కురుక్షేత్రం మూవీ రివ్యూ

యాక్షన్ హీరో అర్జున్ కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన హీరోగా నటించినా, క్యారెక్టర్ పోషించినా… ఆయన స్థానం ప్రత్యేకం. అందుకే అభిమానులు ఆయన సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. మరి అలాంటి యాక్షన్ హీరో అర్జున్ నటించిన 150వ సినిమా ఎంత ప్రత్యేకమో చెప్పక్కర్లేదు. యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన 150వ చిత్రం కురుక్షేత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత శ్రీనివాస్ మీసాల ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రానికి సాయికృష్ణ పెండ్యాల కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అరుణ్ వైద్యనాథన్ దర్శకుడు. మరి అర్జున్ తెలుగు ప్రేక్షకుల్ని తన యాక్షన్ తో ఎలా ఎంటర్ టైన్ చేశాడో చూద్దాం.

కథేంటంటే..
రంజిత్ ఇంటెన్సివ్ క్రైమ్ కేసెస్ ని డీల్ చేసే పోలీస్ ఆఫీసర్. అలాంటి రంజిత్ తన టీంలో హై ఇంటెన్స్ సీరియల్ మర్డర్ కేస్ ను టేకప్ చేస్తాడు. ఆ క్రైమ్ చేసేవాళ్లు క్లూజ్ ఇస్తుంటారు. ఈ మిస్టీరియస్ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారనే విషయం కనుక్కునే పనిలో రంజింత్ అండ్ టీం ఎలా సక్సెస్ అయ్యారనేది అసలు కథ.

సమీక్ష
కథ వింటుంటే ఇంట్రస్టింగ్ గా అనిపించినట్టుగానే… సినిమా చూస్తున్నప్పుడు మరింత ఇంట్రస్టింగ్ గా సాగుతుంది. అర్జున్ పెర్ ఫార్మెన్స్, స్టామినా ఈ సినిమాకూ చాలా ఉపయోగపడ్డాయి. స్టైలిష్ యాక్షన్ ను చూపించాడు. అర్జున్ మేజర్ ఎస్సెట్ గా నిలిచాడు. 150 సినిమాల తర్వాత కూడా స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఫిదా అవుతారు. అర్జున్ కాకుండా మెరవరు చేసినా ఈ క్యారెక్టర్ అంతగా నప్పేది కాదు. సుమన్, సుహాసిని డిగ్నిఫైడ్ రిచ్ కపుల్ గా కనపించారు. ప్రసన్న, వరలక్ష్మి కి మంచి క్యారెక్టర్ దొరికింది. చందన కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సైకో కిల్లర్ క్యారెక్టర్ చేసిన అతనికి మంచి పేరొస్తుంది.

సినిమా రేసీ స్క్రీన్ ప్లే తో వెళ్తుంది. సీరియల్ మర్డర్స్ వెనక ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీ పెంచాడు దర్శకుడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగా రాసుకున్నారు. ఈ సినిమాకు క్లైమాక్స్ పార్ట్ మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. సైకో కిల్లర్ క్యారెక్టర్ ని బాగా డిజైన్ చేశారు. యాక్షన్ పార్ట్ బాగుంది. యాక్షన్ సినిమాల్ని ఇష్టపడేవారికి ఈ యాక్షన్ పార్ట్ చాలా బాగా నచ్చుతుంది. హీరోకు, విలన్ కు మధ్య నడిచే డిస్కషన్స్ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఇన్వెస్టిగేటివ్ సీన్స్ బాగున్నాయి.

ఎస్.నవిన్ బ్యాక్ గ్రౌండ్ చాలా బాగుంది. చాలా సన్నివేశాలు హైలైట్ అయ్యేలా చేశాయి. సతిష్, సూర్య ఎడిటింగ్ బాగుంది. అరవింద్ కృష్ణ సినిమాటోగ్రఫి మెయిన్ హైలైట్ గా నిలిచింది. డబ్బింగ్ బాగుంది. డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ మాత్రం ఉండదు. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. స్టైలిష్ మేకింగ్ ఇంప్రెసివ్ గా ఉంటుంది. డైరెక్టర్ అరుణ్ డెప్త్ ఉన్న స్క్రీన్ ప్లే రాసుకున్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కథను నడిపించి సక్సెస్ సాధించారు.

చివరగా… స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాలు చూసే వారికి బెస్ట్ చాయిస్ కురుక్షేత్రం. అర్జున్ యాక్షన్, డైరెక్టర్ అరుణ్ స్క్రీన్ ప్లే, టేకింగ్ జనాలకు థ్రిల్ ను కలగజేస్తాయి. సో గో అండ్ వాచ్.

PB Rating : 3/5

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange