శివాజీ రాజా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు – నరేష్ ఆవేదన

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా ) ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరిగిన విషయం తెలిసిందే.. ఈ పోటీల్లో నరేష్ శివాజీ రాజా ప్యానల్ పై అత్యధికంగా గెలుపొందారు. కాగా ఈ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఈ నెల 22న జరగనుంది. అయితే శివాజీ రాజా పదవీకాలం ఈ నెల 31 వరకు ఉండటంతో కొత్త బాడీ అప్పటి వరకు మా కుర్చీలో ఎవరు కూర్చో వద్దు లేనిచో కోర్టుకు వెళ్తానని శివాజీ రాజా ఫోన్ చేసి బెదిరిస్తున్నారని నరేష్ ఆవేదన వ్యక్తం చేసారు. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కృష్ణమోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
మా నూతన అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ… మా లో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవం. అవన్నీ మర్చిపోయి మా గుట్టు బయట పడకుండా అందరినీ కలుపుకు పోయి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అయినా మమ్మల్ని వర్క్ చేయకుండా వెనక్కి లాగుతున్నారు. ఇండస్ట్రీ పెద్దల అంగీకారంతో వారి సమక్షంలో ఈ 22న మంచి ముహూర్తం ఖరారు చేసుకొని ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నాం.. శివాజీ రాజా నా పదవీకాలం 31 వరకు ఉంది అప్పటి వరకు ఎవరూ మా కుర్చీ లో కూర్చో వద్దు అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు… మేము చేయాల్సిన పనులు చాలా వున్నాయి. పెద్దలు ఎలా చెప్తే అలా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం… అన్నారు. ఈ కార్యక్రంలో వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్, జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్, ఈసీ మెంబర్స్ పాల్గొన్నారు.

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange