మ‌హేష్ భ‌లే ఎంజాయ్ చేస్తున్నాడుగా..

హీరోల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేసేది ఎవ‌రు అంటే మ‌రో మాట లేకుండా మ‌హేశ్ బాబు అని చెప్పొచ్చు. ఆయ‌న కాకుండా ఎవ‌రూ అంత‌గా సినిమా షూటింగ్ కూడా అంత‌గా ఎంజాయ్ చేయ‌లేరు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు సూప‌ర్ స్టార్. మ‌హ‌ర్షి కోసం మ‌హేశ్ దేశం దాటి చాలా రోజులైంది. అక్క‌డే ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. ఓ వైపు షూటింగ్.. మ‌రోవైపు ఔటింగ్ రెండూ కానిచ్చేస్తున్నాడు ఈ హీరో. తాజాగా కుటుంబంతో క‌లిసి ఫుల్ చిల్ అవుతున్నాడు ఈ సూప‌ర్ స్టార్. వంశీ పైడిప‌ల్లి కూడా ఈ చిత్రానికి మూడు రోజులు బ్రేక్ ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. దాంతో అక్క‌డే ఉన్న రెస్టారెంట్స్ అన్నీ తిరిగేస్తున్నాడు మ‌హేష్ బాబు.
ఆయ‌న‌తో పాటు గౌత‌మ్ సితార కూడా ఉన్నారు. పిల్ల‌లు ఉండ‌టంతో మ‌హేశ్ కు కాలం కూడా గుర్తు రావ‌డం లేదు. సెప్టెంబ‌ర్ లోనే మొద‌ల‌వ్వాల్సిన ఈ షెడ్యూల్ కాస్తా వీసాల ఆల‌స్యంతో అక్టోబ‌ర్ కి వెళ్లిపోయింది. మొన్నే మొద‌లైన ఈ షూట్ మ‌రో 20 రోజులు అక్క‌డే జ‌ర‌గ‌బోతుంది. ఇందులో అల్ల‌రి న‌రేష్ కూడా పాల్గొంటాడ‌ని తెలుస్తుంది. ఈయ‌న కూడా సినిమాలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ప్రస్తుతం హౌజ్ ఫుల్ 4తో బిజీగా ఉన్న పూజాహెగ్డే కూడా మ‌హేశ్ సినిమాలో జాయిన్ కానుంది.
ఇదే ఏడాది టాకీ అంతా పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు వంశీ. వ‌చ్చే ఏడాది ఉగాది కానుక‌గా ఎప్రిల్ 5న విడుద‌ల కానుంది ఈ చిత్రం. మ‌హ‌ర్షిని దిల్ రాజు, అశ్వినీద‌త్, పివిపి నిర్మిస్తున్నారు. రైతు స‌మ‌స్య‌ల ఆధారంగా మ‌హ‌ర్షి తెర‌కెక్కుతోంది. అయితే క‌థ విష‌యంలో మ‌రోసారి వంశీతో దిల్ రాజు కూర్చున్నాడ‌ని.. వ‌ర‌స ఫ్లాపుల‌తో ఈయ‌న‌లో మార్పులు వ‌చ్చాయ‌ని తెలుస్తుంది. మ‌రి చూడాలిక‌.. అంతా క‌లిసి మ‌హ‌ర్షిని ఏం చేయ‌బోతున్నారో..?

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange