నాటకం చిత్రం దర్శకుడి రెండో చిత్రం “కాదల్” ఫస్ట్ లుక్ విడుదల

నాటకం చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్స్ తో బిజినెస్ సర్కిల్స్ లో తెగ హడావిడి చేసి మంచి బిజినెస్ చేసింది. ఆ చిత్రానికి దర్శకుడు కళ్యాణ్ జి గోగణ. ఇప్పుడీ దర్శకుడి రెండో సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ప్రేమికుల దినోత్సవ కానుకగా విడుదల చేశారు. “కాదల్” పేరుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విశ్వాంత్ హీరోగా నటిస్తున్నాడు. ప్రేమ కథా చిత్రం కావడం… టైటిల్ నే ప్రేమ పేరుతో పెట్టడంతో ప్రేమికుల దినోత్సవాన్ని ఫస్ట్ లుక్ టైటిల్ ఎనౌన్స్ మెంట్ కి సరైన సమయంగా భావించి విడుదల చేశారు. త్వరలోనే ఈచిత్రం షూటింగ్ ప్రారంభమౌతుంది. 2004 లో జరిగిన రియల్ స్టోరీని తెరకెక్కిస్తుండడం విశేషం. నక్షత్ర మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్లో రాజశేఖర్ సమర్పణలో… జెకె క్రియేషన్స్ బ్యానర్లో కాశిం, యువ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాల మ్యూజక్ డైరెక్టర్ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతమందిస్తుండడం విశేషం. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తారు.

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange