కార్తికేయ ఎంట‌ర్‌టైన్మెంట్ ప్రొడక్ష‌న్ నెం.1 ప్రారంభం

కార్తికేయ ఎంట‌ర్‌టైన్మెంట్ ప్రొడక్ష‌న్ నెం.1 ప్రారంభం

కార్తికేయ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకం పై ప్రొడ‌క్ష‌న్ నెం.1 కొత్త చిత్రం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది.
సుధీర్, ఆద్యా ఠాగూర్‌, అదితి హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నా ఈ చిత్రానికి ప్ర‌ణ‌య్ ద‌ర్శ‌కుడు. కార్తికేయ నిర్మాత‌. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో…

ద‌ర్శ‌కుడు ప్ర‌ణ‌య్ మాట్లాడుతూ – “ న్యూ జ‌న‌రేష‌న్ ల‌వ్ అండ్ లైఫ్ స్టోరి. కొన్నిరిఫ‌రెన్స్‌ల ఆధారంగా క‌థ త‌యారు చేసుకున్నాను. న‌వంబ‌ర్‌లో చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతుంది“ అని అన్నారు.

హీరో సుధీర్ మాట్లాడుతూ – “టీవీ సీరియ‌ల్స్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించాను. హీరోగా ఇది నా తొలి చిత్రం. ఆద్యా ఠాగూర్‌, అదితి క‌లిసి న‌టించ‌డం ఆనందంగా ఉంది. ఖ‌చ్చితంగా సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించేలా ఉంటుంది. హీరోగా నాకు మంచి బ్రేక్ తెచ్చేసినిమా అవుతుంద‌ని మీరంద‌రూ న‌న్ను త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ కుషేంద‌ర్ మాట్లాడుతూ – “క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమా చేయాల‌నుకున్న డైరెక్ట‌ర్ ఉన్న‌ట్లుండి లవ్ అండ్ లైఫ్ స్టోరీ క‌థ‌ను త‌యారు చేశారు. త‌న ఐడియాస్ అన్నీ కొత్త‌గా డిఫ‌రెంట్‌గా ఉంటాయి. క‌థ అద్భుతంగా రావ‌డంతో ఇదే కాన్సెప్ట్‌తో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌“ అన్నారు. ఈ చిత్రంలో న‌టించే హీరోయిన్స్ ఆద్య‌, అధితికి నా ఆల్ ద బెస్ట్ అని అన్నారు.

హీరోయిన్ ఆద్య మాట్లాడుతూ… నాకు ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశం ఇచ్చిన ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్‌గారికి నా కృత‌జ్ఞ‌త‌లు అంద‌రికి ద‌స‌రా శుభాకాంక్ష‌లు అని అన్నారు.

సుధీర్, ఆద్యా ఠాగూర్‌, అదితి హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: విఠ‌ల్, కెమెరామెన్‌: కుషేంద‌ర్‌, ఎడిట‌ర్‌: గ్యారీ, నిర్మాత‌: కార్తికేయ‌, ర‌చ‌న స‌హ‌కారం మ‌ద‌న్‌మోహ‌న్.

Wordpress Social Share Plugin powered by Ultimatelysocial
Secured By miniOrange