నోటా మూవీ రివ్యూ

విజయ్ దేవరకొండకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఆ ఫాలోయింగ్ ను కంటిన్యూ చేసేందుకు ఈసారి నోటాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మాతగా ఈ చిత్రాన్ని పలు భాషల్లో నిర్మించారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్ర ట్రైలర్స్ తో మంచి బజ్ నెలకొంది. ఆ బజ్ తో భారీ ఓపెనింగ్స్ తో నోటా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

సమీక్ష
అనుకోకుండా సిఎం అయ్యే పాత్రలో విజయ్ దేవరకొండ నటించాడు. అతని తండ్రి పాత్రలో సిఎంగా నాజర్ నటించారు. విజయ్ దేవరకొండకు హెల్ప్ చేసే జర్నలిస్ట్ పాత్రలో సత్యరాజ్ నటించారు. అతని కూతురు పాత్రలో హీరోయిన్ మెహ్రీన్ నటించింది. ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ముఖ్యంగా యంగ్ సిఎంగా విజయ్ దేవరకొండ తన పెర్ పార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. యంగ్ పొలిటీషియన్ క్యారెక్టర్ గా బాగా సెట్ అయ్యాడు. తన కెరీర్లో విభిన్న మైన పాత్ర ఇది. ఈ తరహా పాత్రలు ఎప్పుడో గానీ రావు. అలాంటిది కెరీర్ ప్రారంభంలోనే తనకు వచ్చింది. వచ్చిన ఈ బరువైన పాత్రను సమర్థవంతంగా పూర్తి చేశాడు. సినిమాలో రెండు మూడు రకాల వేరియేషన్స్ ఉన్నాయి. డైలాగ్స్ చెప్పడంలోనూ తన సత్తాను చాటాడు.

దర్శకుడు ఆనంద్ శంకర్ సరైన సమయంలో సరైన సినిమా తీశాడనిపించింది. తెలంగాణలో పొలిటికల్ హీట్ ఉంది. ఈసమయంలో వచ్చిన ఈ సినిమా కంటెంట్ విభిన్నంగా ఉంటుంది. ఆలోచింపచేసేదిగా ఉంటుంది. విజయ్ ను ఎంచుకొని మంచి పని చేశాడనిపించింది. రాజకీయాలకు సంబంధించిన విషయాన్ని విజయ్ తో చెప్పించాడు. డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు. ఎమోషనల్ సీన్స్ బాగా పండాయి. ముఖ్యంగా బస్ సీన్ వచ్చినప్పుడు కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అలాగే సెకండాఫ్ లో వచ్చే ఫ్లడ్స్ సీన్స్ హై ఎమోషల్ గా సాగుతుంది. ఈ సీన్స్ లో విజయ్ నటన అదుర్స్ అనే చెప్పాలి.

దర్శకుడిగా ఆనంద్ శంకర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. విజయ్ ఎనర్జీని దృష్టిలో ఉంచుకొని ఈ పాత్రను డిజైన్ చేశాడు. రాజకీయాల్లో తెరవెనక జరిగే బాగోతాన్ని చూపించాడు. సత్యరాజ్ లవ్ స్టోరీ, నాజర్ ఫ్యామిలీ డ్రామా హైలైట్ గా నిలిచింది. స్వామీజీలు రాజకీయాల్లో ఎలా ఉంటారో చూపించారు. రాష్ట్రాన్ని నడిపించేది స్వామీజీలే అని చెప్పకనే చెప్పాడు. ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. టెక్నికల్ గా కూడా సినిమా చారా రిచ్ గా ఉంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ రంగాల్లో పై చేయి సాధించారు. హీరోయిన్ మెహ్రీన్, సత్యరాజ్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఈ సినిమాకు హైలైట్.

ఓవరాల్ గా హై ఇంటెన్షన్ యంగ్ పొలిటికల్ డ్రామాను ఆనంద్ శంకర్ బాగా డీల్ చేయగలిగాడు. విజయ్ దేవరకొండ నటన, పొలిటికల్ సీన్స్, స్క్రీన్ ప్లే సినిమాకు హైలైట్ గా నిలిచింది. రెగ్యులర్ గా వచ్చే లవ్ స్టోరీల్లా కాకుండా…. డిఫరెంట్ గా ఉండే సినిమా ఇది. గో అండ్ వాచ్…

PB Rating : 3.25/5

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange