సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే బిజినెస్ క్లోజ్…

సమ్మోహనం తర్వాత సుధీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమాకు మంచి బజ్ వచ్చింది. ట్రైలర్ రిలీజ్ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఈ సినిమా కోసం ఎగబడ్డారు. సమ్మోహనం వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ట్రేడ్ వర్గాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా క్లోజ్ చేశారని తెలుస్తోంది.

ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి థియేట్రికల్ రైట్స్ నుంచి వచ్చేసింది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్ తో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. సుధీర్ బాబు తన సొంత నిర్మాణ సంస్థలో వస్తున్న కావడంతో అన్ని విషయాల్ని చాలా కేర్ ఫుల్ గా డీల్ చేశారు.

సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంతో ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. హీరోయిన్ నభా నటేష్ నటన ట్రైలర్ లో అదిరిపోయింది. ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ కూడా ఫుల్ పాజిటివ్ గా ఉంది. క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ మంచి ప్రైజ్ ఇచ్చి సొంతం చేసుకున్నారు. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ చిత్రం ఉండనుంది.

ఈనెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా మీదున్న నమ్మకంతో ముందే ప్రీమియర్స్ వేయనున్నారట.

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange