‘మసక్కలి’ మూవీ రివ్యూ

ప్రేమ కథలు మనకు కొత్త కాదు. అందుకే ప్రతీ దర్శకుడు తన ప్రేమ కథలో కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తాడు. మసక్కలి చిత్రం మాత్రం అన్ని ప్రేమ కథలకు భిన్నంగా ఉండబోతుందని చెప్పారు. ఓ సైకలాజికల్ లవ్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ‘మసక్కలి’వినాయకచవతి సందర్భంగా సెప్టెంబర్ 13న విడుదలైంది. సాయి రోనక్ హీరోగా నటించగా, హీరోయిన్లుగా శ్రావ్య, శిరీష
నటించారు. మరి ఈ ప్రేమ కథ ఎంత భిన్నంగా ఉంది… ప్రేక్షకులకు ఈ కొత్త రకం ప్రేమ కథ నచ్చే అవకాశముందో చూద్దాం.

కథేంటంటే….
సూర్య (సాయి రోనక్) ఓ రైటర్ కొడుకు. సైకియాట్రిస్ట్ గా అప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తాడు. అలా తన మొదటి కేసులో భాగంగా శృతి (శ్రావ్య)ని కలుస్తాడు. ఆమె ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తుంది. ఆమె అసలు అలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలుసుకునేందుకు సుర్య ప్రయత్నిస్తుంటాడు. తమ కంపెనీ టాప్ రేంజ్ లో ఉండాల నేది శృతి కోరిక. మరో వైపు సూర్య ఓ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఆ అమ్మాయి ఎవరో తెలిీదు. మళ్లీ కనిపించదు కూడా. తన ఏంజెల్ ఆకాంక్ష (శిరీష) కోసం వెతుకుతుంటాడు. ఆమె ఎక్కడుందో శృతి ద్వారా తెలుసుకుంటాడు. అక్కడికి వెళ్లే సరికి ఆకాంక్ష చనిపోయిందని తెలుసుకుంటాడు. కానీ తన ఆకాంక్ష తనతోనే ఉందనే భ్రమలో ఉంటాడు సూర్య

ఇంతకు శృతి మానసికంగా ఒక్కోసారి ఒక్కోలాగ ఎందుకు మారుతుంది. తన ప్రవర్తనలో ఆ మార్పు రాపడానికి కారణం ఏంటి. సుర్య శృతిలో ఎలాంటి పరిస్థితిని గమనించాడు. సూర్య ఏంజెల్ నిజంగానే చనిపోయిందా… సూర్య తన ప్రేమను పొందగలిగాడా లేదా ఈ విషయాలు తెలియాలంటే మాత్రం థియేటర్లో సినిమా చూడాల్సిందే.

సమీక్ష
సాయి రోనక్ గతంలో చేసిన సినిమాలకు ఈ చిత్రం భిన్నంగా ఉంది. సైకియాట్రిస్ట్ గా, ప్రేమికుడిగా తన పాత్రలో ఒదిగిపోయాడు. పాత్రకు సరిగ్గా సరిపోయాడు. ఎమోషన్స్ తో కూడిన పాత్రని సరిగ్గా ప్రెజెంట్ చేయగలిగాడు. ఈ క్యారెక్టర్ సాయికి మంచి పేరు తీసుకొస్తుంది. హీరోయిన్ గా శ్రావ్యకి డిఫరెంట్ షేడ్స్ ఉండే క్యారెక్టర్ దొరికింది. డిఫరెంట్ డైమన్షన్స్ ఉంటాయిందులో. డబ్బున్న వ్యాపారవేత్తగా, తన లోని ప్రేమను తనలోనే దాచుకునే ప్రేమికురాలిగా… రకరకాల షేడ్స్ చూపించింది. శిరీష సైతం ఆకాంక్ష పాత్రలో మెప్పించింది. తనదైన హావ భావాలతో ఆకట్టుకుంది. కాశీ విశ్వనాథ్, నవీన్ నేని, దేవదాస్ కనకాల, రాం జగన్, రవివర్మ, లక్ష్మీ వాసుదేవన్, భావన విజయ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

కొన్ని కథలు విని నమ్ముతాం.. కొన్ని కథలు చూసి నమ్ముతాం.. మరికొన్ని కథలు చూసినా నమ్మలేని విధంగా ఉంటాయి.. అలాంటిదే మసక్కలి కథ. దర్శకుడు ఈ కాంప్లికేటెడ్ కథను బాగా డీల్ చేయగలిగాడు. తొలి చిత్రమైనప్పటికీ అనుభవమున్న దర్శకుడిలా ఎమోషన్స్ ని పండించగలిగాడు. ఇప్పటి వరకూ చూడని విధంగా పాత్రలు డిజైన్ చేశాడు. ఒకట్రెండు సినిమాలు ఈ తరహాలో వచ్చినప్పటికీ… సన్నివేశాలు, సందర్భాలు వేరుగా ఉన్నాయి. యూత్ పుల్ లవ్ లో కొత్త డైమన్షన్ ని ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు నబి యేనుగుబాల సక్సెస్ అయ్యారు. యూత్ ని ఆకట్టుకునే అంశాలతో పాటు ఒక కొత్త పాయింట్ ని డిస్కస్ చేశారు.
మనకు సైకలాజికల్ లవ్ స్టోరీస్ చాలా తక్కువ. అలాంటిది తక్కువ బడ్జెట్ లో ఎక్కువ క్వాలిటీగా మసక్కలి చిత్రాన్ని రూపొందించారు. ఒక కొత్తరకమైన అనుభూతిని ఈ చిత్రం ద్వారా అందించారు. ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీ యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా కామెడీతో నవ్వించారు.

మిహిరామ్స్ మ్యూజిక్ బాగుంది. ఈ సినిమాకు పాటలు బాగా ప్లస్ అయ్యాయి. ప్రతీ పాట విభిన్నంగా ఉండి ఆకట్టుకుంది. రీ రికార్డింగ్ తో ప్రతీ సన్నివేశాన్ని హైలైట్ చేయగలిగాడు. సుభాష్ దొంతి కెమెరా వర్క్ బాగుంది. నటీనటుల్ని బ్యూటిఫుల్ గా చూపించాడు. నిర్మాత నమిత్ సింగ్ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా…. దర్శకుడు నబి కొత్త రకం ప్రేమ కథను ట్రై చేశాడు. దర్శకుడి కథ, కథనం డిఫరెంట్ గా ఉన్నాయి. యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలున్నాయి. మంచి పాటలు, కామెడీ రిఫ్రెషింగ్ గా ఉంటాయి. అయితే సెకండాఫ్ మరీ సీరియస్ గా మారడం మైనస్ గా మారింది. ద్వితియార్థం గురించి కాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. ఓవరాల్ గా … మసక్కలి టైంపాస్ న్యూ ఏజ్ లవ్ స్టోరీ.

PB Rating : 3/5

Wordpress Social Share Plugin powered by Ultimatelysocial
Secured By miniOrange