నాగబాబు వెన‌క ఎవ‌రున్నారంటే…

నాగబాబు సొంతంగానే ఇంతగా రెచ్చిపోతున్నాడా.. ఈయనకు వెనక ఎవరు అండగా లేరా.. ఒక్కడే ఇంతగా యుద్ధం ఎలా చేస్తున్నాడు.. నందమూరి కుటుంబంతో పాటు బాలకృష్ణతో కావాలని ఎందుకు సమరం సాగిస్తున్నాడు.. ఇదే ఇప్పుడు అభిమానుల మనసులో ఉన్న ప్రశ్నలు. దీనికి సమాధానం ఎవరు చెప్పట్లేదు అలాగ‌నీ నాగబాబు మాత్రం యుద్ధం అవట్లేదు.. తాజాగా మరో కామెంట్ విడుదల చేసి బాలకృష్ణని టార్గెట్ చేశాడు మెగా బ్రదర్. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రాజకీయ జీవితం గురించి అడిగినప్పుడు కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు బాలకృష్ణ. రాజకీయాల్లోకి సినిమా వాళ్లు రావడం కొత్త కాకపోవచ్చు కానీ వచ్చిన ప్రతి వాళ్ళు సంచలనాలు సృష్టించలేరు అని చెప్పాడు బాలయ్య.
అమితాబ్ బ‌చ్చన్ వచ్చి ఏం పీకాడు.. చిరంజీవి ఏమయ్యాడో మనకు తెలియదా మాట్లాడాడు బాలయ్య. మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అందరికీ మాలాగా చరిత్ర సృష్టించడం రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు బాలయ్య. దీనిపైనే ఇప్పుడు కామెంట్ విడుదల చేశాడు నాగబాబు. మీరేం దైవాంశ సంభూతులు కాదు.. మామూలు మనుషులే.. అవతలి వాళ్లని గౌరవించడం నేర్చుకోండి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్. మీరు అంత గొప్ప వాళ్ళు అయినప్పుడు మీ తండ్రిని సొంత అల్లుడు వెన్నుపోటు పొడుస్తుంటే ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించాడు.
ఏం మీరు మాత్రమే సంచలనాలు సృష్టించాలా.. ఓసారి ఓడిపోయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్లు కాదు ఒక్క సారి గెలిస్తే జీవితమంతా గెలిచినట్లు కాదు అంటూ వేదాంతం చెప్పాడు నాగబాబు. ఇలాంటి నిరంకుశత్వ మాటలు ఆపుకుంటే మంచిది అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అమితాబ్ బ‌చ్చ‌న్ అంటే ఎన్టీఆర్, ఎమ్జీఆర్, క‌న్న‌డ రాజ్ కుమార్ లాంటి హీరోనే. అలాంటి తండ్రి వ‌య‌సున్న హీరో గురించి అలా మాట్లాడ‌తారా అంటూ సీరియ‌స్ అయ్యాడు నాగ‌బాబు. ఇప్పటివరకు కేవలం మూడు కామెంట్లు మాత్రమే విడుదల చేశాడు.. మరో మూడు బ్యాలెన్స్. అవి కూడా వచ్చిన తర్వాత ఈ యుద్ధం ఎంతదూరం వెళ్తుంది అనేది క్లారిటీ రానుంది.

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange