నాగ్ అక్కడికి ఎందుకెళ్లాడో తెలుసా..?

నాగార్జున కేవ‌లం తెలుగు హీరో మాత్ర‌మే కాదు.. బాలీవుడ్.. కోలీవుడ్ హీరో కూడా. మ‌న హీరోలెవ‌రూ అక్క‌డ ట్రై చేయ‌క‌ముందే బాలీవుడ్ లో శివ సినిమాతో సంచ‌ల‌నం సృష్టించాడు నాగార్జున‌. ఇక త‌మిళ‌నాట కూడా స్ట్రెయిట్ సినిమాలు చేసాడు. అయితే అక్క‌డ్నుంచి ఎన్ని అవ‌కాశాలొచ్చినా కూడా ఎప్పుడూ తెలుగు ఇండ‌స్ట్రీని వ‌దిలిపెట్ట‌లేదు నాగార్జున‌. అయితే ఇన్నేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ బాలీవుడ్ కు వెళ్లాడు మ‌న్మ‌థుడు. అయ‌న్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న బ్ర‌హ్మాస్త్ర‌లో చిన్న రోల్ చేస్తున్నాడు నాగ్.
ఈ చిత్రంలో కేవ‌లం 15 నిమిషాలు మాత్ర‌మే ఉండే పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు నాగార్జున‌. ఈ పాత్ర‌ను ఒప్పుకోడానికి కార‌ణం కూడా స్వ‌యంగా అయ‌న్.. క‌ర‌ణ్ క‌లిసొచ్చి త‌న‌కు క‌థ చెప్పార‌ని.. అయితే క‌థ కంటే ముందు త‌న‌కి 3డి వ‌ర్ష‌న్ లో ఈ పాత్ర ఎలా ఉంటుందో చూపించార‌ని చెప్పాడు నాగార్జున‌. ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయే పాత్ర కాద‌ని.. క‌చ్చితంగా ఈ చిత్రంతో త‌న‌కు కూడా అద్భుత‌మైన పాత్ర ఉంద‌ని.. అందుకే స్క్రీన్ ప్ర‌జెన్స్ త‌క్కువ‌గా ఉన్నా కూడా బ్ర‌హ్మాస్త్ర చేయ‌డానికి ఒప్పుకున్నాన‌ని చెప్పాడు నాగార్జున‌.
అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా ఉన్నాడు క‌దా.. అందుకే న‌టించేస్తున్నాన‌ని చెప్పాడు నాగ్. దాంతోపాటు త‌మిళ సినిమాలో కూడా ఈయ‌న న‌టించ‌బోతు న్నాడు. అయితే ఈ చిత్ర వివ‌రాలు మాత్రం చెప్ప‌లేదు. ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం ఉండబోతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ర‌జినీ కోసం రాసుకున్న క‌థ‌లో నాగ్ న‌టించ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. ఇలా తెలుగుతో పాటు ఇప్పుడు అన్ని భాష‌ల్లోనూ దున్నేస్తున్నాడు నాగార్జున‌.

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange