బావ‌కు పోటీగా వెళ్తోన్న నాగ్..

 

నాగార్జున‌కు బావ ఎవ‌రు..? ఇంకెవ‌రు వెంక‌టేశ్ ఒక్క‌డే క‌దా..! చెల్లిని చేసుకున్న బావ‌..! ఆయ‌న‌తో పాటు సురేష్ బాబు కూడా నాగార్జున‌కు బావే. ఇప్పుడు ఈయ‌న‌కు పోటీగా వెళ్తున్నాడు నాగార్జున‌. ఇన్నాళ్లూ తెలుగులో చిన్న సినిమాల‌కు స‌పోర్ట్ గా ఉన్న‌దెవ‌రు అంటే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అనే పేరు వినిపించేది. అందులో వాళ్ల లాభాపేక్ష ఎంతున్నా.. లాభాలు ఎంత తీసుకున్నా కూడా మంచి సినిమాలు విడుద‌ల కాకుండా ఉంటే మాత్రం క‌చ్చితంగా సురేష్ బాబు సాయం చేస్తాడు. పెళ్లిచూపులు.. మెంట‌ల్ మదిలో లాంటి సినిమాలు అలా బ‌య‌టికి వ‌చ్చిన‌వే. అలాగే తక్కువ బడ్జెట్ లో చేసిన కంచరపాలెం సినిమా ను కూడా సురేష్ బాబు టేకోవర్ చేశాడు. గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే ప‌ని త‌ను కూడా చేస్తానంటున్నాడు నాగార్జున‌.

త‌మ అన్న‌పూర్ణ స్టూడియోస్ లో ఇక‌పై మంచి సినిమాలు ఏవి ఉన్నా కూడా తీసుకుంటానంటున్నాడు నాగ్. విడుద‌ల కాకుండా ఆగిపోయిన చిన్న సినిమాలు కానీ.. మంచి స‌బ్జెక్ట్ ఉన్న సినిమాలు కానీ వ‌స్తే క‌చ్చితంగా తాను విడుద‌ల చేయ‌డానికి.. స‌పోర్ట్ చేయ‌డానికి రెడీగా ఉన్నానంటూ ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చాడు నాగార్జున‌. ఇప్పుడు చిల‌సౌ కూడా అలా విడుద‌ల చేసిన సినిమా. సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్ర‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రం విడుదలై మంచి పేరు సంపాదించుకుంది. సుశాంత్ ఉన్నాడని కాకుండా సినిమా చూసి రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చాడు నాగ్. తన తొలి ప్రయత్నం ఫలించింది. ముగ్గురు నిర్మాత‌ల నుంచి ఈ చిత్రాన్ని కొన్నాడు ఈ హీరో. ఇలాగే ఇప్పుడు చిన్న సినిమాలు ఏవి న‌చ్చినా కూడా కొని విడుద‌ల చేస్తానంటున్నాడు నాగ్.

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange