ప‌ని ముగించుకున్న మ‌హేష్ బాబు..

మ‌రో షెడ్యూల్ పూర్తి చేసాడు మ‌హేశ్ బాబు. నెమ్మ‌దిగా సాగుతున్న‌ట్లు అనిపించిని చాలా వేగంగా మ‌హ‌ర్షి షూటింగ్ అయిపోతుంది. అమెరిక‌న్ షెడ్యూల్ కు ఇప్పుడు గుడ్ బై చెప్పేసాడు మ‌హేశ్ బాబు. అక్క‌డ నెల రోజులుగా ఉన్నాడు సూప‌ర్ స్టార్. కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాలు పూర్తి చేసాడు వంశీ పైడిప‌ల్లి. ఇండియాలో ఉన్న‌పుడు గ‌డ్డం మీసాల‌తో క‌నిపించిన‌ మ‌హేష్ బాబు.. అమెరికా వెళ్లిన త‌ర్వాత‌ పూర్తిగా కొత్త లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చాడు.
ఇక ఇప్పుడు ఈ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుని న‌వంబ‌ర్ 2న చిత్ర‌యూనిట్ తో పాటే ఇండియాకు వ‌చ్చేస్తున్నాడు మ‌హేశ్ బాబు. వ‌చ్చీ రాగానే దివాళి సెలెబ్రెట్ చేసుకోనున్నాడు మ‌హేశ్. ఆ త‌ర్వాత కొత్త షెడ్యూల్ గురించి ఆలోచించాల‌ని ఫిక్స‌య్యాడు. ఇప్పుడు తెలుస్తున్న దాన్నిబ‌ట్టి చూస్తుంటే న‌వంబ‌ర్ 15 నుంచి హైద‌రాబాద్ లోనే కొత్త షెడ్యూల్ మొద‌లు కానుంద‌ని తెలుస్తుంది. పూజాహెగ్డే కూడా ఈ షెడ్యూల్ లో మ‌హేష్ తో జాయిన్ కానుంది.
ముందు ఇదే ఏడాది టాకీ పూర్తి చేయాల‌ని వంశీ అనుకున్నా కూడా ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే అది వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు పొడుగ‌య్యేలా ఉన్నాయి. మార్చ్ లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్.. అనుకున్న‌ట్లుగానే ఎప్రిల్ 5న సినిమా విడుద‌ల చేయాల‌ని అంతా ప్లాన్ చేసుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. దిల్ రాజు, అశ్వినీద‌త్, పివిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ న‌వంబ‌ర్ లోనే విడుద‌ల కానుంది. అప్ప‌టి వ‌ర‌కు ఈ ఎదురుచూపులు త‌ప్ప‌వు.

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange