మ్యాగ్నేట్ మూవీ రివ్యూ

జోనర్ : యాక్షన్ రొమాంటిక్ డ్రామా.
నటి – నటులు : సాక్షి చౌదరి, పోసాని కృష్ణ మురళి,
అక్షిత, పూజిత పొన్నాడ, అవంతిక, పర్వీన్ రాజు, అభినవ్ సర్దార్, జబర్దస్త్గ్ రాకేశ్, గెటప్ శ్రీను, శ్రావని, సందీప్తి, అప్పారావు,
సంగీతం : డాక్టర్ కిషన్ కావాడియా.
కెమెరా : కె. శంకర్.
ఎడిటర్ : నందమూరి హరి.
మెనేజేర్ : లక్ష్మన్ కోయిడల.
విడుదల: మార్చి 15
రేటింగ్ : 3. 25/5
కథ : పేరెంట్స్ శ్రద్ధ లేకుండా హాస్టల్ లో చదువకుంటున్న నలుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు వాళ్ళ వాళ్ళ జీవితాలను ఏలా నాశనం చేసుకుంటున్నారు, చివరికి ఏం అయ్యారు..? దీంట్లో అమ్మ నాన్న ప్రేమ, అభిమానం, బాద్యత పొందలేని సాక్షి చౌదరి జీవితం తన జీవితాన్ని ఏలా నాశనం చేసుకుంది అనేది కథాంశం. పోసాని మురళి కృష్ణ పాత్ర సినిమాలో ఏలా కీలకంగా మారింది..? అనేది కథ. ఓవరాల్ గా చెప్పాలంటే ప్రస్తుత సమాజం లో యువత మధ్య నడుతున్న కథ. తల్లి దండ్రులకు, యువతకు కనువిప్పు కలిగించే కథ ఇది.

సాంకేతిక విభాగం: సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా చెప్పుకోవలిసింది మ్యూజిక్ డైరెక్టర్ కిషన్ కవాడియా గురించి, తను అందించిన సంగీతం చాలా బాగుంది. పాటలలో కూడా మంచి సాహిత్యం వినపడుతుంది. కె.శంకర్ కెమరా పనితనం కూడా బాగుంది. అయితే దర్శకుడు కథ మాటలు కథనం మనల్ని కథతో పాటుగా నడిచేలా చేస్తాయి. మన సమాజంలో జరుగుతున్న కథలా అనిపిస్తుంది ఈ కథ. ఎడిటర్ ఈ సినిమా మీద ఇంకొంచెం శ్రద్ధ తీసుకోని ఉంటే బాగుండు అనిపిస్తుంది. విజువల్ పరంగా కూడా కొన్ని కొన్ని సన్నివేశాలు సగటు ప్రేక్షకుడిని ఇబ్బందికి గురిచేస్తాయి. ప్రొడక్షన్ విలువలు పర్వాలేదు. ఈ మ్యాగ్నేట్ చిత్రం మాత్రం పేరెంట్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.
ప్లస్ పాయింట్స్ :
కథ
మ్యూజిక్
సాక్షి చౌదరి, పోసాని నటన.
మాటలు
దర్శకత్వం
మైనస్ పాయింట్స్ :
ఎడిటింగ్
లోకేషన్లు
ఆర్ట్ వర్క్
కొన్ని సన్నివేశాలు.
చివరగా : ఈ వారం విడుదల అయిన ఈ మ్యాగ్నేట్ సినిమాతో యూత్ కి పండగ అని చెప్పొచ్చు. స్టూడెంట్స్ కి తల్లిదండ్రులకు ఒక పాటం నేర్పించే మంచి కథ దీంట్లో ఉంది. దర్శకుడు తీసుకున్న సబ్జెక్ట్ బాగుంది. నటీనటుల నటన బాగుంది. పిల్లలను తల్లిదండ్రులు అశ్రద్ధ చేస్తే వాళ్ళు ఏలా చెడిపోతారు అనేది వివరంగా చూపించారు దర్శకుడు. మొత్తంగా అయితే ఈ మ్యాగ్నేట్ మనకు అయస్కాంతం లా అతుక్కోవడం ఖాయం.
మా మాట : మనసుకి అతుక్కుంటుంది – మనసుని హత్తుకుంటుంది.

Wordpress Social Share Plugin powered by Ultimatelysocial
Secured By miniOrange