నాటకం మూవీ రివ్యూ

ఈ మధ్యకాలంలో ట్రైలర్స్ టీజర్స్ తో ఆకట్టుకున్న చిన్న సినిమా నాటకం. రా కల్ట్ కంటెంట్ గా కనిపించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడాబాగా జరగడంతో ఈ సినిమా రిలీజ్ పై అంచనాలు ఏర్పడ్డాయి. అంతా కొత్త వారు చేసినప్పటికీ నాటకం గురించి భారీ చర్చే జరిగింది. ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. కళ్యాణ్ జి గోగన దర్శకుడు. సాయి కార్తీక్ సంగీతం అందించగా గరుడవేగతో మంచి పేరు తెచ్చుకున్న అంజి సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ట్రైలర్స్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథేంటంటే…. విలేజ్ లవ్ స్టోరీ ఇది. కోటి (ఆశిష్ గాంధీ) ఊర్లో గాలికి తాగి తిరుగుతుంటాడు. అలాంటి వ్యక్తి పార్వతి (ఆశిమా) లవ్ లో పడతాడు. పార్వతి కూడా కోటిని ఇష్టపడుతుంది. ఇద్దరూ సెక్సువల్ గా కూడా దగ్గరవుతారు. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. మరోవైపు ఊర్ల మీద పడి ఓ గ్యాంగ్ బంగారం నగల కోసం మనుషుల్ని చంపుతుంటారు. అలా 72 మందిని చంపేస్తారు వీరిని పట్టుకునేందుకు ఓ పోలీస్ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తుంటాడు. అలాంటి గ్యాంగ్ కోటి ఉన్న ఊర్లోకి ఎంటర్ అవుతారు. కోటి, పార్వతి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత పార్వతి గురించిని నిజాలు తెలుసుకొని షాక్ అవుతాడు. పార్వతి ద్వారా తెలుసుకునే నిజాలు కూడా షాకింగ్ గా ఉంటాయి.

ఇంతకూ ఆ దొంగల ముఠా ఎవరు. వారి నాయకుడు ఎవరు. కోటి కి పార్వతి చెప్పే నిజాలు ఏంటి. అసలు పార్వతి ఎవరు ఆమె గతం ఏంటి. ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష

ఓ దోపిడీ ముఠా ఓ గ్రామం మీద దాడి చేసి, అందర్నీ చంపే కాన్సెప్ట్ ని దర్శకుడు బాగా డీల్ చేశారు. గతంలో ఈ తరహా కంటెంట్ తో వచ్చినప్పటికీ.. ఈ దర్శకుడు మాత్రం విభిన్నంగా చూపించే ప్రయత్నం చేశాడు. ఎవ్వరూహించని ట్విస్టులతో కథ సాగుతుంది. మధ్య మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్టింగ్ గా ఉంటాయి. హీరో హీరోయిన్ మధ్య లవ్ లస్ట్ కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ బాగా ప్లాన్ చేశారు. సైకిల్ ఫైట్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. మరో వైపు హీరో హీరోయిన్ మధ్య ఘాటైన రొమాన్స్ ని పీక్స్ లో చూపించారు. హీరో హీరోయిన్ కూడా బాగా ఇన్ వాల్వ్ అయ్యారనిపించింది. ప్రతీ పది పదిహేను నిమిషాలకొకసారి… ఏదో ఓ ఎమోషనల్ సీన్ తో ఆకట్టుకున్నాడు. తండ్రి తన భార్యగా తీసుకొచ్చే ఆమెతో కోటి సీన్ బాగుంది. పాము కాటుకు ఒకామె గురవ్వడం… అంబులెన్స్ హీరోనే తయారు చేయడం లాంటి సీన్స్ బాగున్నాయి. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ వేసే పంచులు బాగున్నాయి.

హీరో ఆశిష్ గాంధి గెడ్డం మాస్ లుక్ తో బాగున్నాడు. రగ్గ్ డ్ పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. లోకల్ నేటివీటీ ని బాగా చూపించాడు. మాస్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే విషయాలు చాలా ఉన్నాయి. హీరో హీరోయిన్స్ రియలిస్టిక్ పెర్ ఫార్మెన్స్ చూపించారు. కోర్ట్ సీన్ కూడా బాగా ప్లాన్ చేశారు. దర్శకుడు కొత్త వాడిలా కాకుండా ఎక్స్ పీరియెన్స్ ఉన్న వాడిలా చేశాడు. హీరోయిన్ బోల్డ్ సీన్స్ అయినప్పటికీ జంకు లేకుండా చేసింది. తోటపల్లి మధు హీరో తండ్రి పాత్రలో కామెడీ చేశాడు. టెక్నికల్ గా సాయి కార్తిక్ మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యింది. పాటలు ఆర్ ఆర్ బాగా ప్లస్ అయ్యింది. అంజి సినిమాటోగ్రఫి పర్ ఫెక్ట్ గా కుదిరింది. విజువల్ బ్యూటీ చూపించాడు. మణికాంత్ షార్ప్ ఎడిటింగ్ చేశారు. ఎడిటింగ్ బాగా చేశారు. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. మంచి క్వాలిటీ సినిమా అందించారు.

ఫైనల్ గా… మాస్ కంటెంట్ ని విభిన్నమైన స్క్రీన్ ప్లే తో దర్శకుడు మెప్పించాడు. బి, సి సెంటర్ ప్రేక్షకుల్ని మెప్పించే కంటెంట్ ఉంది కాబట్టి మాస్ ఆడియెన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుంది. డిఫరెంట్ కంటెంట్ స్క్రీన్ ప్లే ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుంది. చివర్లో వచ్చే ట్విస్టులు సినిమా గ్రాఫ్ ను పెంచాయి. ఓవరాల్ గా…. ఈ నాటకం రంజిపంజేస్తుంది.

PB Rating : 3.25/5

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange