ఐశ్వర్యాభిమస్థు మూవీ రివ్యూ

ఐశ్వర్యాభిమస్థు మూవీ రివ్యూ

ఆర్య, విశాల్, తమన్నా సినిమాలకు తెలుగులో బాగా క్రేజ్ వుంది. ఆర్య నటించిన నేనే అంభాని, రాజా రాణి తదితర చిత్రాలన్నీ తెలుగులో మంచి వసూళ్లనే సాధించాయి. అందుకే చాలా మంది నిర్మాతలు ఆర్య సినిమాలను తెలుగులో అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. తాజాగా వి.ఎస్.ఓ.పి అనే తమిళ చిత్రాన్ని తెలుగులోకి ఐశ్వర్యాభిమస్థు పేరుతో అనువాదం చేసి ఈ రోజే విడుదల చేశారు. ఆర్య సరసన తమన్నా నటించింది. కమెడియన్ సంతానం ఆర్య స్నేహితునిగా నటించారు. విశాల్ గెస్ట్ రోల్ పోషించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రం మరి తెలుగు ప్రేక్షకులని ఎలా అలరించిందో చూద్దాం

కథేంటంటే…
అభిమన్యు(ఆర్య), వాసు(సంతానం) ఇద్దరూ చిన్నప్పటి నుంచే కలిసి పెరుగుతారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. వాసుకి సీమా(భాను)తో వివాహం అవుతుంది. అయితే వివాహం అయిన మొదటి రోజే… అభిమన్యు ఆమెకు కొన్ని ట్విస్టులు ఇవ్వడంతో వాసు, సీమా మొదటి రాత్రికి దూరం అవుతారు. అభిమన్యుతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తే తప్ప నీతో సంసారం చేయనని సీమా భీష్మించుకు కూర్చుంటుంది. దాంతో ఎలాగైనా అభిమన్యుకి పెళ్లి చేసి.. అతనితో స్నేహాన్ని కట్ చేద్దాం అనుకుంటాడు వాసు. అందులో భాగంగానే ఐశ్వర్య(తమన్నా) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే అభిమన్యు ఆమెను ప్రేమిస్తాడు. అయితే ఆమె మాత్రం అభిమన్యును ప్రేమించదు. ఆమె ప్రేమ పొందడానికి నానా తంటాలు పడతాడు. తీరా ప్రేమ ఫలించి పెళ్లికి సిద్ధమయ్యేటప్పుడు వాసు.. కొన్ని ప్రశ్నలు వేసి ఐశ్వర్యను విసిగిస్తాడు. దాంతో ఆమె వాసుతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటే తప్ప నిన్ను వివాహం చేసుకోననే కండీషన్ పెడుతుంది. మరి అభిమన్యు.. వాసుతో తన స్నేహ బంధాన్ని వదిలించుకున్నాడా? చివరకు ఐశ్వర్యకు, అభిమన్యుకు వివాహం అయిందా? వాసు, సీమా వివాహ బంధం ఏమైదంది? తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే

సమీక్ష
ఫ్రెండ్స్ మధ్య సాగే సరదా కథ ఇది. ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ అని చెప్పొచ్చు. ప్రేమ, పెళ్లికి వ్యాల్యూ ఇవ్వాలా? స్నేహానికి వ్యాల్యూ ఇవ్వాలా అనే పాయింట్ మీద డైరెక్టర్ ఎం.రాజేష్ రాసుకున్న కథ.. కథనాలు చాలా ఇంట్రెస్టింగ్ గా.. వినోదాత్మకంగా తెరమీద చూపించారు. కామెడీనే ప్రధానంగా నమ్ముకున్నారు. ఈ చిత్రం ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించేస్తుంది. ఆర్య, సంతానం చేసిన క్లీన్ కామెడీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. మొదట్లో సంతానం పెళ్లి ఎపిసోడ్ గానీ.. ఆ తరువాత సంతానం, భాను మధ్య వచ్చే మొదటి రాత్రి ఎపిసోడ్ గానీ చాలా హ్యూమరస్ గా తెరకెక్కించారు. అలానే ఆర్య తన ప్రేమను దక్కించడం కోసం తమన్నా చుట్టూ తిరిగే కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. విద్యుల్లతను ప్రేమిస్తున్నట్టు నటించే సీన్లన్ని ప్రేక్షకులను కూర్చిలో కూర్చే బెట్టేవే. అలానే ప్రీ క్లైమాక్స్ వచ్చే షకీలా గెస్ట్ అప్పియరెన్స్ సీన్ కూడా బాగుంది. ఇక క్లైమాక్స్ లో మాస్ హీరో విశాల్ గెస్ట్ అప్పియరెన్స్ సినిమాకి మరింత బూస్ట్ నిస్తుంది. పెళ్లాలకు, స్నేహితులకు మధ్య వుండాల్సిన తేడా గురించి వైన్, బీరుతో పోల్చి చెప్పడం బాగుంది. ఓవరగాల్ గా ‘ఐశ్వర్యాభిమస్తు’ చిత్రం హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ.
నటీనటులు ఎలా చేశారంటే….
ఆర్య ఎప్పటిలానే తన మార్కు కామెడీ టైమింగ్ తో అలరించాడు. అతనికి తోడు సంతానం కావడంతో సినిమా మొత్తం వీరిద్దరే నడిపించారు. వీరికి మంచి సంభాషణలు కూడా రాయడంతో పంచ్ ల మీద పంచ్ లతో ఎంటర్టైన్ చేశారు. అలానే తమన్నా కూడా ఓ వైపు గ్లామర్ గా కనిపిస్తూనే.. మరో వైపు తను కూడా అక్కడక్కడ కామెడీతో ఆకట్టుకోవడానికి ట్రై చేసింది. విద్యుల్లత కామెడీ బాగుంది. ఆర్యతో వచ్చే ఈమె ప్రేమ సన్నివేషాలు హిలేరియస్ గా వున్నాయి. కమెడియన్ కరుణాకరన్ కూడా చివర్లో నవ్వించడానికి ట్రై చేశారు. భాను.. సంతానం భార్యగా మెప్పించింది. చివర్లో విశాల్ ఎంట్రీ కూడా బాగుంది. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కూడా ఓ భార్య బాధితుడే అని చెప్పడానికి అతని పాత్రను బాగా డిజైన్ చేశారు దర్శకుడు. షకీలా గెస్ట్ అప్పియరెన్స్ లో కాసేపు వున్నా ఆకట్టుకుంది.

దర్శకుడు ఎలా చేశాడంటే…
దర్శకుడు రాజేష్ గతంలో ఆర్యతో నేనే అంబాని చిత్రాన్ని చేసి విజయం సాధించారు. ఆ తరువాత మళ్ళీ ఆర్యతో కలిసి ఈ చిత్రాన్ని చేసి విజయం సాధించారు. కామెడీనే ప్రధానంగా నమ్ముకుని తీసే ఈయన చిత్రాలు అన్ని బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకున్నవే. ఈ చిత్రం కూడా హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దడంతో ప్రేక్షకులు ఆదరిస్తారు. పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం కామెడీ సీన్లకు బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. తమన్నా అందాలు బాగా చూపించారు. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా…
ఆర్య సినిమాలను ఇష్టపడే వారు తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు…

Rating : 3/5

Social media & sharing icons powered by UltimatelySocial
Secured By miniOrange