగలిగాడు. ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీని తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయగలిగాడు. రఘు కామెడీ ట్రాక్ బాగా ప్లస్ అయ్యింది. అతని డైలాగ్ డిక్షన్ తో కామెడీ పండించాడు. ఈ చిత్ర దర్శకుడు ఆకెళ్ళ పెరి శ్రీనివాస్ అందరిలాగా రెగ్యులర్ కథ కాకుండా… డిఫరెంట్ గా సాగే లవ్ స్టోరీని ఎంచుకున్నాడు. మంచి ఆర్టిస్టుల్ని ఎంచుకొని సక్సెస్ అయ్యాడు. కథకు ఎంత అవసరమో అలాంటి సీన్స్ తో ముందుకు నడిపించగలిగాడు. ప్రేమకు రెయిన్ చెక్ అనే డిఫరెంట్ టైటిల్ తో ఆకర్షించి… టైటిల్ కు మంచి జస్టిఫికేషన్ ఇచ్చాడు. ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినప్పటికీ… ఓ పది సినిమాలు చేసిన అనుభవం ఉన్న దర్శకుడిలా సన్నివేశాల్ని ఫ్రేమ్ చేశాడు. ఈ సినిమాతో తెలుగు చిత్ర సీమకు మరో సెన్సిబుల్ డైరెక్టర్ దొరికినట్టే.

ఓవరాల్ గా… ఎన్నో లవ్ స్టోరీలు చూసుంటాం. కానీ ప్రేమకు రెయిన్ చెక్ డిఫరెంట్ లవ్ స్టోరీ. ఈ తరహా లవ్ స్టోరీలు అరుదుగా వస్తుంటాయి. చిన్న చిత్రాల్లో మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ తీసిన ఈ సినిమా అన్ని వర్గాల్ని ఆకట్టుకునే అంశాలతో రూపొందించారు. సో…. గో అండ్ ఎంజాయ్….

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange