బుల్లితెరమీద దూసుకుపోతున్న నూతన్ నాయుడు

బిగ్ బాస్ తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన నూతన్ నాయుడు టీవీ మీడియాలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. జీటీవీ, మాటీవీ, జెమినీ టీవీలో మూడు మెగా సీరియల్స్ లో నూతన్ నాయుడు కనిపించబోతున్నాడు.

బిగ్ బాస్ షోలో తన టైమింగ్ తో, రైమింగ్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేసిన నూతన్ నాయుడు పాపులర్ టీవీ సీరియల్స్ లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ చేయడం ప్రేక్షకులకు నిజంగా శుభవార్తే.

బిగ్ బాస్ 2 లో ఎక్కువమంది సెలబ్రిటీలు టీవీ రంగం నుండి వచ్చినవాళ్ళే. నూతన్ నాయుడు ఒక్కడే రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తి. కానీ విశాఖ పట్నం విశాలాక్షి స్కిట్ తో నూతన్ నాయుడు చేసిన ఫెర్ఫార్మెన్స్ ఫ్రేక్షకులతో పాటు చాలామంది సీరియల్ మేకర్స్ ని కట్టి పడేసింది. అందుకే అనుభవం లేదని చెప్పినా వినకుండా నూతన్ నాయుడికి క్యూ కట్టి మరీ అవకాశాలు ఇస్తున్నారు సీరియల్ నిర్మాతలు, దర్శకులు. వచ్చిన అవకాశాల్ని నూతన్ నాయుడు కూడా సరిగానే వినియోగించుకుంటున్నాడు.

ప్రస్తుతం జీటీవి, మా టీవీ, జెమినీ టీవిల్లో మూడు మెగా సీరియల్స్ లో ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్న నూతన్ నాయుడు మా టీవీలో త్వరలో ప్రసారం కాబోతున్న ఒక సామాజిక స్పృహ ఉన్న ఒక కార్యక్రమానికి సైన్ కూడా చేసేసాడు. ఓంకార్ హోస్ట్ గా వస్తున్న సూపర్ హిట్ గేం షో సిక్స్త్ సెన్స్ లో కూడా నూతన్ నాయుడు త్వరలో కనిపించ బోతున్నాడు. ఇలా మూడు సీరియల్స్ ఆరు అవకాశాలుగా దూసుకుపోతున్న నూతన్ నాయుడు బుల్లి తెరమీద మరింత రాణించాలని మనం కూడా కోరుకుందామా?

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange