పూరీ ఏకలవ్య శిష్యుడు, తెలుగు డైరెక్టర్ కన్నడలో షాడోతో సంచలనం…..

సాధారణంగా ఇతర భాషా దర్శకులు తెలుగు సినిమాలు డైరెక్ట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఓ తెలుగు కుర్రాడు కన్నడ నాట దర్శకుడిగా సంచనలన సృష్టిస్తున్నాడు. షాడో అనే సినిమాతో వార్తల్లో నిలిచాడు. అతడే రవి గౌడ. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఏకలవ్య శిష్యుడీ కుర్రాడు. కన్నడలో ఓ సినిమాను సంపాదించడమే కష్టం అనుకుంటే… ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్ తో సెన్సేషన్ గా మారాడు. టీజర్ చూసిన కన్నడ ప్రజలు ఔరా అనుకున్నారు. పక్కా కమర్షియల్ ఫార్ములాతో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ తో సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. మాస్ హీరోగా మాంచి ఫాలోయింగ్ ఉన్న వినోద్ ప్రభాకర్ ఇందులో హీరో. అలాంటి మాస్ హీరోతో ఓ మాంచి క్లాస్ సాంగ్ చేయించి కాంప్లిమెంట్స్ అందుకుంటున్నాడు. కన్నడ ప్రభాకర్ తనయుడే ఈ వినోద్ ప్రభాకర్. వినోద్ ప్రభాకర్ కెరీర్లో డిఫరెంట్ మాస్ కమర్షియల్ హిట్ గా నిలిచే అవకాశం ఉందని అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవలే పూరీ జగన్నాథ్ ఈ క్లాస్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఆయన కూడా టీజర్, సాంగ్ చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడట. ఇప్పటికే తెలుగు నిర్మాతలు కొంతమంది ఈ సినిమా గురించి ఎంక్వైరీ చేస్తున్నారట. ఈ లెక్కన షాడో కన్నడ నాట రిలీజ్ అయిన తర్వాత రవికి తెలుగులో అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

శ్రీ కనకదుర్గ చలన చిత్ర బ్యానర్లో వెంకటరమణ చిగురుపాటి సమర్పణలో, చక్రవర్తి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. వినోద్ ప్రభాకర్ సరసన శోభిత రాణా నటించింది. అచ్చు సంగీతమందించాడు. చరణ్ అర్జున్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్.

Srikanakadhurga chalana Chitra with Venkataraman chigurupati presents..
Hero:-vinnod prabhakar.
Heroine :-Shobitha rana.
Sharath lohitashwa.Giri,Shravan,srigiri,Dhanraj,sathya Dev,Lokesh,Umesh,Bharani,Siri peddi,Priyanka,Baby sweety,..
Story :-Anand Ravi
D O P:-Manoharjoshi
Music :-Achu
background score ;-Charan Arjun
Editor:-Chota k prasad
fights;-vinod
Dance master:-Sudeer
Prodaction controller:Gagan murthy
P R O :Venkatesh
Producer:Chakravarthy
Screen play,
Dilouges,Direction:-Ravi Gowda

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange