మంచు కురిసే వేళలో మూవీ రివ్యూ

మంచు కురిసే వేళలో మూవీ రివ్యూ

కొత్త దర్శకులు ప్రేమ కథల్ని కొత్తగా ప్రెజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచు కురిసే వేళలో చిత్ర దర్శకుడు సైతం కొత్త పాయింట్ ను చెప్పేందుకు ట్రై చేశాడని ట్రైలర్స్ చూస్తే అర్థమైంది. టైటిల్ కు తగ్గట్టుగా మరి మంచు కురిసే వేళలో హాయిని గొల్పే ప్రేమ కథను అందించిందా లేదా చూద్దాం.

కథేంటంటే :

ఆనంద్ కృష్ణ(రామ్ కార్తీక్) తన ఇంజనీరింగ్ ను పూర్తి చేసి రేడియో సిటీలో రేడియో జాకీగా పనిచేస్తుంటాడు. ఒక రోజు అనుకోకుండా గీత(ప్రనలి ఘోఘరే) ని చూసి మొదటి చూపులోనే ఇష్టపడతాడు. ఆమె కూడా అతను చదివే కాలేజ్ లోనే చేరడంతో ఇద్దరి మధ్య మెల్లగా స్నేహం చిగురిస్తుంది. దాంతో మొదటి చూపుతోనే ప్రేమలో పడ్డ ఆనంద్ తన ప్రేమను గీతకు చెప్పేద్దాం అనే లోపు గీత ఆనంద్ కు ప్రకాష్(యశ్వంత్) అనే వ్యక్తితో తనకి ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని చెప్పి షాకిస్తుంది. అసలు ఈ ప్రకాష్ ఎవరు? గీతకి అతనికి ఉన్న సంబంధం ఏమిటి? చివరికి ఆనంద్ ,గీత విషయంలో తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అన్నది తెరపై చూడాల్సిందే.

సమీక్ష
ఈ చిత్రానికి ప్రధాన ప్లస్ పాయింట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఫస్ట్ హాఫ్ కి సెకండాఫ్ కు అస్సలు సంబంధం ఉండదు. చాలా వేరియేషన్ చూపిచింది. ఫుల్ జోష్ తో సెకండాఫ్ లో నటించింది. ఈ సీన్స్ ప్రేక్షకలకు మంచి థ్రిల్ ని ఇస్తాయి. ఇక ఫస్టాఫ్ లో హీరో హీరోయిన్ ని ఇష్టపడే సీన్స్, ఫ్రెండ్స్ తో సరదాగా గడిపే సీన్స్ రేడియో స్టేషన్ లో చమ్మక్ చంద్ర చేసే కామెడీ పంచులు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తాయి. హీరో రామ్ కార్తీక్ ప్రేమికుడి గా తన బెస్ట్ పెర్ ఫార్మెన్స్ అందించాడు. చాలా సీన్స్ లో మెచూరిష్ నటన చూపించాడు. సెకండాఫ్ లో యశ్వంత్ నటన సిన్సియర్ గా బాగుంది.
హీరోయిన్ ప్రనలి ఘోఘరే ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా నిలిచింది. ప్రముఖ హాస్య నటునిగా పలు చిత్రాల్లో నటించిన దివంగత కమెడియన్ విజయ సాయి తన పాత్రకు సరైన న్యాయం చేకూర్చారు. జబర్దస్త్ ఫేమ్ చమ్మక్ చంద్ర తనదైన మార్క్ కామెడీతో బాగానే అలరిస్తారు. సినిమా అసలు కథలోకి వెళ్ళడానికే టైం ఎక్కువగా తీసుకున్న హృద్యంగా చెప్పాడు. సెకండాఫ్ కి వచ్చే సరికి కొత్త సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ మరో ఇంపార్టెంట్ సీన్స్ తో ముగుస్తుంది. క్యూరియా సిటీ కూడా పెంచాడు దర్శకుడు.

దర్శకుడు యూత్ ఫుల్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయగలిగాడు. ఎమోషనల్ సీన్స్ తో మెప్పించాడు. ఫ్యామిలీ బాండింగ్ కెరీర్ ని కూడా చూపించాడు. నిర్మాతలు చాలా క్వాలిటీ సినిమా అందించారు. చిన్న సినిమా అనే ఫీలింగ్ ఎక్కడా రానివ్వలేదు. సంగీతం అందించిన శ్రవణ్ భరద్వాజ్ న్యాయం చేశాడు. సినిమాటోగ్రఫీ బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ఊటీలో చిత్రీకరించిన సీన్లు చాలా బాగున్నాయి. బాల బోడేపూడి దర్శకుడిగా సక్సెస్ అయినట్టే. ప్రేమకథపై మంచి లైన్ ని ఎంచుకుని దానిని అందంగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యాడు.

ఓవరాల్ గా… ప్రేమ కథా చిత్రాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు దర్శకుడు. లవ్, కామెడీ, ఎమోషన్ ని బాగా బ్యాలెన్స్ చేశాడు దర్శకుడు. యూత్ ని ఎంటర్ టైన్ చేసే అంశాలతో తెరకెక్కిన మంచు కురిసే వేళలో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. సో గో అండ్ వాచ్.

PB Rating : 3/5

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange